Somesekhar
Manoj Tiwary- MS Dhoni: తన కెరీర్ నాశనం అవ్వడానికి టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని కారణం అంటూ సంచలన ఆరోపణలు చేశాడు భారత మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ. ఈ కామెంట్స్ పై ధోని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. తివారీని బూతులు తిడుతున్నారు.
Manoj Tiwary- MS Dhoni: తన కెరీర్ నాశనం అవ్వడానికి టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని కారణం అంటూ సంచలన ఆరోపణలు చేశాడు భారత మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ. ఈ కామెంట్స్ పై ధోని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. తివారీని బూతులు తిడుతున్నారు.
Somesekhar
టీమిండియా మాజీ క్రికెటర్, పశ్చిమ బెంగల్ క్రీడా శాఖ మంత్రి మనోజ్ తివారీ ఇటీవలే తన క్రికెట్ కెరీర్ కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. అయితే పోతూ పోతూ.. వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు ఈ బెంగాల్ ప్లేయర్. తన కెరీర్ నాశనం అవ్వడానికి టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని కారణం అంటూ సంచలన ఆరోపణలు చేశాడు తివారీ. ఈ కామెంట్స్ పై ధోని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా మనోజ్ తివారీపై బూతుల వర్షం కురిపిస్తున్నారు. అసలేం జరిగిందంటే?
మనోజ్ తివారీ.. క్రికెట్ అభిమానులకు కాస్త పరిచయం తక్కువే. ఎందుకంటే టీమిండియా తరఫున ఆడింది కేవలం 12 వన్డేలు, 3 టీ20లు మాత్రమే. అదీకాక ఈ మ్యాచ్ ల్లో కూడా రాణించింది చాలా తక్కువ. 12 వన్డేల్లో కేవలం 26 సగటుతో 287 రన్స్ చేశాడు. అందులో ఓ సెంచరీ కూడా ఉంది. ఇప్పుడు గొడవ అంతా ఈ శతకం గురించే. అసలేం జరిగిందంటే. 2011లో వెస్టిండీస్ తో టీమిండియా 5 వన్డే మ్యాచ్ ల సిరీస్ ఆడింది. ఆ సిరీస్ ను భారత్ 3-1తో అప్పటికే కైవసం చేసుకుంది. ఇక చివరి మిగిలిన నామమాత్రపు మ్యాచ్ కోసం టీమిండియా సీనియర్లకు రెస్ట్ ఇచ్చారు.
కాగా.. అంతకు ముందు మ్యాచ్ లోనే డబుల్ సెంచరీ చేసిన వీరేంద్ర సెహ్వాగ్ కు సైతం రెస్ట్ ఇచ్చి.. యువ క్రికెటర్లకు అవకాశం ఇచ్చారు సెలెక్టర్లు. దీంతో టీమ్ లోకి వచ్చాడు మనోజ్ తివారీ. ఇక ఈ మ్యాచ్ లో 104 పరుగులతో అజేయ సెంచరీ చేయడంతో.. అతడికి అవకాశాలు వస్తాయని తివారీతో పాటుగా అందరూ భావించారు. కానీ జట్టులో అప్పటికే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, సురేష్ రైనా, యువరాజ్ సింగ్, వీరేంద్ర సెహ్వాగ్, గౌతమ్ గంభీర్ లాంటి హేమాహేమీలు ఉన్నారు. దీంతో సెంచరీ బాదినా తివారీని పక్కన పెట్టాల్సి వచ్చింది. అప్పుడు ధోని భారత కెప్టెన్ గా ఉన్నాడు.
ఇదే విషయాన్ని తాజాగా తెరపైకి తీసుకొచ్చాడు తివారీ. నా కెరీర్ ధోని వల్లే నాశనం అయ్యిందని పొంతనలేని ఆరోపణలు చేశాడు. ఈ కామెంట్స్ తో ధోని ఫ్యాన్స్ తివారీపై ఫైర్ అవుతున్నారు. నీకు అంతసీన్ లేదంటూ గణాంకాలతో సహా వివరిస్తున్నారు. 12 వన్డేల్లో కేవలం 26.1 సగటుతో 287 రన్స్, 3టీ20ల్లో 15 రన్స్, 98 ఐపీఎల్ మ్యాచ్ ల్లో 28 యావరేజ్ తో 1695 పరుగులు చేశాడు. ఈ గణాంకాలు చూస్తేనే అర్దమవుతుంది నువ్వు ఎంతటి స్టార్ ప్లేయర్ వో.. అలాంటిది ధోనిపై ఇలాంటి ఆరోపణలు చేస్తావా? కోహ్లీ, రోహిత్ లా అవుతానని చెప్పే ముందు ఒక్కసారి ఈ స్టాట్స్ చూసుకున్నావా? అంటూ ఎద్దేవచేశారు. కొంచెం చూసుకొని మాట్లాడాలి అంటూ వార్నింగ్ కూడా ఇచ్చారు ధోని ఫ్యాన్స్. ధోనికి ఏ ప్లేయర్ ను ఎలా యూజ్ చేసుకోవాలో తెలిసినంతగా మరెవరికీ తెలీదని చెప్పుకొచ్చారు ఫ్యాన్స్. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇదికూడా చదవండి: జడేజాని బ్యాన్ చేయండి.. తెరపైకి వింత వాదన! అంత తప్పు చేశాడా?