Dinesh Karthik: దినేశ్ కార్తీక్ కు అరుదైన గౌరవం! ధోనికి కూడా దక్కలేదు..

Dinesh Karthik: దినేశ్ కార్తీక్ కు అరుదైన గౌరవం! ధోనికి కూడా దక్కలేదు..

టీమిండియా మాజీ క్రికెటర్ దినేశ్ కార్తీక్ కు అరుదైన గౌరవం దక్కింది. ఈ గౌరవం మహేంద్రసింగ్ ధోనికి కూడా దక్కకపోవడం గమనార్హం. మరి ఇంతకీ ఆ గౌరవం ఏంటి? తెలుసుకుందాం పదండి.

టీమిండియా మాజీ క్రికెటర్ దినేశ్ కార్తీక్ కు అరుదైన గౌరవం దక్కింది. ఈ గౌరవం మహేంద్రసింగ్ ధోనికి కూడా దక్కకపోవడం గమనార్హం. మరి ఇంతకీ ఆ గౌరవం ఏంటి? తెలుసుకుందాం పదండి.

టీమిండియా మాజీ క్రికెటర్ దినేశ్ కార్తీక్ భారత క్రికెట్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ధోని తర్వాత మళ్లీ అంతటి బెస్ట్ ఫినిషర్ గా పేరుగడించాడు. కానీ గాయాలు, ఫామ్ లో లేకపోవడం లాంటి కారణాలతో అనుకున్నన్ని అవకాశాలు మాత్రం రాలేదు. దాంతో జట్టులో చోటు కోల్పోయి, ఎక్కువ శాతం ఐపీఎల్ లాంటి టోర్నీలకే పరిమితం అయ్యాడు. అదీకాక జట్టులోకి వికెట్ కీపర్లు ఎక్కువగా రావడంతో.. అతడి ప్లేస్ కు గండిపడింది. ఇక కొన్ని నెలల క్రితం క్రికెట్ కు డీకే వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. తాజాగా దినేశ్ కార్తీక్ కు అరుదైన గౌరవం దక్కింది. ఇది టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనికి కూడా దక్కలేదు.

భారత మాజీ క్రికెటర్, వరల్డ్ బెస్ట్ ఫినిషర్ దినేశ్ కార్తీక్ కు అరుదైన గౌరవం దక్కింది. సౌతాఫ్రికా టీ20 లీగ్ బెట్ వే SA 20 లీగ్ కు బ్రాండ్ అంబాసిడర్ గా డీకే నియమించబడ్డాడు. ఈ విషయాన్ని ఆ లీగ్ కమిషనర్, సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ అధికారికంగా ప్రకటించాడు. టీ20 లీగ్ క్రికెట్ లో డీకేకి ఉన్న అనుభవం, ఇండియా అతడికి ఉన్న క్రేజ్ మా లీగ్ కు ఉపయోగపడుతుందని భావిస్తున్నట్లు గ్రేమ్ స్మిత్ తెలిపాడు. ఇక SA 20 లీగ్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపిక కావడం పట్ల డీకే స్పందించాడు.

“గ్రేమ్ స్మిత్ బృందంతో కలిసి పనిచేయడానికి ఎదురుచూస్తున్నాను. కొత్త బాధ్యతలు చేపట్టడం సంతోషంగా ఉంది. తొలి రెండు సీజన్లలో ప్రపంచంలోని అత్యుత్తమైన ప్లేయర్లు సత్తాచాటారు. వరల్డ్ వైడ్ గా ఉన్న యువ ఆటగాళ్లు రాణించడానికి ఇది సరైన వేదిక” అని చెప్పుకొచ్చాడు దినేశ్ కార్తీక్. అతడు ఏబీ డివిలియర్స్ తో కలిసి పనిచేయనున్నాడు. ప్రస్తుతం డీకే ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ కు మెంటర్ గా, బ్యాటింగ్ కోచ్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. కాగా.. ఈ గౌరవం ఎంఎస్ ధోనికి కూడా దక్కకపోవడం గమనార్హం. ఇక ఇప్పటి వరకు రెండు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ లీగ్ లో గతేడాది ఛాంపియన్లుగా నిలిచారు సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్. ఇది సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యంలో నడుస్తోంది. SA20 లీగ్ లో ఆరు జట్లు పాల్గొంటాయి. మరి సౌతాఫ్రికా క్రికెట్ లీగ్ బ్రాండ్ అంబాసిడర్ గా కార్తీక్ నియమితుడు కావడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments