ఛాంపియన్స్ ట్రోఫీపై తేల్చేసిన అమిత్ షా.. ఒక్క కామెంట్​తో ఫుల్ క్లారిటీ!

Amit Shah, Champions Trophy 2025, Team India, Pakistan: ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పాకిస్థాన్​కు టీమిండియా వెళ్తుందా? చాన్నాళ్లుగా జవాబు లేని ప్రశ్నగానే ఇది ఉండిపోయింది. తమ దేశానికి రోహిత్ సేన వచ్చి తీరాలని పీసీబీ పట్టు పడుతోంది.

Amit Shah, Champions Trophy 2025, Team India, Pakistan: ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పాకిస్థాన్​కు టీమిండియా వెళ్తుందా? చాన్నాళ్లుగా జవాబు లేని ప్రశ్నగానే ఇది ఉండిపోయింది. తమ దేశానికి రోహిత్ సేన వచ్చి తీరాలని పీసీబీ పట్టు పడుతోంది.

ఛాంపియన్స్ ట్రోఫీ-2025కు పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది ఆరంభంలో జరిగే ఈ టోర్నమెంట్ కోసం దాయాది దేశానికి టీమిండియా వెళ్తుందా అనే ప్రశ్నలు వస్తున్నాయి. ఈ టోర్నమెంట్​కు రోహిత్ సేనను పంపేది లేదంటూ ముందు నుంచి చెప్పుకుంటూ వస్తోంది భారత క్రికెట్ బోర్డు. సెక్యూరిటీ రీజన్స్, ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు లేకపోవడం, సరిహద్దు సమస్యల నేపథ్యంలో ఆ టోర్నీకి వచ్చేది లేదంటూ పట్టుదలగా ఉంటోంది. జైషా ఐసీసీ ప్రెసిడెంట్ అవడంతో ఈ విషయంలో భారత్ మాట నెగ్గడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే పాక్ క్రికెట్ బోర్డు మాత్రం ఈ విషయంలో మొండిగా వ్యవహరిస్తోంది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, న్యూజిలాండ్ సహా అన్ని టీమ్స్ వస్తున్నాయని.. భారత్​కు మాత్రం ఎందుకు రాదంటూ అడ్డగోలుగా వాదిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ అంశంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా తాజాగా తేల్చేశారు.

భారత్-పాకిస్థాన్ సంబంధాలపై అమిత్ షా తాజాగా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఉగ్రవాదం అంతం అయ్యే వరకు పాక్​తో చర్చలు జరిపేది లేదన్నారు. అయితే కశ్మీర్ యువతతో మాత్రం తాము తప్పకుండా మాట్లాడతామని తెలిపారు. లైన్ ఆఫ్​ కంట్రోల్ గుండా జరిగే ఇరు దేశాల మధ్య జరిగే ఎగుమతులు, దిగుమతుల పునరుద్ధరణ గురించి అడిగిన ప్రశ్నకు ఆయన పైవిధంగా ఆన్సర్ ఇచ్చారు. ట్రేడ్ ఎకో సిస్టమ్​లోనూ టెర్రరిస్టుల భాగస్వామ్యం ఉందన్న షా.. ఉగ్రవాదం అంతం అయ్యే వరకు ఎలాంటి సంబంధాలను పునరుద్ధరించబోమని స్పష్టం చేశారు. ఆయన వ్యాఖ్యలతో ఛాంపియన్స్ ట్రోఫీపై క్లారిటీ వచ్చేసిందని ఎక్స్​పర్ట్స్ అంటున్నారు. పాక్​కు టీమిండియాను పంపబోమని ఆయన ఇన్​డైరెక్ట్​గా క్లారిటీ ఇచ్చారని చెబుతున్నారు. షా వ్యాఖ్యలతో పాక్​పై భారత్ ఎంత సీరియస్​గా ఉందన్నది అర్థం అవుతోందని.. ఈ సిచ్యువేషన్స్​లో ఇంక టీమ్​ను పాక్​కు ఎలా పంపిస్తారని ఎదురు ప్రశ్నిస్తున్నారు.

Show comments