BREAKING: వరల్డ్‌ కప్‌ కోసం భారత జట్టును ప్రకటించిన BCCI

భారత్‌ వేదికగా అక్టోబర్‌ 5 నుంచి ప్రతిష్టాత్మక వన్డే వరల్డ్‌ కప్‌ 2023 టోర్నీ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీ కోసం ఇప్పటికే దాదాపు అన్ని జట్లు సంసిద్ధంగా ఉన్నాయి. ప్రస్తుతం టీమిండియా ఆసియా కప్‌లో బిజీగా ఉంది. ఈ క్రమంలో భారత సెలెక్టర్లు వరల్డ్‌ కప్‌ కోసం 15 మందితో కూడిన స్క్వౌడ్‌ను ప్రకటించారు. రోహిత్‌ శర్మ కెప్టెన్‌గా, హార్ధిక్‌ పాండ్యా వైస్‌ కెప్టెన్‌గా ఉన్న ఈ జట్టు ఎంతో పటిష్టంగా ఉంది.

అయితే దాదాపు ఆసియా కప్‌ 2023లో ఆడుతున్న జట్టు నుంచే వరల్డ్‌ కప్‌ కూడా జట్టును ఎంపిక చేశారు. ఆసియా కప్‌కు 18 మందితో స్క్వౌడ్‌ను ప్రకటించిన బీసీసీఐ. అందులోంచి ఓ ముగ్గురిని తగ్గించి, మొత్తం 15 మందితో వరల్డ్‌ కప్‌ స్క్వౌడ్‌ను ఎంపిక చేసింది. టీమిండియా కోర్‌ టీమ్‌నే వరల్డ్‌ కప్‌కు పెద్దగా మార్పులు లేకుండా ఎంపిక చేశారు. అయితే.. 1983లో తొలి సారి వన్డే వరల్డ్‌ కప్‌ నెగ్గిన భారత్‌, 28 ఏళ్ల తర్వాత 2011లో రెండో సారి వరల్డ్‌ కప్‌ గెలిచింది. మళ్లీ అప్పటి నుంచి ఆ ట్రోఫీని ముద్దాడలేదు. అయితే.. 2011లోలానే ఈ సారి కూడా వరల్డ్‌ కప్‌ టోర్నీ భారత్‌లోనే జరగడంతో టాప్‌ ఆటగాళ్లంతా భీకర ఫామ్‌లో ఉండటంతో టీమిండియా కప్పు కొడుతుందని అభిమానులంతా ఎంతో ఆశతో ఉన్నారు.

సెలెక్టర్లు ప్రకటించిన జట్టు ఇలా ఉంది.. రోహిత్‌ శర్మ(కెప్టెన్‌), శుబ్‌మన్‌ గిల్‌, విరాట్‌ కోహ్లీ, ఇషాన్‌ కిషన్‌, కేఎల్‌ రాహుల్‌, హార్థిక్‌ పాండ్యా, శ్రేయస్‌ అయ్యర్‌, రవీంద్ర జడేజా, సూర్యకుమార్‌ యాదవ్‌, అక్షర్‌ పటేల్‌, కుల్దీప్‌ యాదవ్‌, జస్ప్రీత్‌ బుమ్రా, మొహమ్మద్‌ షమీ, మొహమ్మద్‌ సిరాజ్‌, శార్దుల్‌ ఠాకూర్‌. మరి ఈ వరల్డ్‌ కప్‌ టీమ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: అరుదైన ఘనత సాధించిన విరాట్ కోహ్లీ! అజహరుద్దీన్‌ తర్వాత..

Show comments