వీడియో: KKR vs PBKS మ్యాచ్‌.. అంపైర్‌తో గొడవకు దిగిన గంభీర్‌!

Gautam Gambhir, KKR vs PBKS, IPL 2024: గంభీర్‌ ఆటగాడిగా ఉన్న సమయంలో ఎంత అగ్రెసివ్‌గా ఉండేవాడో అందరికీ తెలిసిందే. ఇప్పుడు మెంటర్‌గా మారినా అదే ఫైర్‌తో ఉన్నాడు. తాజాగా కేకేఆర్‌ వర్సెస్‌ పంజాబ్‌ మ్యాచ్‌ సందర్భంగా అంపైర్‌తో గొడవ పెట్టుకున్నాడు. అది ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం..

Gautam Gambhir, KKR vs PBKS, IPL 2024: గంభీర్‌ ఆటగాడిగా ఉన్న సమయంలో ఎంత అగ్రెసివ్‌గా ఉండేవాడో అందరికీ తెలిసిందే. ఇప్పుడు మెంటర్‌గా మారినా అదే ఫైర్‌తో ఉన్నాడు. తాజాగా కేకేఆర్‌ వర్సెస్‌ పంజాబ్‌ మ్యాచ్‌ సందర్భంగా అంపైర్‌తో గొడవ పెట్టుకున్నాడు. అది ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం..

ఐపీఎల్‌ 2024లో భాగంగా శుక్రవారం పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్‌ ఓటమి పాలైన విషయం తెలిసిందే. హై స్కోరింగ్‌ గేమ్‌గా సాగిన ఈ మ్యాచ్‌లో పంజాబ్‌ అద్భుతమైన బ్యాటింగ్‌తో ఏకంగా 262 పరుగుల భారీ టార్గెట్‌ను ఛేదించి.. చరిత్ర సృష్టించింది. అయితే.. ఈ మ్యాచ్‌లో ఓ విషయంపై కేకేఆర్‌ మెంటర్‌గా ఉన్న గౌతమ్‌ గంభీర్‌ అంపైర్‌తో గొడవకు దిగాడు. కేకేఆర్‌ బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో ఇన్నింగ్స్‌ 14వ ఓవర్‌ ఆఖరి బంతిని పంజాబ్‌ బౌలర్‌ రాహుల్‌ ఛాహర్‌ అవుట్‌ సైడ్‌ ఆఫ్‌ వైపు షార్ట్‌ బాల్‌ వేశాడు. ఆ బాల్‌ను రస్సెల్‌ కవర్స్‌ మీదుగా షాట్‌ ఆడేందుకు ప్రయత్నించాడు. కానీ, కవర్స్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న అశుతోష్‌ సర్కిల్‌లోనే బంతిని ఆపేసి.. వికెట్‌ కీపర్‌ జితేష్‌ శర్మకు బాల్‌ అందించాడు. కానీ, అది ఓవర్‌ త్రోగా వెళ్లింది.

దీంతో.. వెంటనే రస్సెల్‌ సింగిల్‌ కోసం పరిగెత్తాడు. మరో ఎండ్‌లో ఉన్న వెంకటేశ్‌ అయ్యర్‌ వెంటనే స్పందించి పరుగులు పూర్తి చేశాడు. కానీ, అంపైర్లు ఆ సింగిల్‌ను పరిగణలోకి తీసుకోలేదు. ఇక్కడే గౌతమ్‌ గంభీర్‌కు మండింది. వెంటనే ఫీల్డ్‌ బయట ఉన్న అంపైర్‌తో గంభీర్‌ వాదన పెట్టుకున్నాడు. అయితే.. అతి ఓవర్‌ త్రో కిందికి రాదని, అప్పటికే బాల్‌ కంప్లీట్‌ అయిపోయినట్లు తాను నిర్దారించాని అంపైర్‌ రస్సెల్‌కు వివరించాడు. అంపైర్‌ ఇచ్చిన వివరణతో రస్సెల్‌ ఏకీభవించినా.. డగౌట్‌లో ఉన్న గంభీర్‌ మాత్రం ఆ విషయాన్ని తేలిగ్గా వదిలేయలేదు. ఒక్క రన్‌ కూడా ఇంపార్టెంటే అనే ధోరణి గంభీర్‌ది. అందుకే ఒక్క రన్‌ కోసమైనా అంపైర్‌తో వాదనకు దిగాడు.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 261 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. ఓపెనర్లు ఫిలిప్‌ సాల్ట్‌ 75, సునీల్‌ నరైన్‌ 71 పరుగులు చేసి.. పంజాబ్‌ బౌలర్లను ఊచకోత కోశారు. వీరితోపాటు వెంకటేశ్‌ అయ్యర్‌ 39, రస్సెల్‌ 24, కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ 28 రన్స్‌ చేసి రాణించారు. పంజాబ్‌ బౌలర్లలో అర్షదీప్‌ సింగ్‌ 2 వికెట్లతో రాణించాడు. 262 పరుగులు భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన పంజాబ్‌.. 18.4 ఓవర్లలోనే కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఓపెనర్లు ప్రభుసిమ్రాన్‌ 54, జానీ బెయిర్‌ స్టో 108, రోసోవ్‌ 26, శశాంక్‌ సింగ్‌ 68 రన్స్‌తో పంజాబ్‌కు రికార్డ్‌ విక్టరీని అందించారు. కేకేఆర్‌ బౌలర్లో సునీల్‌ నరైన్‌ ఒక్కడికే ఒక వికెట్‌ దక్కింది. 4 ఓవర్లలో కేవలం 24 రన్స్‌ ఇచ్చి ఒక వికెట్‌ తీశాడు నరైన్‌. మరి ఈ మ్యాచ్‌లో ఒక్క రన్‌ కోసం గంభీర్‌ అంపైర్‌తో గొడవ పడటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments