PAK vs BAN: పాకిస్థాన్‌ ఓవర్‌ కాన్ఫిడెన్స్‌కు సరిగ్గా బుద్ధి చెప్పిన బంగ్లాదేశ్‌!

PAK vs BAN, Mushfiqur Rahim: పాకిస్థాన్‌తో జరుగుతున్న తొలి టెస్టులో బంగ్లాదేశ్‌ బ్యాటర్లు అదరగొడుతున్నారు. పాకిస్థాన్‌ ఓవర్‌ కాన్ఫిడెన్స్‌కు సూపర్‌గా కౌంటర్‌ ఇస్తూ.. ఒక విధంగా పాక్‌ పరువు తీశారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

PAK vs BAN, Mushfiqur Rahim: పాకిస్థాన్‌తో జరుగుతున్న తొలి టెస్టులో బంగ్లాదేశ్‌ బ్యాటర్లు అదరగొడుతున్నారు. పాకిస్థాన్‌ ఓవర్‌ కాన్ఫిడెన్స్‌కు సూపర్‌గా కౌంటర్‌ ఇస్తూ.. ఒక విధంగా పాక్‌ పరువు తీశారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

రెండు టెస్టుల సిరీస్‌ ఆడేందుకు పాకిస్థాన్‌కు వెళ్లిన బంగ్లాదేశ్‌ జట్టు.. అసాధారణ ఆటతో పాక్‌ జట్టుకు గట్టి కౌంటర్‌ ఇస్తోంది. ముఖ్యంగా పాకిస్థాన్‌ ఓవర్‌ కాన్ఫిడెన్స్‌పై బంగ్లా బ్యాటర్లు కొట్టిన దెబ్బ సూపర్‌ అనే చెప్పాలి. రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా.. రావాల్పిండి వేదికగా తొలి టెస్ట్‌ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్‌ జట్టు తొలుత బ్యాటింగ్‌ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 448 పరుగులు చేసింది. ఆరంభంలో 16 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయినా.. తర్వాత కోలుకొని భారీ స్కోర్‌ చేసింది. ఓపెనర్‌ షఫీఖ్‌, కెప్టెన్‌ షాన్‌ మసూద్‌, మాజీ కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌ దారుణంగా విఫలం అయ్యారు.

ఆ తర్వాత సౌద్‌ షకీల్‌తో కలిసి యువ ఓపెనర్‌ సైమ్‌ అయ్యూబ్‌ ఇన్నింగ్స్‌ను నిలబెట్టే ప్రయత్నం చేశాడు. హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత అయ్యూబ్‌ అవుట్‌ అయ్యాడు. ఇక ఇక్కడి నుంచి సౌద్‌ షకీల్‌-మొహమ్మద్‌ రిజ్వాన్‌ జోడి బంగ్లాదేశ్‌పై పూర్తి ఆధిపత్యం చెలాయించింది. ఇద్దరు సెంచరీలతో చెలరేగారు. సౌద్‌ షకీల్‌ 141 పరుగులు చేసి అవుట్‌ అయినా.. రిజ్వాన్‌ మాత్రం డబుల్‌ సెంచరీ దిశగా దూసుకెళ్లాడు. మొత్తం 113 ఓవర్ల తర్వాత 6 వికెట్ల నష్టానికి 448 పరుగులు చేసిన తర్వాత.. ఆ స్కోర్‌ బంగ్లాదేశ్‌ను రెండు సార్లు ఆలౌట్‌ చేయడానికి సరిపోతుందని.. ఓవర్‌ కాన్ఫిడెన్స్‌తో పాకిస్థాన్‌ కెప్టెన్‌ షాన్‌ మసూద్‌ ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేశారు. పాపం. రిజ్వాన్‌ 171 పరుగులు చేసి డబుల్ సెంచరీకి మరో 29 పరుగుల దూరంలోనే ఉన్నాడు. అయినా.. కూడా పాక్‌ ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది.

తమకు 448 పరుగులు సరిపోతాయనే ఓవర్‌ కాన్ఫిడెన్స్‌తో కనీసం 500 స్కోర్‌ కూడా లేకుండా ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసిన పాకిస్థాన్‌కు షాకిస్తూ.. బంగ్లాదేశ్‌ జట్టు.. 448 పరుగుల స్కోర్‌ను దాటేస్తూ భారీ స్కోర్‌ దిశగా దూసుకెళ్తోంది. బంగ్లా సీనియర్‌ బ్యాటర్‌ముష్ఫికర్ రహీమ్ 148 పరుగులతో బ్యాటింగ్‌ చేస్తూ.. పాక్‌ పొగరు అణుస్తున్నాడు. అతని పాటు మెహదీ హసన్‌ మిరాజ్‌ 42 రన్స్‌తో ఆడుతున్నాడు. అలాగే ఓపెనర్‌ ఇస్లామ్‌ 93 పరుగులతో రాణించాడు. మొమినుల్‌ 50. లిట్టన్‌ దాస్‌ 56 పరుగులు చేసి పర్వాలేదనిపించారు. ఇలా బంగ్లా బ్యాటర్లు రాణించడంతో.. ఆట నాలుగో రోజు 6 వికెట్ల నష్టానికి బంగ్లాదేశ్‌ 460కి పైగా పరుగులు చేసి భారీ స్కోర్‌ దిశగా వెళ్తుంది. 448 పరుగులు చేయకుండా బంగ్లాదేశ్‌ను రెండు సార్లు ఆలౌట్‌ చేసి మ్యాచ్‌ గెలుద్దాం అనుకున్న పాకిస్థాన్‌కు ఇది చెప్పపెట్టు లాంటి మ్యాచ్‌ అనొచ్చు. మరి బంగ్లాదేశ్‌ ఫైట్‌ బ్యాక్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments