నా వికెట్ల క్రెడిట్ అతడికే.. సీక్రెట్ రివీల్ చేసిన అర్షదీప్!

నా వికెట్ల క్రెడిట్ అతడికే.. సీక్రెట్ రివీల్ చేసిన అర్షదీప్!

Arshdeep Singh: టీ20 వరల్డ్ కప్ లో అరుదైన రికార్డు నెలకొల్పాడు టీమిండియా స్టార్ పేసర్ అర్షదీప్ సింగ్. ఇక ఈ టోర్నీలో తన వికెట్ల క్రెడిట్ లో అతడికి కూడా భాగముందని చెప్పుకొచ్చాడు. మరి ఆ రికార్డ్ ఏంటి? క్రెడిట్ ఇచ్చిన ఆ ప్లేయర్ ఎవరు? చూద్దాం పదండి.

Arshdeep Singh: టీ20 వరల్డ్ కప్ లో అరుదైన రికార్డు నెలకొల్పాడు టీమిండియా స్టార్ పేసర్ అర్షదీప్ సింగ్. ఇక ఈ టోర్నీలో తన వికెట్ల క్రెడిట్ లో అతడికి కూడా భాగముందని చెప్పుకొచ్చాడు. మరి ఆ రికార్డ్ ఏంటి? క్రెడిట్ ఇచ్చిన ఆ ప్లేయర్ ఎవరు? చూద్దాం పదండి.

టీ20 వరల్డ్ కప్ 2024లో టీమిండియా యంగ్ పేసర్ అర్షదీప్ సింగ్ అదరగొడుతున్నాడు. ప్రారంభ ఓవర్లోనే వికెట్లు పడగొడుతూ.. జట్టుకు బ్రేక్ త్రూలు అందిస్తున్నాడు. ముఖ్యంగా అమెరికా పిచ్ లపై లీగ్ దశలో సాగిన లో స్కోరింగ్ మ్యాచ్ లను కాపాడటంలో బౌలర్లది కీలక పాత్ర. ఈ విజయాల్లో బుమ్రాతో పాటుగా యువ పేసర్ అర్షదీప్ సింగ్ ముఖ్య భూమికలను పోషించారు. ఇక ఈ టోర్నీలో అరుదైన రికార్డును నెలకొల్పాడు అర్షదీప్. ఇక తన వికెట్ల క్రెడిట్ మాత్రం అతడికే ఇస్తానంటూ చెప్పుకొచ్చాడు. మరి ఈ యంగ్ పేసర్ నెలకొల్పిన ఆ రికార్డు ఏంటి? క్రెడిట్ ఇచ్చిన ఆ ప్లేయర్ ఎవరు? తెలుసుకుందాం పదండి.

అర్షదీప్ సింగ్.. ప్రస్తుతం జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ లో తనదైన బౌలింగ్ తో ప్రత్యర్థులకు చెమటలు పట్టిస్తున్నాడు. స్వింగ్ బౌలింగ్ తో కింగ్ లాంటి ప్లేయర్లను బోల్తా కొట్టిస్తున్నాడు. ఇక ఈ టోర్నీలో అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. టీ20 వరల్డ్ కప్ చరిత్రలో ఒకే ఎడిషన్ లో అత్యధిక వికెట్లు తీసిన భారతీయ బౌలర్ గా అర్షదీప్ నిలిచాడు. ఇంతకు ముందు ఈ రికార్డు ఆర్సీ సింగ్ పేరిట ఉండేది. అతడు 2007 వరల్డ్ కప్ లో 12 వికెట్లు పడగొట్టాడు. ఈ టోర్నీలో 15 వికెట్లు పడగొట్టి అర్షదీప్ ఆ రికార్డును బద్దలు కొట్టాడు.

ఈ వరల్డ్ కప్ లో అర్షదీప్ వరుసగా ఐర్లాండ్ పై 2, పాక్ పై 1, అమెరికాపై 4, ఆఫ్గానిస్తాన్ పై 3, బంగ్లాదేశ్ పై 2, ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో 3 వికెట్లతో సత్తాచాటాడు. కేవలం ఆరు మ్యాచ్ ల్లోనే ఆర్పీ సింగ్ రికార్డును బద్దలు కొట్టాడు. కాగా.. ఓవరాల్ గా ఈ ప్రపంచ కప్ లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల లిస్ట్ లో అర్షదీప్ రెండో ప్లేస్ లో కొనసాగుతున్నాడు. 16 వికెట్లతో ఆఫ్గాన్ బౌలర్ ఫజల్ హక్ ఫారూఖీ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. సెమీస్, ఫైనల్లో ఇదే జోరును చూపిస్తే.. ఫారూఖీని దాటేయడం ఖాయం.

ఇక ఈ టోర్నీలో తన ప్రదర్శనపై స్పందించాడు అర్షదీప్..”ప్రస్తుతం నా ఫామ్ పట్ల సంతోషంగా ఉన్నాను. ఇక నా సక్సెస్ లో జస్ప్రీత్ బుమ్రాకు క్రెడిట్ దక్కుతుంది. నా వికెట్ల క్రెడిట్ అతడికే. బుమ్రా ఒకవైపు బ్యాటర్లపై ఒత్తిడి తెస్తూ.. పరుగులు నియంత్రిస్తాడు. ఒక్కో ఓవర్లో కేవలం 3-4 పరుగులే ఇస్తాడు. దాంతో బ్యాటర్లు నన్ను టార్గెట్ చేయాలనుకుంటారు. నా బౌలింగ్ లో భారీ షాట్లకు ప్రయత్నిస్తారు. ఇది తెలిసిన నేను.. నా శైలిలో బంతులు సంధిస్తూ.. వికెట్లు పడగొడుతూ ఉంటాను. ఈ టోర్నీలో ఇదే వర్కౌట్ అవుతోంది” అంటూ తన సక్సెస్ సీక్రెట్ ను రివీల్ చేశాడు యంగ్ ప్లేయర్. మరి వికెట్ల క్రెడిట్ ను అర్షదీప్, బుమ్రాకు ఇవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments