Pratham Singh: గిల్ ప్లేస్ లో టీమ్ లోకి.. ఓ రేంజ్ లో సెంచరీ బాదేశాడు! ఎవరీ ప్రథమ్ సింగ్?

Pratham Singh Century, Duleep Trophy 2024: దులీప్ ట్రోఫీలో భాగంగా ఇండియా-డితో జరుగుతున్న మ్యాచ్ లో సూపర్ సెంచరీతో చెలరేగాడు ప్రథమ్ సింగ్. శుబ్ మన్ గిల్ ప్లేస్ లో జట్టులోకి వచ్చిన ఈ ఓపెనర్ శతకంతో మెరిశాడు.

Pratham Singh Century, Duleep Trophy 2024: దులీప్ ట్రోఫీలో భాగంగా ఇండియా-డితో జరుగుతున్న మ్యాచ్ లో సూపర్ సెంచరీతో చెలరేగాడు ప్రథమ్ సింగ్. శుబ్ మన్ గిల్ ప్లేస్ లో జట్టులోకి వచ్చిన ఈ ఓపెనర్ శతకంతో మెరిశాడు.

ప్రతిష్టాత్మకమైన దేశవాళీ ట్రోఫీ అయిన దులీప్ ట్రోఫీ 2024లో యువ బ్యాటర్లు చెలరేగిపోతున్నాడు. మెున్న సర్ఫరాజ్ ఖాన్ తమ్ముడు ముషీర్ ఖాన్ సెంచరీ చేయగా.. నిన్న ఇషాన్ కిషన్ సూపర్ సెంచరీతో అదరగొట్టాడు. ఇక నేడు యంగ్ ప్లేయర్ ప్రథమ్ సింగ్ అద్భుతమైన శతకంతో మెరిశాడు. ఇండియా-డితో జరుగుతున్న మ్యాచ్ లో ఇండియా-ఏ తరఫున కెప్టెన్ శుబ్ గిల్ ప్లేస్ లో బరిలోకి దిగాడు ప్రథమ్ సింగ్. ఈ క్రమంలో దులీప్ ట్రోఫీలో తన తొలి సెంచరీని నమోదు చేశాడు. అయితే అతడు సెంచరీకి దగ్గరగా వచ్చినప్పుడు చూపించిన తెగువ హైలెట్ అని చెప్పాలి. హర్షిత్ రానా, అర్షదీప్ సింగ్ లాంటి అనుభవం ఉన్న బౌలర్లను సైతం దంచికొట్టాడు. దాంతో నెటిజన్లు ఎవరీ ప్రథమ్ సింగ్ అని తెగ వెతుకుతున్నారు.

దులీప్ ట్రోఫీ 2024లో భాగంగా అనంతపూర్ వేదికగా ఇండియా-ఏ వర్సెస్ ఇండియా-డి జట్ల మధ్య జరుగుతున్న విషయం తెలిసిందే. మూడో రోజు మ్యాచ్ లో సెంచరీతో అదరగొట్టాడు ఇండియా-ఏ ఓపెనర్ ప్రథమ్ సింగ్. కెప్టెన్ శుబ్ మన్ గిల్ స్థానంలో జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ప్లేయర్ బౌలర్లను చితక్కొట్టాడు. ఎలాంటి బెదరులేకుండా అర్షదీప్ సింగ్, హర్షిత్ రానా లాంటి బౌలర్లను సులువుగా ఎదుర్కొన్నాడు. ఈ క్రమంలోనే 149 బంతుల్లో సెంచరీని సాధించాడు. అయితే.. అతడు 88 పరుగుల వద్ద బ్యాటింగ్ చేస్తున్నప్పుడు కవేరప్ప బౌలింగ్ కు వచ్చాడు. అతడు వేసిన ఈ ఓవర్లో వరుసగా 6, 4, 4 బాది ఓ రేంజ్ లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

సాధారణంగా సీనియర్ బ్యాటర్లే శతకం దగ్గరికి వచ్చినప్పడు ఆచితూచి ఆడి శతకం సాధిస్తారు. అలాంటిది ప్రథమ్ సింగ్ అవేమీ పట్టించుకోకుండా వరుసగా సిక్స్, రెండు ఫోర్లు బాది దులీప్ ట్రోఫీలో తన తొలి సెంచరీని నమోదు చేసుకున్నాడు. ఓవరాల్ గా ఈ మ్యాచ్ లో 189 బంతులు ఎదుర్కొని 12 ఫోర్లు, ఓ సిక్స్ తో 122 రన్స్ చేసి పెవిలియన్ చేరాడు. ఇక మెరుపు బ్యాటింగ్ తో సెంచరీ చేసిన ఈ ప్రథమ్ సింగ్ ఎవరు? అంటూ క్రికెట్ లవర్స్ తెగ వెతుకుతున్నారు. కాగా.. ఢిల్లీకి చెందిన  ప్రథమ్ సింగ్ 1992 ఆగస్ట్ 31న జన్మించాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో రైల్వేస్ కు ఆడుతున్న అతడు.. 2017లో డొమెస్టిక్ క్రికెట్ లోకి అడుగుపెట్టాడు. రైల్వేస్ తరపున అండర్ 19 జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. ఇక 2018-19 సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో వరుసగా 4 హాఫ్ సెంచరీలు సాధించి రికార్డు నెలకొల్పాడు. ప్రథమ్ సింగ్ ఐపీఎల్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చాడు. 2017లో గుజరాత్ టైటాన్స్ తరఫున ఈ మెగా లీగ్ లోకి అడుగుపెట్టాడు. ఆ తర్వాత జరిగిన 2022 మెగా వేలంలో కోల్ కత్తా నైట్ రైడర్స్ అతడిని రూ. 20 లక్షలకు కొనుగోలు చేసింది. 2024 ఐపీఎల్ గెలిచిన కేకేఆర్ జట్టులో ప్రథమ్ సింగ్ సభ్యుడిగా ఉన్నాడు. కానీ అతడికి ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం దక్కలేదు.

Show comments