ఆ ప్లేయర్ విషయంలో రాజస్థాన్ రాయల్స్ చెత్త నిర్ణయం.. ఫ్యాన్స్ ఆగ్రహం!

ఐపీఎల్ 2024 సందడి మొదలైపోయింది. టీమ్స్ అన్నీ వేలం కోసం ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో రాజస్థాన్ రాయల్స్ జట్టుపై ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

ఐపీఎల్ 2024 సందడి మొదలైపోయింది. టీమ్స్ అన్నీ వేలం కోసం ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో రాజస్థాన్ రాయల్స్ జట్టుపై ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

ప్రస్తుతం క్రికెట్ అభిమానులు అందరూ ఐపీఎల్ 2024 గురించే చర్చలు మొదలు పెట్టారు. ఈ రోజుతో ఆటగాళ్ల రిజిస్ట్రేషన్ కూడా ముగియనుంది. అలాగే ఇప్పటికే చాలా టీమ్స్ ప్లేయర్లను రిటైన్ చేసుకున్నాయి. ఆటగాళ్ల ఎక్స్ ఛేంజ్ ప్రక్రియను కూడా పూర్తి చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాజస్థాన్ రాయల్స్ జట్టుపై ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మిగిలిన టీమ్స్ ఫ్యాన్స్ మాత్రం పాపం రాజస్థాన్ అంటూ వెటకారం చేస్తున్నారు. అసలు ఇలాంటి పరిస్థితి రాజస్థాన్ కు ఎదుకు వచ్చిందంటే? ఆ జట్టు ఒక ప్లేయర్ విషయంలో పెద్ద చెత్త నిర్ణయం తీసుకుంది. అందుకే అందరూ ఇప్పుడు రాజస్థాన్ జట్టుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

విషయం ఏంటంటే.. ఐపీఎల్ ప్లేయర్ రిటెన్షన్ అండ్ రిలీజ్ ప్రక్రియలో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్ జట్టుతో రాజస్థాన్ జట్టు ప్లేయర్ ఎక్స్ ఛేంజ్ చేసుకుంది. రాజస్థాన్ జట్టులో ఉన్న దేవ్ దత్ పడిక్కల్ ను లక్నోకు అప్పజెప్పి వారి జట్టులో ఉన్న బౌలర్ అవేశ్ ఖాన్ ను వారి జట్టులోకి తీసుకున్నారు. ఇప్పుడు ఈ నిర్ణయంపైనే అంతా రాజస్థాన్ తీసుకుంది చెత్త నిర్ణయం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. లక్నో ఫ్యాన్స్ అయితే పాపం రాజస్థాన్ అంటూ వెటకారం కూడా చేస్తున్నారు. అసలు ఇదందా ఎందుకు అంటే.. దేవ్ దత్ పడిక్కల్ విజయ్ హజారే ట్రోఫీలో విజృభిస్తున్నాడు. తన అద్భుతమైన ఫామ్ తో కర్ణాటక జట్టును గ్రూప్ సీలో టాప్ ప్లేస్ లో పెట్టాడు.

బుధవారం బిహార్ తో జరిగిన మ్యాచ్ లో కేవలం 57 బంతుల్లోనే 9 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 93 పరుగులు చేశాడు. ఈ ఒక్క మ్యాచ్ లోనే కాదు.. మొదటి మ్యాచ్ లో 35 బంతుల్లో 71 పరుగులు, రెండో మ్యాచ్ లో శతకంతో చెలరేగాడు. మూడో మ్యాచ్ లో 70 పరుగులు చేశాడు. దేవ్ దత్ పడిక్కల్ విజయ్ హజారే ట్రోఫీలో మొదటి నాలుగు మ్యాచుల్లో 283 బంతుల్లో 351 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా కొనసాగుతున్నాడు. ఇంక రాజస్థాన్ రాయల్స్ ఏరికోరి తెచ్చుకున్న అవేశ్ ఖాన్ ప్రదర్శన చూస్తే అంతంత మాత్రంగానే ఉంది. ఆస్ట్రేలియాతో జరుగుతున్న టీ20 సిరీస్ లో మూడో టీ20లో అవేశ్ ఖాన్ కు స్థానం దక్కింది.

ఆ మ్యాచ్ లో 4 ఓవర్లు బౌలింగ్ చేసిన అవేశ్ ఖాన్ 37 పరుగులు ఇచ్చి కేవలం ఒక వికెట్ మాత్రమే పడగొట్టాడు. అటు పడిక్కల్ ఫామ్ చూస్తే కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. అవేశ్ ఖాన్ మాత్రం అంతంత మాత్రం ప్రదర్శనతో నెట్టుకొస్తున్నాడు. మరి.. అవేశ్ ఖాన్ కోసం మ్యాచ్ విన్నర్ ని సమర్పించుకున్నామే అంటూ రాజస్థాన్ ఈ సీజన్ మొత్తం బాధ పడక తప్పదు. ఎందుకంటే పడిక్కల్ ఫామ్ అలా ఉంది మరి. ఇంక ఈ సీజన్ విషయానికి వస్తే.. మేలో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఐపీఎల్ 2024ని కాస్త ముందే నిర్వహించే అవకాశం ఉందని చెప్తున్నారు. ఏది ఏమైనా మార్చి నెలలో ఐపీఎల్ 2024 సీజన్ ని ప్రారంభిస్తారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మరి.. అవేశ్ ఖాన్ కోసం పడిక్కల్ ని రాజస్థాన్ రాయల్స్ వదులుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments