రోహిత్- హార్దిక్ మధ్య గొడవలు! అంతా పాండ్యా స్కెచ్ ప్రకారమే!

ఇన్నాళ్లు ముంబై ఇండియన్స్ కి ఫేస్ లా ఉన్న రోహిత్ శర్మ ఫేట్ మారిపోయింది. హిట్ మ్యాన్ స్థానంలో హార్దిక్ కెప్టెన్ గా వచ్చేశాడు. కానీ.., ఇదంతా హార్దిక్ పాత గొడవని మనసులో పెట్టుకుని ఒక పక్కా ప్లాన్ ప్రకారం చేశాడా?

ఇన్నాళ్లు ముంబై ఇండియన్స్ కి ఫేస్ లా ఉన్న రోహిత్ శర్మ ఫేట్ మారిపోయింది. హిట్ మ్యాన్ స్థానంలో హార్దిక్ కెప్టెన్ గా వచ్చేశాడు. కానీ.., ఇదంతా హార్దిక్ పాత గొడవని మనసులో పెట్టుకుని ఒక పక్కా ప్లాన్ ప్రకారం చేశాడా?

ముంబై ఇండియన్స్ తమ జట్టు కెప్టెన్ గా హార్దిక్ పాండ్యాని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక అప్పటి నుండి ముంబై జట్టులో ముసలం మొదలైంది. సూర్య కుమార్ యాదవ్, బుమ్రా లాంటి ఆటగాళ్లు ఈ నిర్ణయం పట్ల సంతృప్తిగా లేరు. ఇక ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ బాధ మాటల్లో చెప్పలేనిది. ఇప్పటికే లక్షల మంది అభిమానులు సోషల్ మీడియాలో ముంబైని అన్ ఫాలో చేసేశారు. కొన్ని ప్రాంతాల్లో ముంబై జట్టు జెర్సీని, జెండాలను తగలపెట్టే వరకు పరిస్థితి వెళ్ళింది. ఇదంతా ఒకవైపు జరుగుతుంటే.. అసలు ముంబై ఇండియన్స్ ఒక్కసారిగా ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏమిటి అన్న ప్రశ్నకి మాత్రం సమాధానం అంతు పట్టడం లేదు. సరిగ్గా ఇలాంటి సమయంలోనే రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా మధ్య భారీగానే గ్యాప్ వచ్చిందా? వీరిద్దరూ గొడవ పడ్డారా? అసలు ఈ మొత్తం వ్యవహారాన్ని హార్దిక్ పక్కా ప్లాన్ ప్రకారం అమలు చేశాడా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.

ఏడాది క్రితం ముంబై ఇండియన్స్ హార్దిక్ పాండ్యాని వదిలేసింది. అప్పట్లో అదొక సంచలన నిర్ణయం. కానీ.., ఇదంతా రోహిత్ కి తెలియకుండానే జరిగిందా? హిట్ మ్యాన్ గ్రీన్ సిగ్నెల్ తోనే ముంబై యాజమాన్యం పాండ్యాని పోగోట్టుకోవడానికి సిద్ధమైందన్న కామెంట్స్ వినిపించాయి. దీనినే హర్దిక్ సీరియస్ గా తీసుకున్నాడా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ముంబై నుండి బయటకి వెళ్ళాక.. పాండ్యా గుజరాత్ కెప్టెన్ అయ్యాడు. ఆ సీజన్ లో కప్ కొట్టి.. తాను ఎంతటి విలువైన ఆటగాడో నిరూపించుకున్నాడు. మరోవైపు ఇదే సమయంలో రోహిత్ టీ-20లకి దూరం అవుతూ వచ్చాడు. ఏజ్ పెద్ద ఫ్యాక్టర్ అయిపోయింది. దీంతో.. ముంబై ఇండియన్స్ కన్ను మళ్ళీ పాండ్యా వైపు మళ్లింది. పోటీ ఫార్మేట్ కి దూరంగా ఉండే రోహిత్ ని మరో సీజన్ కెప్టెన్ గా ఉంచుకొని.. దీర్ఘ‌కాల  అవసరాల పాండ్యాకి మళ్ళీ పిలుపు అందించింది. కానీ.., ఇక్కడే స్టార్ ఆల్ రౌండర్ మెలిక పెట్టినట్టు తెలుస్తోంది. ఈ సీజన్ నుండే తనని కెప్టెన్ గా నియమిస్తేనే.. తాను టీమ్ మారడానికి సిద్ధమని, లేకుంటే గుజరాత్ లోనే కొనసాగతా అని హార్దిక్ తేల్చి చెప్పినట్టు తెలుస్తోంది.

ఐపీఎల్ అనేది ఎంత ఆటైనా ఫ్రాంచైజీల లెక్క అంతా కమర్షియల్ గానే ఉంటాయి. ఒక్క సీజన్ ఆడే రోహిత్ కన్నా.. తరువాత కూడా పనికొచ్చే హార్దిక్ వైపు మొగ్గింది యాజమాన్యం. కానీ.., ఇక్కడ ఈ మొత్తం వ్యవహారాన్ని రోహిత్ తెలియచేయకుండా సైలెంట్ గా పని కానిచ్చుకుంటూ పోయారు. మరోవైపు హార్దిక్ కూడా ఈ మౌనాన్నే ఆశ్రయించాడు. దీంతో.. ఇప్పుడు ఒక్కసారిగా రోహిత్ కి షాక్ తగిలినట్టు అయ్యింది. 5సార్లు కప్ అందించిన కెప్టెన్ పట్ల ఇలానే వ్యవహరించేది అని హిట్ మ్యాన్ ఫ్యాన్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా పాండ్యా.. ఒక్కమాట కూడా బయట పెట్టడం వెనుక పక్కా ప్లాన్ ఉందన్న విషయం క్లియర్ గా అర్ధమై పోతోంది. నిజానికి పాండ్యాకి అన్నీ విధాలుగా మద్దతుగా నిలిచి, అతడిని స్టార్ గా మార్చింది రోహిత్ శర్మే. అలాంటి ఆటగాడి నుండి పగ్గాలు లాక్కోవడానికి హార్దిక్ ఇంతటి ప్లాన్ వేయడమే అందరికీ షాక్ కలిగిస్తోంది. ఇలా కాకుండా పాండ్యా ఒక్క సీజన్ వరకు రోహిత్ కెప్టెన్సీ అంగీకరించి ఉంటే పరిస్థితి కాస్త హుందాగా ఉండేది. అచ్చం కోహ్లీలానే రోహిత్ కూడా నాయకత్వ బాధ్యతలు నుండి హుందాగా తప్పుకున్నట్టు అయ్యేది. కానీ.., పాత గొడవలను మనసులో పెట్టుకునే హార్దిక్ ఆ ఛాన్స్ లేకుండా చేశాడన్నది ఫ్యాన్స్ వాదన. మరోవైపు.. టీమిండియా టీ-20 కెప్టెన్సీ బాధ్యతలు కూడా త్వరలోనే పాండ్యా చేతులోకి రావడం ఖాయమన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి.. ఈ మొత్తం వ్యవహారంలో హార్దిక్ పాండ్యా తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments