షమర్ జోసెఫ్ కు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన ఆసీస్ కెప్టెన్.. సంతోషమే అంటూ..!

Shamar Joseph - Pat Cummins: వెస్టిండీస్ తో జరిగిన రెండో టెస్ట్ లో 8 పరుగుల తేడాతో ఆసీస్ ఓడిపోయింది. ఇక ఈ ఓటమి తర్వాత విండీస్ యువ సంచలనం షమర్ జోసెఫ్ కు ఊహించని గిఫ్ట్ ఇచ్చాడు ప్యాట్ కమ్మిన్స్.

Shamar Joseph - Pat Cummins: వెస్టిండీస్ తో జరిగిన రెండో టెస్ట్ లో 8 పరుగుల తేడాతో ఆసీస్ ఓడిపోయింది. ఇక ఈ ఓటమి తర్వాత విండీస్ యువ సంచలనం షమర్ జోసెఫ్ కు ఊహించని గిఫ్ట్ ఇచ్చాడు ప్యాట్ కమ్మిన్స్.

క్రికెట్ లో క్రీడా స్ఫూర్తికి మించిన విషయం మరోటి లేదు. క్రికెట్ లోనే కాదు.. ఏ క్రీడలో అయినా.. క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించడం ఆటగాళ్ల ప్రధమ లక్షణం. ఇక ఆటల్లో గెలుపోటములు అన్నవి సహజం అని గ్రహించి.. ముందుకు వెళ్లేవాడే నిజమైన ప్లేయర్. ఇప్పుడు ఇదే విషయాన్ని మరోసారి రుజువుచేశాడు ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్. గబ్బా వేదికగా వెస్టిండీస్ తో జరిగిన రెండో టెస్ట్ లో 8 పరుగుల తేడాతో ఆసీస్ ఓడిపోయింది. ఇక ఈ ఓటమి తర్వాత షమర్ జోసెఫ్ కు ఊహించని గిఫ్ట్ ఇచ్చాడు ప్యాట్ కమ్మిన్స్. గిఫ్ట్ తో పాటుగా జోసెఫ్ పై ప్రశంసల వర్షం కురిపించాడు.

షమర్ జోసెఫ్.. ప్రస్తుతం ప్రపంచ క్రికెట్ లో ఓ సంచలనం. డెబ్యూ టెస్టు లోనే తొలి బంతికి స్టీవ్ స్మిత్ లాంటి స్టార్ ఆటగాడిని ఔట్ చేసి, అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తాడు ఈ యంగ్ బౌలర్. దీంతో పాటుగా అరంగేట్రం చేసిన మ్యాచ్ లోనే 5 వికెట్లు తీసి తాను ఎంత ప్రమాదకరమైన బౌలరో ఆస్ట్రేలియాతో పాటుగా ప్రపంచానికి చాటిచెప్పాడు. ఇక కంగారూ టీమ్ తో జరిగిన రెండో టెస్ట్ లో మరింతగా చెలరేగిపోయాడు ఈ కరేబియన్ కుర్రాడు. రెండో టెస్ట్ సెకండ్ ఇన్నింగ్స్ లో ఏకంగా 7 వికెట్లు పడగొట్టి ఆసీస్ ను ఒంటిచేత్తో ఓడించాడు. కాలికి గాయమైనప్పటికీ.. ఇంజెక్షన్స్ తీసుకుని మరి బౌలింగ్ కి దిగాడు జోసెఫ్. 27 సంవత్సరాల తర్వాత విండీస్ టీమ్ కు ఆస్ట్రేలియా గడ్డపై తొలి విజయాన్ని అందించి హీరోగా మారాడు. ఇక అతడి బౌలింగ్ కు ఫిదా అయ్యాడు ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్. దాంతో మ్యాచ్ అనంతరం అతడికి తన జెర్సీని గిఫ్ట్ గా ఇవ్వడమే కాకుండా.. జోసెఫ్ జెర్సీని తాను తీసుకున్నాడు. ఈ సందర్భంగా ప్యాట్ కమ్మిన్స్ మాట్లాడుతూ..

“క్రికెట్ ఫ్యాన్ గానే కాకుండా.. టెస్ట్ క్రికెట్ అభిమానిగా ఈ మ్యాచ్ నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. మేము ఓడిపోయినప్పటికీ ఈ గేమ్ ను ఎంజాయ్ చేశాం. ఇక ఈ మ్యాచ్ లో విండీస్ యంగ్ ప్లేయర్ షమర్ జోసెఫ్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. అతడి కాలి వేలికి అంత పెద్ద గాయం అయినప్పటికీ.. అద్బుతంగా బౌలింగ్ చేశాడు. జోసెఫ్ నుంచి భవిష్యత్ లో మరిన్ని అద్భుతాలు చూస్తాం. ఒక క్రికెట్ ఫ్యాన్ గా ఈ మ్యాచ్ లో షమర్ బౌలింగ్ చూడటం ఎంతో సంతోంగా ఉంది” అని చెప్పుకొచ్చాడు ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్. ఇక డ్రస్సింగ్ రూమ్ లో ఇద్దరూ జెర్సీలను బహుమతులుగా మార్చుకున్నారు. కాగా.. ఓడిపోయినప్పటికీ కూడా తన క్రీడా స్పూర్తిని చాటుకున్న ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments