IND vs SL: తొలి వన్డేలో సూపర్ ఓవర్ ఆడించే ఛాన్స్ ఉన్నా ఆడించలేదా? ICC ఏమందంటే?

తొలి వన్డేలో సూపర్ ఓవర్ నిర్వహించే ఛాన్స్ ఉన్నాగానీ.. ఐసీసీ ఆ దిశగా వెళ్లలేదని శ్రీలంక క్రికెట్ బోర్డ్ ఆరోపించింది. ఈ విషయంపై ఐసీసీ అధికారులు క్లారిటీ ఇచ్చారు.

తొలి వన్డేలో సూపర్ ఓవర్ నిర్వహించే ఛాన్స్ ఉన్నాగానీ.. ఐసీసీ ఆ దిశగా వెళ్లలేదని శ్రీలంక క్రికెట్ బోర్డ్ ఆరోపించింది. ఈ విషయంపై ఐసీసీ అధికారులు క్లారిటీ ఇచ్చారు.

సూపర్ ఓవర్.. టీ20 మ్యాచ్ ల్లో ఎక్కువగా వినిపించే మాట. ఇరు జట్లు సమానంగా పరుగులు చేసినప్పుడు సూపర్ ఓవర్ ను ఆడిస్తారు. ఈ విషయం ప్రతిఒక్క క్రికెట్ అభిమానికి తెలిసిందే. అయితే తాజాగా జరిగిన శ్రీలంక-భారత్ తొలి వన్డే మ్యాచ్ టై కాగా.. నిర్వహాకులు మాత్రం సూపర్ ఓవర్ కు మ్యాచ్ ను తీసుకెళ్లలేదు. దానికి కారణం ఏంటి? అని ఆరాతీయగా.. ఐసీసీ రూల్స్ ప్రకారం ద్వైపాక్షిక వన్డే సిరీస్ లకు సూపర్ ఓవర్ నిర్వహించే అవకాశం లేదు. అయితే తొలి వన్డేలో సూపర్ ఓవర్ నిర్వహించే ఛాన్స్ ఉన్నాగానీ.. ఐసీసీ ఆ దిశగా వెళ్లలేదని శ్రీలంక క్రికెట్ బోర్డ్ ఆరోపించింది. ఈ విషయంపై ఐసీసీ అధికారులు ఏమన్నారంటే?

ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో ఉన్న టీమిండియా మూడు వన్డే మ్యాచ్ ల సిరీస్ ఆడుతోంది. అందులో భాగంగా తొలి వన్డే టై కాగా.. రెండో వన్డేలో 32 పరుగుల తేడాతో భారత్ పరాజయం చవిచూసింది. దాంతో సిరీస్ లో 1-0తో వెనకబడిపోయింది. చివరి మ్యాచ్ లో అయినా గెలిచి.. సిరీస్ ను సమం చేసుకోవాలని ఆరాటపడుతోంది. ఇదంతా కాసేపు పక్కనపెడితే.. తాజాగా ఓ కొత్త అంశం తెరపైకి వచ్చింది. తొలి వన్డే టై అయినప్పుడు సూపర్ ఓవర్ నిర్వహించే అవకాశం ఐసీసీ రూల్స్ ప్రకారం ఉందని శ్రీలంక క్రికెట్ బోర్డ్ కు సంబంధించిన అధికారులు చెప్పుకొచ్చారు.

ఇక ఈ విషయంపై తాజాగా ఐసీసీ అధికారులు కూడా స్పందించారు. మీరు అన్నది నిజమే కానీ.. సిరీస్ లో ఇంకొక టై మ్యాచ్ జరిగితే సూపర్ ఓవర్ నిర్వహిస్తాం అంటూ ఐసీసీ అధికారులు స్పష్టం చేశారు. అంటే చివరి వన్డే టై అయితే సూపర్ ఓవర్ నిర్వహిస్తారన్నమాట. దాంతో ఈ అంశంపై స్పష్టత వచ్చింది. కాగా.. తొలి వన్డేలో శ్రీలంక 230 పరుగులు చేయగా.. సరిగ్గా టీమిండియా కూడా 230 పరుగులకే ఆలౌట్ అయ్యింది. అయితే ఐసీసీ టోర్నమెంట్స్, ఆసియా కప్, ముక్కోణపు సిరీస్ లను వన్డే ఫార్మాట్ లో నిర్వహిస్తే మాత్రం, ఆ మ్యాచ్ లు టై అయితే గనక అప్పుడు సూపర్ ఓవర్ నిర్వహిస్తారు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments