AUS vs WI: గబ్బా ఓటమికి ప్రతీకారం! విండీస్‌ను చావుదెబ్బ కొట్టిన ఆసీస్‌

గబ్బాలో ఆసీస్‌ను ఓడించి.. విండీస్‌ చరిత్ర సృష్టించింది. కానీ, ఆసీస్‌ ఆ ఓటమికి ప్రతీకారం చాలా త్వరగా తీర్చుకుంది. ముఖ్యంగా విండీస్‌తో జరిగిన మూడో వన్డేలో కంగారులు వారి విశ్వరూపం చూపించారు.

గబ్బాలో ఆసీస్‌ను ఓడించి.. విండీస్‌ చరిత్ర సృష్టించింది. కానీ, ఆసీస్‌ ఆ ఓటమికి ప్రతీకారం చాలా త్వరగా తీర్చుకుంది. ముఖ్యంగా విండీస్‌తో జరిగిన మూడో వన్డేలో కంగారులు వారి విశ్వరూపం చూపించారు.

ఇటీవల గబ్బా వేదికగా జరిగిన టెస్ట్‌ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను ఓడించిన వెస్టిండీస్‌ చరిత్ర సృష్టించింది. గబ్బాలో ఓటమి ఆస్ట్రేలియా చాలా అవమానకరంగా భావించింది. ప్రస్తుతం ప్రపంచ క్రికెట్‌లో పసికూనగా ఉన్న వెస్టిండీస్‌.. తమను గబ్బాలో ఓడించడం కంగారులు జీర్ణించుకోలేకపోయారు. ఆ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవడానికి ఆస్ట్రేలియాకు ఎన్నో రోజులు పట్టలేదు. టెస్టు సిరీస్‌ ముగిసిన వెంటనే.. ఆస్ట్రేలియా-వెస్టిండీస్‌ మధ్య మూడు వన్డేల సిరీస్‌ ప్రారంభమైంది. గబ్బా ఓటమికి ప్రతీకారం తీర్చుకోవడానికి ఇదే సరైన వేదికగా భావించిన ఆస్ట్రేలియా.. తన అసలు విశ్వరూపాన్ని ఈ వన్డే సిరీస్‌లో చూపించింది. తాము సరిగ్గా ఆడితే ఎలా ఉంటుందో కరేబియన్లకు చూపిస్తూ.. వన్డే సిరీస్‌ను 3-0తో కైవసం చేసుకుంది.

అయితే.. గబ్బా ఓటమికి అసలు ప్రతీకారం మాత్రం చివరిదైన మూడో వన్డేలో తీర్చుకుంది. కాన్‌బెర్రా వేదికగా మంగళవారం జరిగిన మూడో వన్డేలో ఆస్ట్రేలియా బౌలర్లు విండీస్‌ బ్యాటింగ్‌ లైనప్‌తో ఫుట్‌బాల్‌ ఆడారు. జేవియర్ బార్ట్‌లెట్ ఏకంగా నాలుగు వికెట్లతో చెలరేగాడు. ల్యాన్స్‌ మోరిస్‌, ఆడమ్‌ జంపా రెండేసి వికెట్లు తీసుకున్నారు. వీరి ప్రతాపం ముందు.. వెస్టిండీస్‌ బ్యాటర్లు నిలువలేకపోయారు. వన్డే మ్యాచ్‌ ఆడుతున్న వెస్టిండీస్‌ ఆ సంగతి మర్చిపోయి.. అత్యంత దారుణంగా కేవలం 86 పరుగులకే ఆలౌట్‌ అయింది. ఓపెనర్‌ అలిక్ అథనాజ్ ఒక్కడే 32 పరుగులతో పర్వాలేదనిపించాడు. మిగతా బ్యాటర్లు ఎవరూ.. ఆస్ట్రేలియా బౌలింగ్‌ ముందు నిలువులేకపోయారు.

ఇక్కడితో విండీస్‌ పని అయిపోలేదు. ఆసీస్‌ అసలు విశ్వరూపం ఇక్కడి నుంచే ప్రారంభమైంది. 87 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా.. కేవలం 6.5 ఓవర్లలో విండీస్‌ బౌలర్లను ఊచకోత కోస్తూ.. ఛేదించింది. ఓపెనర్లు జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, జోష్‌ ఇంగ్లిస్‌ కరేబియన్‌ బౌలర్లపై వీరవిహారం చేశారు. మెక్‌గుర్క్‌ 18 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సులతో 41 పరుగులు, జోష్‌ 16 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్స్‌తో 35 పరుగులు చేసి.. సూపర్‌ స్టార్ట్‌ అందించడమే కాకుండా.. మ్యాచ్‌ను దాదాపు ముగించేశారు. ఆరోన్ హార్డీ, మెక్‌గుర్క్‌ అవుట్‌ అవ్వడంతో.. ఇంగ్లిస్‌, స్మిత్‌ మిగతా పని పూర్తి చేశారు. ఇలా గబ్బాలో విండీస్‌ చేతలో ఎదురైన ఓటమికి ప్రతీకారంగా ఆసీస్‌.. తమ బలం మొత్తం వన్డే సిరీస్‌లో చూపించింది. అయితే.. ఇలాంటి వంద వన్డేలు.. గబ్బా టెస్ట్‌ విజయం కంటే తక్కువే అని క్రికెట్‌ అభిమానులు అంటున్నారు. మరి ఆసీస్‌ ప్రతీకారంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments