Babar Azam: వీడియో: భారీ సిక్స్‌.. ఊహించని ఘటనతో వణికిపోయిన బాబర్‌ అజమ్‌!

న్యూజిలాండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో పాకిస్థాన్‌ వరుస పరాజయాలను చవిచూస్తోంది. మంగళవారం జరిగిన మూడో మ్యాచ్‌లో కూడా ఓటమి పాలైంది. అయితే.. ఈ మ్యాచ్‌లో పాక్‌ ఆటగాడు బాబర్‌ ఓ సిక్స్‌ కొట్టి భయపడిపోయాడు. అలా ఎందుకు జరిగిందో ఇప్పుడు చూద్దాం..

న్యూజిలాండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో పాకిస్థాన్‌ వరుస పరాజయాలను చవిచూస్తోంది. మంగళవారం జరిగిన మూడో మ్యాచ్‌లో కూడా ఓటమి పాలైంది. అయితే.. ఈ మ్యాచ్‌లో పాక్‌ ఆటగాడు బాబర్‌ ఓ సిక్స్‌ కొట్టి భయపడిపోయాడు. అలా ఎందుకు జరిగిందో ఇప్పుడు చూద్దాం..

పాకిస్థాన్‌ మాజీ కెప్టెన్‌, స్టార్‌ బ్యాటర్‌ బాబర్‌ అజమ్‌ ఓ సిక్స్‌ కొట్టి వణికిపోయాడు. అదేంటి సిక్స్‌ కొట్టి ఎవరైనా సంతోష పడతారు కానీ, ఎందుకు వణికిపోతారు అని అనుకుంటున్నారా? అవును నిజమే. కానీ, ఇక్కడ బాబర్‌ పరిస్థితి వేరు. ఇక్కడ బాబర​ అజమ్‌ కొట్టిన సిక్స్‌ వెళ్లి నేరుగా ఒక వ్యక్తి నెత్తిపై పడింది. పాపం.. కొద్దిలో అతను ప్రాణాలతో బయటపట్టాడు. సరైన సమయానికి స్పందించి చేతులు అడ్డుపెట్టుకున్నాడు కాబట్టి సరిపోయింది లేదంటే.. చాలా దారుణం జరిగేది. అందుకే బాబర్‌ అజమ్‌ అంత మంచి షాట్‌ కొట్టినా కూడా అది మర్చిపోయి.. పాపం ఆ వ్యక్తికి ఏమైనా గట్టిగా తగిలిందేమోనని కంగారు పడ్డాడు. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

అయితే.. ఈ ఘటన పాకిస్థాన్‌-న్యూజిలాండ్‌ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో చోటు చేసుకుంది. న్యూజిలాండ్‌ బౌలర్‌ మ్యాట్‌ హెన్రీ వేసిన ఇన్నింగ్స్‌ 13వ ఓవర్‌లో నాలుగో బంతిని బాబర్‌ అజమ్‌ అద్భుతమైన పుల్‌షాట్‌ ఆడాడు. దాంతో బాల్‌ మిడ్‌ వికెట్‌ పైనుంచి భారీ సిక్స్‌గా వెళ్లింది. అయితే.. ఆ బాల్‌నేరుగా ఒక వ్యక్తి నెత్తిపై పడబోయింది. వెంటనే గమనించిన ఆ వ్యక్తి రెండు చేతులు తలకు అడ్డుపెట్టుకోవడంతో ప్రమాదం తప్పిందనే చెప్పాలి. లేకుంటే.. బాల్‌ తలకు తగిలి ఉంటే.. అతని ప్రాణాలకు ప్రమాదం వాటిల్లేది. కాగా, బాల్‌ ఎక్కడ ఆ వ్యక్తికి తగిలి గాయం అయిందో అనే కంగారు బాబర్‌ అజమ్‌లో కనిపించింది. ప్రేక్షకుడి క్షేమం గురించి బాబర్‌ కంగారు పడటంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నాడు.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో బాబర్‌ అజమ్‌ హాఫ్‌ సెంచరీతో రాణించాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 224 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. కివీస్‌ ఓపెనర్‌ ఫిన్‌ అలెన్‌ ఏకంగా సెంచరీతో రెచ్చిపోయాడు. కేవలం 62 బంతుల్లోనే 5 ఫోర్లు, 16 సిక్సులతో 137 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు. అతని దెబ్బకు పాక్‌ బౌలింగ్‌ ఎటాక్‌ మొత్తం భారీగా పరుగులు సమర్పించుకుంది. ఇక 225 పరుగుల భారీ టార్గెట్‌ను ఛేదించేందుకు బరిలోకి దిగిన పాకిస్థాన్‌ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 179 పరుగుల చేసి ఓటమి పాలైంది. ఈ ఓటమితో ఐదు టీ20ల సిరీస్‌ను 0-3తో కోల్పోయింది. మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. మరి ఈ మ్యాచ్‌లో బాబర్‌ సిక్స్‌ దెబ్బకు ఓ వ్యక్తి ప్రమాదం నుంచి బయటపటడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments