GAMBHIR-DHONI: ధోనిని ఆకాశానికెత్తేసిన గంభీర్‌! అతడి స్థాయిని ఎవ్వరూ చేరుకోలేరంటూ..!

ఎప్పుడూ ధోనిపై విమర్శలు గుప్పించే గౌతమ్ గంభీర్ తాజాగా అతడిని ప్రశంసలతో ఆకాశానికెత్తేశాడు. ధోని రేంజ్ ను ఎవ్వరూ చేరుకోలేరని కితాబిచ్చాడు. మరిన్ని వివరాల్లోకి వెళితే..

ఎప్పుడూ ధోనిపై విమర్శలు గుప్పించే గౌతమ్ గంభీర్ తాజాగా అతడిని ప్రశంసలతో ఆకాశానికెత్తేశాడు. ధోని రేంజ్ ను ఎవ్వరూ చేరుకోలేరని కితాబిచ్చాడు. మరిన్ని వివరాల్లోకి వెళితే..

గౌతమ్ గంభీర్.. ఐపీఎల్ 2024 సీజన్ లో కోల్ కత్తా నైట్ రైడర్స్ టీమ్ ను మెంటర్ గా ముందుండి నడిస్తున్నాడు. గంభీర్ పర్యవేక్షనలో కేకేఆర్ టీమ్ అద్భుతంగా రాణిస్తోంది. ఈ సీజన్ లో ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్ ల్లో మూడు విజయాలు సాధించి.. పాయింట్ల పట్టికలో రెండో ప్లేస్ లో కొనసాగుతోంది. దీంతో కేకేఆర్ ను విజయపథంలో నడిపిస్తున్న గంభీర్ ను మాస్టర్ మైండ్ అంటూ.. మాజీ క్రికెటర్లు, నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇదిలా ఉండగా.. సోమవారం(ఏప్రిల్ 8) చెన్నై సూపర్ కింగ్స్ తో తలపడనుంది కోల్ కత్తా టీమ్. ఈ సందర్భంగా చెన్నై మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిపై ప్రశంసల వర్షం కురిపించాడు గౌతమ్ గంభీర్.

ఐపీఎల్ లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్దమైంది. చెపాక్ స్టేడియం వేదికగా కేకేఆర్ వర్సెస్ చెన్నై టీమ్స్ ఢీకొంటున్నాయి. ఈ మ్యాచ్ కు ముందు మహేంద్రసింగ్ ధోనిపై ప్రశంసల వర్షం కురిపించాడు కేకేఆర్ మెంటర్, టీమిండియా మాజీ ప్లేయర్ గౌతమ్ గంభీర్. ఈ సీజన్ లో కోల్ కత్తా టీమ్ ను అద్భుతంగా ముందుకు తీసుకెళ్తున్నాడు గంభీర్. ఇక ఈ కీలక మ్యాచ్ లో సైతం నెగ్గి తమకు తిరుగేదని నిరూపించుకోవాలని భావిస్తున్నాడు. ఈ క్రమంలోనే ధోనిని ఆకాశానికి ఎత్తేశాడు. అయితే ఎప్పుడూ ధోనిని విమర్శించే గంభీర్ ఇలా ప్రశంసించడం ఏంటని నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

గౌతమ్ గంభీర్ మాట్లాడుతూ..”నా దృష్టిలో మహేంద్రసింగ్ ధోని మోస్ట్ సక్సెస్ ఫుల్ కెప్టెన్. అతడి స్థాయిని చేరుకోవడం ఎవ్వరి వల్లా కాదు. పైగా అతడు 3 ఐసీసీ ట్రోఫీలను సాధించాడు. ఇది అన్నింటికన్నా ఎంతో గొప్ప విషయం. ఇక గ్రౌండ్ లో ధోని ఎంతో కూల్ గా ఉంటాడు. బౌలర్లను, బ్యాటర్లను ఎలా ఉపయోగించుకోవాలో అతడికి తెలిసినంతగా మరెవ్వరికి తెలీదు. 6-7 నంబర్ లో బ్యాటింగ్ కు వచ్చి.. ఫినిషర్ గా టీమ్ కు విజయాలను అందించడంలో ముందుంటాడు. ఎంత ఓత్తిడిలో ఉన్నాగానీ.. చివరి వరకు పోరాడి, మ్యాచ్ ను ఎలా గెలుచుకోవాలా? అని ఆలోచిస్తుంటాడు. అదే అతడిలో ఉన్న గొప్ప లక్షణం” అని ఆకాశానికెత్తేశాడు. ఐపీఎల్ లో ధోని అద్భుతమైన కెప్టెన్ గా చెన్నైని తిరుగులేని స్థాయిలో నిలిపాడని గంభీర్ కొనియాడాడు. మరి చెన్నైతో మ్యాచ్ కు ముందు గంభీర్ ధోనిని ప్రశంసించడం చర్చనీయాంశంగా మారింది. మరి ధోనిని గంభీర్ ప్రశంసించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: IPL 2024: బ్రూక్ ప్లేస్ లో ఢిల్లీ టీమ్ లోకి వెన్నులో వణుకు పుట్టించే బౌలర్!

Show comments