ఒకేసారి టీమిండియాకు దూరమైన ముగ్గురు దిగ్గజాలు! వాళ్లు ఎవరంటే?

Virat Kohli, Rohit Sharma, T20 World Cup 2024: భారత క్రికెట్‌కు వాళ్ల ఆటతో ఎంతో సేవ చేసిన దిగ్గజ ఆటగాళ్లు జట్టుకు దూరం కానున్నారు. ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఒకేసారి ముగ్గురు ఆటగాళ్లు జట్టుకు దూరం అయ్యారు. వాళ్లు ఎవరో ఇప్పుడు చూద్దాం..

Virat Kohli, Rohit Sharma, T20 World Cup 2024: భారత క్రికెట్‌కు వాళ్ల ఆటతో ఎంతో సేవ చేసిన దిగ్గజ ఆటగాళ్లు జట్టుకు దూరం కానున్నారు. ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఒకేసారి ముగ్గురు ఆటగాళ్లు జట్టుకు దూరం అయ్యారు. వాళ్లు ఎవరో ఇప్పుడు చూద్దాం..

భారత జట్టు టీ20 వరల్డ్‌ కప్‌ 2024 గెలిచిన సంతోషంలో ఉంది భారత్‌ మొత్తం. రోహిత్‌ శర్మ కెప్టెన్సీలో టీమిండియా శనివారం రాత్రి పొట్టి ప్రపంచ కప్‌ విశ్వవిజేతగా అవతరించడంతో దేశం మొత్తం సంబరాలు చోటు చేసుకున్నాయి. దాదాపు 17 ఏళ్ల తర్వాత మళ్లీ టీమిండియా టీ20 వరల్డ్‌ కప్‌ గెలిచింది. 2007లో ధోని కెప్టెన్సీలో మొట్టమొదటి టీ20 వరల్డ్‌ కప్‌ గెలిచిన భారత్‌.. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ఈ వరల్డ్‌ కప్‌ నెగ్గింది. ఈ విజయంతో ఆటగాళ్లంతా ఫుల్‌ హ్యాపీగా ఉన్నారు. కానీ, కొంతమంది భారత క్రికెట్‌ అభిమానులు మాత్రం బాధలో ఉన్నారు. ఎందుకంటే.. ఓ ముగ్గురు దిగ్గజాలు ఇకపై భారత టీ20 జట్టులో కనిపించరు. వాళ్లు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..

టీమిండియాకు రెండు కళ్లలాంటి విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ ఒకేసారి.. అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. సౌతాఫ్రికాపై ఫైనల్‌లో విజయం సాధించిన తర్వాత.. తొలుత విరాట్‌ కోహ్లీ.. యువ క్రికెటర్లకు అవకాశం ఇచ్చేందుకు తాను టీ20 ఫార్మాట్‌ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. ఆ తర్వాత.. ప్రెస్‌ కాన్ఫెరెన్స్‌లో మాట్లాడూత.. తాను చివరి టీ20 మ్యాచ్‌ ఆడేసినట్లు చాలా సింపుల్‌గా రిటైర్మెంట్‌ ప్రకటించాడు. దీంతో.. ఇకపై భారత టీ20 క్రికెట్‌ జట్టులో ఈ ఇద్దరు స్టార్‌ ఆటగాళ్లు కనిపించరు. వన్డే, టెస్టు క్రికెట్‌లో మాత్రం ఈ ఇద్దరే ముందుండి జట్టును నడిపించనున్నారు.

ఈ ఇద్దరితో పాటు మరో దిగ్గజం కూడా ఇకపై భారత క్రికెట్‌ జట్టుతో మీకు కనిపించడు. అతను ఎవరో కాదు.. భారత దిగ్గజ మాజీ క్రికెటర్‌, తాజా మాజీ హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌. 2021లో టీమిండియా హెడ్‌ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన ద్రవిడ్‌.. తన కోచింగ్‌లో టీమిండియా నెక్ట్స్‌ లెవెల్‌కు తీసుకెళ్లాడు. టీ20 వరల్డ్‌ కప్‌ 2022లో భారత జట్టు సెమీస్‌ వరకు వెళ్లింది, వన్డే వరల్డ్‌ కప్‌ 2023లో ఫైనల్‌ ఆడింది, అదే ఏడాది వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌ ఫైనల్‌ కూడా ఆడింది. తాజాగా టీ20 వరల్డ్‌ కప్‌ కైవసం చేసుకుంది. ఇవన్నీ ద్రవిడ్‌ కోచింగ్‌లో సాధించినవే. అయితే హెడ్‌ కోచ్‌ ద్రవిడ్‌ పదవీ కాలం ఈ వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌తో పూర్తి కావడంతో ఆయన జట్టును వీడనున్నాడు. ఇలా ముగ్గురు దిగ్గజాలు.. విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ, రాహుల్‌ ద్రవిడ్‌ ఒకేసారి దూరం అయ్యారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments