ఫేమ్‌ వచ్చాక కోహ్లీ, రోహిత్‌ ఎలా మారిపోయారో చెప్పిన అమిత్‌ మిశ్రా!

Amit Mishra, Virat Kohli, Rohit Sharma: కెప్టెన్సీ, ఫేమ్‌ వచ్చిన తర్వాత విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మలో ఎలాంటి మార్పు వచ్చింది.. ఇద్దరు ఎలా మారిపోయారో తాజాగా అమిత్‌ మిశ్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

Amit Mishra, Virat Kohli, Rohit Sharma: కెప్టెన్సీ, ఫేమ్‌ వచ్చిన తర్వాత విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మలో ఎలాంటి మార్పు వచ్చింది.. ఇద్దరు ఎలా మారిపోయారో తాజాగా అమిత్‌ మిశ్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

ప్రస్తుతం ప్రపంచ క్రికెట్‌లో విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ స్టార్‌ క్రికెటర్లుగా ఉన్నారు. యువ క్రికెటర్‌ నుంచి అతి తక్కువ సమయంలో స్టార్‌ క్రికెటర్‌గా మారిన కోహ్లీ.. ఆ తర్వాత టీమిండియాకు మూడు ఫార్మాట్లలో కెప్టెన్‌ అయి.. సూపర్‌ స్టార్‌ క్రికెటర్‌గా పేరొంది.. ఫేస్‌ ఆఫ్‌ ది వరల్డ్‌ క్రికెట్‌గా ఉన్నాడు. మరోవైపు రోహిత్‌ శర్మ కూడా భారీ ఫేమ్‌ను పొందాడు. హిట్‌ మ్యాన్‌గా వరల్డ్‌ క్రికెట్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందాడు. ప్రస్తుతం టీమిండియా కెప్టెన్‌గా ఉన్నాడు. ఇటీవల తన కెప్టెన్సీలో టీ20 వరల్డ్‌ కప్‌ గెలవడంతో రోహిత్‌ స్టార్‌డమ్‌ మరింత పెరిగింది.

అయితే.. ఈ ఇద్దరు స్టార్‌ క్రికెటర్లతో కెరీర్ స్టార్టింగ్‌లో కలిసి ఆడిన టీమిండియా మాజీ క్రికెటర్‌ అమిత్‌ మిశ్రా తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఫేమ్‌ వచ్చిన తర్వాత.. ఇద్దరిలో ఎలాంటి మార్పు వచ్చింది? ఎవరు ఎలా మారిపోయారు అనే విషయంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అమిత్‌ మిశ్రా మాట్లాడుతూ.. ‘నేను తొలిసారి రోహిత్‌ శర్మను కలిసిన సమయంలో అతను ఎలా ఉన్నాడో.. ఇప్పుడు కూడా అలాగే ఉన్నాడు. అతనిలో ఎలాంటి మార్పు లేదు. ఇంత ఫేమ్‌ వచ్చినా.. రోహిత్‌ ఏం మారలేదు. కానీ, కొంతమంది మాత్రం ఫేమ్‌ వచ్చిన తర్వాత మారిపోతారు. అలాంటి వారిని నేనుచూశాను.’ అని పేర్కొన్నాడు.

విరాట్‌ కోహ్లీలో ఏమైన మార్పు గమనించారా అని ఎదురైన ప్రశ్నకు అమిత్‌ మిశ్రా బదులిస్తూ.. ‘అవును చూశాను.. విరాట్‌ కోహ్లీ ఫేమ్‌ వచ్చిన తర్వాత చాలా మారిపోయాడు. చికూ నుంచి విరాట్‌గా మారిపోయాడు. అది కెప్టెన్సీ, ఫేమ్‌ వల్ల వచ్చిన మార్పుగా చెప్పవచ్చు. మాట్లాడటం తగ్గించేశాడు. అయితే.. ఫేమ్‌ వచ్చిన తర్వాత.. ఎవరు వచ్చి మాట్లాడుతున్నా.. ఏదో ఒక స్వార్థంతో మాట్లాడుతున్నారని అతను అనుకోవడం వల్లే మాట్లాడటం తగ్గించి ఉంటాడు.’ అని అమిత్‌ మిశ్రా వెల్లడించాడు. మొత్తంగా.. కెప్టెన్సీ, ఫేమ్‌ వచ్చిన తర్వాత.. విరాట్‌ కోహ్లీలో చాలా మార్పు వచ్చిందని, రోహిత్‌ శర్మలో ఎలాంటి మార్పు రాలేదని మిశ్రా పేర్కొన్నాడు. మరి అతను చేసిన ఈ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments