Rohit Sharma: రోహిత్‌ మాస్టర్‌ మైండ్‌! ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో అన్ని అద్భుతాలే!

టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో బ్యాటింగ్‌లో విఫలమైనా.. కెప్టెన్‌గా, ఫీల్డర్‌గా అదరగొడుతున్నాడు. ముఖ్యంగా ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో రోహిత్‌ ఏం చేసినా అద్భుతంగా మారుతోంది. అదేంటో ఇప్పుడు చూద్దాం..

టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో బ్యాటింగ్‌లో విఫలమైనా.. కెప్టెన్‌గా, ఫీల్డర్‌గా అదరగొడుతున్నాడు. ముఖ్యంగా ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో రోహిత్‌ ఏం చేసినా అద్భుతంగా మారుతోంది. అదేంటో ఇప్పుడు చూద్దాం..

ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో టీమిండియా విజయం దిశగా సాగుతోంది. 399 పరుగుల టార్గెట్‌తో చివరి ఇన్నింగ్స్‌కు దిగిన ఇంగ్లండ్‌.. మూడో రోజు చివరి సెషన్‌తో పాటు, నాలుగో రోజు ఉదయం వరకు ఎంతో పటిష్టంగా బ్యాటింగ్‌ చేసింది. ఒక వైపు వికెట్లు పడుతున్నా.. తమ బజ్‌బాల్‌ స్ట్రాటజీని ఉపయోగిస్తూ.. బౌండరీలతో భాతర బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంది. 190 పరుగులు వరకు 4 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయం దిశగా సాగింది. ఈ దశలో టీమిండియా చేతుల్లోంచి మ్యాచ్‌ చేజారిపోతున్నట్లుగా అనిపించింది. అప్పటికే ఓపెనర్‌ జాక్‌ క్రాలీ హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకుని సమర్థవంతంగా ఆడుతున్నాడు. మరోవైపు జానీ బెయిర్‌స్టో తనకు అలవాటైన అగ్రెసివ్‌ ఇంటెంట్‌తో బ్యాటింగ్‌ చేస్తూ.. 5 ఫోర్లు బాదేశాడు. సరిగ్గా ఈ టీమ్‌లోనే టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ తన మాస్టర్‌ మైండ్‌ ఉపయోగించడంతో అదృష్టం కూడా అతనికే కలిసొచ్చింది.

కుల్దీప్‌ యాదవ్‌ వేసిన ఇన్నింగ్స్‌ 42వ ఓవర్‌ చివరి బంతికి జాక్‌ క్రాలీ వికెట్ల ముందుకు దొరికిపోయాడు. అయితే.. అంపైర్‌ నాటౌట్‌ అని ప్రకటించాడు. దీంతో.. టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ బౌలర్‌ కుల్దీప్‌, వికెట్‌ కీపర్‌ కేఎస్‌ భరత్‌తో మాట్లాడి రివ్యూ తీసుకున్నాడు. రివ్యూ సక్సెస్‌ఫుల్‌ అయింది. జాక్‌ పెవిలియన్‌ చేరడంతో ఇంగ్లండ్‌ 5వ వికెట్‌ కోల్పోయింది. దొరికిన ఛాన్స్‌తో మరోసారి తన మెదడుకు మేత పెట్టిన రోహిత్‌ శర్మ.. వెంటనే బుమ్రాను బరిలోకి దింపాడు. అది కూడా సూపర్‌ సక్సెస్‌ అయింది. 43వ ఓవర్‌ వేసిన బుమ్రా.. ఆ ఓవర్‌ నాలుగో బంతికి డేంజరస్‌ బెయిర్‌స్టోను అవుట్‌ చేశాడు.

ఇలా ఇంగ్లండ్‌ విజయం వైపు దూసుకెళ్తున్న తరుణంలో.. సరైన టైమ్‌లో రోహిత్‌ పట్టిందల్లా బంగారంలా మారింది. ఇదే విషయాన్ని ప్రముఖ కామెంటేటర్‌ హర్షా భోగ్లే సైతం ప్రస్తావించారు. మ్యాచ్‌ నాలుగో రోజు రోహిత్‌ శర్మ పట్టిందల్లా బంగారం అవుతుందని అన్నారు. కాగా, నాలుగో రోజు తొలి సెషన్‌ ముగిసే సమయానికి ఇంగ్లండ్‌ 6 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. ఇంగ్లండ్‌ గెలవాలంటే.. ఇంకా 203 పరుగులు చేయాల్సి ఉంది. కానీ, ఇండియా మరో 4 వికెట్లు పడగొట్టేస్తే.. విజయం వరిస్తుంది. ప్రస్తుతం ఇండియా బౌలర్లు చెలరేగుతున్న విధానం చూస్తుంటే.. టీమిండియా గెలిచే అవకాశం ఉంది. మరి ఈ మ్యాచ్‌లో రోహిత్‌ శర్మ చేస్తున్న బౌలింగ్‌ మార్పులు, తీసుకుంటే రివ్యూలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments