Shubman Gill: గిల్ కు ఊహించని షాక్! బంగ్లాతో టీ20 సిరీస్ కు దూరం? ఇదే బాటలో మరో ఇద్దరు స్టార్స్..

Shubman Gill rest for T20 series against Bangladesh: టీమిండియా యంగ్ ప్లేయర్ శుబ్ మన్ గిల్ ను బంగ్లాదేశ్ తో జరిగే టీ20 సిరీస్ నుంచి తప్పించాలని BCCI ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇక ఇదే బాటలో మరో ఇద్దరు స్టార్స్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

Shubman Gill rest for T20 series against Bangladesh: టీమిండియా యంగ్ ప్లేయర్ శుబ్ మన్ గిల్ ను బంగ్లాదేశ్ తో జరిగే టీ20 సిరీస్ నుంచి తప్పించాలని BCCI ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇక ఇదే బాటలో మరో ఇద్దరు స్టార్స్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

టీమిండియా రెస్ట్ మోడ్ నుంచి బయటకి వచ్చి ప్రాక్టీస్ మెుదలుపెట్టింది. బంగ్లాదేశ్ తో జరగబోయే రెండు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ కోసం చెన్నై చేరుకుని నెట్స్ లోకి దిగింది. ఇక బంగ్లాతో రెండు టెస్టులు, మూడు టీ20 మ్యాచ్ లు ఆడనుంది టీమిండియా. అయితే కేవలం ఒక టెస్ట్ కు మాత్రమే బీసీసీఐ జట్టును ప్రకటించింది. మిగిలిన టెస్ట్ కు, టీ20 సిరీస్ కు ఒకేసారి టీమ్ ను ప్రకటించాలని బీసీసీఐ భావిస్తోంది. ఈ క్రమంలోనే టీమిండియా యంగ్ ప్లేయర్ శుబ్ మన్ గిల్ ను ఈ టీ20 సిరీస్ నుంచి తప్పించాలని మేనేజ్ మెంట్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇక ఇదే బాటలో మరో ఇద్దరు స్టార్స్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

బంగ్లాదేశ్ తో జరగబోయే 3 టీ20 మ్యాచ్ ల సిరీస్ కు టీమిండియా యంగ్ బ్యాటర్ కు విశ్రాంతిని ఇవ్వాలని బీసీసీఐ భావిస్తోంది. దానికి గల కారణాలను కూడా బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. అక్టోబర్ లో న్యూజిలాండ్ తో మూడు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ ను టీమిండియా ఆడాల్సి ఉంది. దానిని దృష్టిలో ఉంచుకునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గిల్ తో పాటుగా జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ లకు కూడా విశ్రాంతిని ఇవ్వాలని చూస్తోంది. అలాగే పంత్ కు కూడా రెస్ట్ ఇవ్వాలన్న ఆలోచనలో ఉంది. ఇదే జరిగితే పంత్ స్థానంలో ఇషాన్ కిషన్ జట్టులోకి వస్తాడు.

“బంగ్లాదేశ్ తో జరగబోయే టీ20 షెడ్యూల్ ప్రకారం తొలి మ్యాచ్ గ్వాలియర్ లో అక్టోబర్ 7న, రెండో మ్యాచ్ 10న ఢిల్లీలో, మూడోది హైదరాబాద్ లో 13వ తారీఖున జరగనున్నాయి. అలాగే అక్టోబర్ 16 నుంచి కివీస్ తో మూడు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ ప్రారంభం కానుంది. లాస్ట్ టీ20 మ్యాచ్ కు కివీస్ తో తొలి టెస్ట్ మ్యాచ్ కు మధ్య మూడు రోజులే గ్యాప్ ఉంది. కాబట్టి శుబ్ మన్ గిల్ కు రెస్ట్ ఇవ్వడం చాలా ముఖ్యం” అని బీసీసీఐకి చెందిన ఓ అధికారి తెలిపాడు. కాగా.. ప్రస్తుతం గిల్ వన్డే, టీ20 జట్లకు వైస్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. బంగ్లాదేశ్ తో జరగబోయే తొలి టెస్ట్ కు జట్టులో ఉన్న గిల్ మ్యాచ్ కోసం రెడీ అవుతున్నాడు. అయితే దులీప్ ట్రోఫీ 2024 తొలి రౌండ్ మ్యాచ్ ల్లో పెద్దగా రాణించలేకపోయాడు. ఇండియా ఏకు కెప్టెన్ గా చేసిన గిల్ తొలి మ్యాచ్ లో 25, 21 పరుగులే చేసి తీవ్రంగా నిరాశపరిచాడు. అయితే బీసీసీఐ తీసుకోబోతున్న ఈ నిర్ణయం గిల్ కు ఊహించని షాక్ కు గురిచేసింది. మరి బంగ్లాతో జరగబోయే టీ20 సిరీస్ కు శుబ్ మన్ గిల్ తో పాటుగా బుమ్రా, సిరాజ్ కు రెస్ట్ ఇవ్వాలన్న బీసీసీఐ ఆలోచనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments