విరాట్‌ కోహ్లీ క్యారెక్టర్‌ గురించి సంచలన ఆరోపణలు చేసిన అమిత్‌ మిశ్రా!

Amit Mishra, Virat Kohli: టీమిండియా మాజీ క్రికెటర్‌ అమిత్‌ మిశ్రా.. విరాట్‌ కోహ్లీపై షాకింగ్‌ కామెంట్స్‌ చేశాడు. దీంతో కోహ్లీ ఫ్యాన్స్‌ అతనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ అతను ఏమన్నాడో ఇప్పుడు తెలుసుకుందాం..

Amit Mishra, Virat Kohli: టీమిండియా మాజీ క్రికెటర్‌ అమిత్‌ మిశ్రా.. విరాట్‌ కోహ్లీపై షాకింగ్‌ కామెంట్స్‌ చేశాడు. దీంతో కోహ్లీ ఫ్యాన్స్‌ అతనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ అతను ఏమన్నాడో ఇప్పుడు తెలుసుకుందాం..

టీమిండియా మాజీ క్రికెటర్‌ అమిత్‌ మిశ్రా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని సంచలన వ్యాఖ్యలు చేశాడు. ముఖ్యంగా టీమిండియా మాజీ కెప్టెన్‌, స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీని టార్గెట్‌ చేస్తూ అతను సంచలన ఆరోపణలు చేశాడు. ఈ వ్యాఖ్యలపై కోహ్లీ అభిమానులు అమిత్‌ మిశ్రాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కెరీర్‌ అయిపోయిన తర్వాత.. ఎలాగైన ట్రెండింగ్‌లో ఉండాలని ఇలాంటి చీప్‌ కామెంట్స్‌ చేస్తున్నాడంటూ మండిపడుతున్నారు. అసలు అమిత్‌ మిశ్రా ఏం అన్నాడు? ఎందుకు కోహ్లీ అభిమానులు అంతలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..

ఓ ఇంటర్వ్యూలో యాంకర్‌ మాట్లాడుతూ.. ఇండియన్‌ క్రికెట్‌లో సచిన్‌ టెండూల్కర్‌ను వ్యక్తిగతంగా చాలా గౌరవిస్తారు. అలాగే రాహుల్‌ ద్రవిడ్‌, సౌరవ్‌ గంగూలీని కూడా చాలా మంది ఎడ్మైర్‌ చేస్తారు. తాజాగా రాహుల్‌ ద్రవిడ్‌ కూడా రోహిత్‌ శర్మ గురించి చెబుతూ వ్యక్తిగా రోహిత్‌ చాలా మంచి వాడని, ఒక వ్యక్తిగా అతన్ని మిస్‌ అవుతున్నాను అంటూ చెప్పాడు. చాలా మంది యువ క్రికెటర్లు కూడా రోహిత్‌ చాలా మంచోడని అంటూ ఉంటారు. అలాగే ధోని గురించి చెబుతూ ఉంటారు. ఇలా మంచి తనంలో, మంచి వ్యక్తితత్వంలో విరాట్‌ కోహ్లీకి అంత గౌరవం లేదని అనుకోవచ్చా? అతని ఆట ఎక్కడో ఉంటే అతనికి దక్కే గౌరవం మాత్రం అంత లేదని అనుకోవచ్చా? దానికి కారణం ఏమై ఉంటుంది ? అని ప్రశ్నించాడు.

దీనికి అమిత్‌ మిశ్రా బదులిస్తూ.. అవును. కొంతమందితో పోల్చుకుంటే కోహ్లీ అంత గౌరవం దక్కడం లేదు. అంటే అతను అంత మంచి వాడు కాదనే ఉద్దేశంతో మిశ్రా వ్యాఖ్యానించాడు. అందరితో గొడవలు పెట్టుకోవడం, గర్వంతో వ్యవహరించడంతోనే మిగతా గొప్ప క్రికెటర్లకు దక్కినంత గౌరవం కోహ్లీకి దక్కడం లేదనే అర్థం వచ్చేలా మాట్లాడాడు. సచిన్‌, ద్రవిడ్‌, గంగూలీ, రోహిత్‌, ధోని వీరు ఆటతో పాటు మంచితనం కొద్ది చాలా మంది గౌరవాన్ని సంపాదించారని, కానీ కోహ్లీ ఆటగాడిగా గొప్పవాడే కానీ, అతన్ని ఎవరూ పెద్దగా గౌరవించని వాళ్లు మాట్లాడుకున్నారు. అలాగే కోహ్లీ కెప్టెన్‌ అయ్యాక, ఫేమ్‌ వచ్చాక చాలా మారిపోయాడంటూ మిశ్రా పేర్కొన్నాడు. ఈ వ్యాఖ్యలతో కోహ్లీ అభిమానులు అతనిపై మండిపడుతున్నారు. మరి మిశ్రా కోహ్లీ గురించి చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments