Somesekhar
ఇండియాతో జరిగిన మ్యాచ్ లో ఆ పాక్ బ్యాటర్ కావాలనే బంతులను వేస్ట్ చేశాడని సంచలన ఆరోపణలు చేశాడు ఆ దేశ మాజీ కెప్టెన్ సలీమ్ మాలిక్. మరి ఆ ప్లేయర్ ఎవరు? తెలుసుకుందాం పదండి.
ఇండియాతో జరిగిన మ్యాచ్ లో ఆ పాక్ బ్యాటర్ కావాలనే బంతులను వేస్ట్ చేశాడని సంచలన ఆరోపణలు చేశాడు ఆ దేశ మాజీ కెప్టెన్ సలీమ్ మాలిక్. మరి ఆ ప్లేయర్ ఎవరు? తెలుసుకుందాం పదండి.
Somesekhar
నువ్వానేనా అన్నట్లుగా సాగిన ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ లో చివరికి విజయం భారత్ నే వరించింది. దాంతో ఐసీసీ టోర్నీల్లో పాక్ పై టీమిండియా ఆధిపత్యం కొనసాగుతూనే ఉంది. ఇక టీ20 వరల్డ్ కప్ లో టీమిండియాపై పాకిస్తాన్ ఓడిపోవడాన్ని ఆ దేశ ఫ్యాన్స్, మాజీ క్రికెటర్లు జీర్ణించుకోలేకపోతున్నారు. కెప్టెన్ బాబర్ అజామ్ తో పాటుగా ఆటగాళ్లను తీవ్రంగా విమర్శిస్తున్నారు. బౌలర్లు అద్భుతంగా రాణించినప్పటికీ.. బ్యాటర్లు దారుణంగా విఫలం అయ్యారని విమర్శిస్తున్నారు. ఈ క్రమంలోనే పాక్ మాజీ కెప్టెన్ ఏకంగా ఆ బ్యాటర్ కావాలనే బాల్స్ వేస్ట్ చేశాడని ఫైర్ అయ్యాడు.
ఇండియా-పాక్ మ్యాచ్ గురించి అభిమానులు భారీగా ఊహించుకున్నారు. ఈ మ్యాచ్ లో టీమిండియా బ్యాటర్లు చెలరేగడం ఖాయం, భారీ స్కోర్ నమోదు కావడం కూడా ఖాయమని ఎంతో ఆశపడ్డారు. కానీ అమెరికా పిచ్ ల్లో పస లేకపోవడంతో.. దాదాపు అన్ని మ్యాచ్ లు ల్లో లో స్కోరింగే నమోదు అవుతుంది. తాజాగా ఇండియా-పాక్ మ్యాచ్ లో కూడా ఇదే జరిగింది. లో స్కోరింగ్ మ్యాచ్ అయినప్పటికీ.. చివరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగి.. ప్రేక్షకులకు ఈ మ్యాచ్ కిక్కిచ్చింది. ఇక ఈ పోరులో పాక్ ఓడిపోవడంతో.. ఆ దేశ మాజీ కెప్టెన్ సలీమ్ మాలిక్ సంచలన ఆరోపణలు చేశాడు. ఇమాద్ వసీం కావాలనే బంతులను వృథా చేశాడని మాజీ కెప్టెన్ ఆరోపించాడు.
“ఇండియాతో జరిగిన ఈ మ్యాచ్ లో ఇమాద్ వసీం కావాలనే బంతులను వృథా చేశాడని అనిపిస్తోంది. అతడి స్లో బ్యాటింగ్ కారణంగానే టార్గెట్ మరింత కష్టమైంది. 23 బంతులు ఎదుర్కొన్న అతడు కేవలం 15 రన్స్ మాత్రమే చేశాడు. దాంతో మిగతా వారిపై ఒత్తిడి పెరిగిపోయి.. వికెట్లు సమర్పించుకున్నారు” అంటూ సంచలన ఆరోపణలు చేశాడు. అయితే ఇదే మ్యాచ్ లో టాప్ స్కోరర్ గా నిలిచిన రిజ్వాన్ కూడా 44 బంతులు ఎదుర్కొని 31 పరుగులు చేశాడు. వీరిద్దరి కారణంగా పాక్ ఓడిపోయిందని తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచాడు మాజీ కెప్టెన్ సలీమ్ మాలిక్. మరి నిజంగానే సలీమ్ మాలిక్ అన్నట్లుగా వీరిద్దరి స్లో బ్యాటింగ్ కారణంగానే పాక్ ఓడిపోయిందా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.