61 ఏళ్ల వయసులో ఇంగ్లండ్‌ జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన క్రికెటర్‌! ఎవరతనూ? ఏంటీ కథ?

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఏ అగ్రశ్రేణి జట్టులోకి ఎంట్రీ ఇవ్వాలన్న.. పాతికేళ్ల వయసు రాకముందే ఇవ్వాలి. మూడు పదుల వయసు వచ్చిందంటే.. ఎంత టాలెంట్‌ ఉన్నా జాతీయ జట్టులో చోటు దక్కుతుందనే ఆశలు వదులుకోవాలి. ఎందుకంటే ఆ రేంజ్‌లో పోటీ ఉంటుంది. వయసు పైబడుతున్న ఆటగాళ్లను ఎంపిక చేసేందుకు సెలెక్టర్లు పెద్దగా ఆసక్తి చూపించరు. కానీ.. చరిత్ర ఎప్పుడూ కనీవిని ఎరుగని రీతిలో 61 ఏళ్ల వయసులో ఓ క్రికెటర్‌ ఇంగ్లండ్‌ జాతీయ జట్టుకు ఎంపికయ్యారు. వినేందుకు విడ్డూరంగా ఉన్నా ఇది నిజం. కెవిన్ వాట్సన్ అనే 61 క్రికెటర్‌ ఇంగ్లండ్‌ సీనియర్‌ జట్టుకు ఎంపికయ్యారు.

దేశానికి ప్రాతినిధ్యం వహించాలనే ఆయన బలమైన సంకల్పమే ఆయనను ఇంగ్లండ్‌ సీనియర్‌ జట్టుకు ఎంపికయ్యేలా చేసింది. ఎప్పటికైనా ఇంగ్లండ్‌ జెర్సీ ధరించి, జాతీయ జట్టు తరఫున ఆడాలని వాట్సన్‌ కలలు కన్నారు. తన 15వ ఏటనే క్రికెట్‌లోకి అడుగుపెట్టిన వాట్సన్‌ అప్పటి నుంచి అంచెలంచలుగా క్రికెట్‌ ఆడుతూ వచ్చాడు. ఇంగ్లండ్‌ కౌంటీ క్రికెట్‌లోనూ సత్తా చాటారు. యార్క్‌షైర్‌ టీమ్‌కు కెప్టెన్‌గా కూడా వ్యవహరించారు. ఇటీవల ఆస్ట్రేలియా-ఏతో జరిగిన గ్రే యాషెస​ సిరీస్‌లో ఇంగ్లండ్‌-ఏ జట్టుకు ప్రాతినిథ్యం వహించారు.

ఇక జాతీయ జట్టుకు ఆడాలనే తన చిరకాల కోరిక.. కెనడా మాస్టర్స్‌ టోర్నీ 2023తో తీరనుంది. ఇంగ్లండ్‌తో పాటు ఆస్ట్రేలియా, కెనడా, అమెరికా జట్లు పాల్గొనే ఈ టోర్నీ కోసం ఇంగ్లండ్‌ సీనియర్‌ టీమ్‌కు కెవిన్‌ వ్సాటన్‌ ఎంపికయ్యారు. శనివారం నయాగరా ఫాల్స్‌లో జరిగే వార్మప్‌ మ్యాచ్‌తో ఈ టోర్నీ ప్రారంభం కానుంది. కాగా, ఇంగ్లండ్‌ జెర్సీ ధరించి, జాతీయ జట్టుకు ఆడాలనే తన చిరకాల స్వప్నం నేరవేరనుండటంతో కెవిన్‌ వాట్సన్‌ సంతోషం పట్టేలేకపోతున్నారు. ఈ ఆనంద సమయంలో తాను చంద్రుడిపై విహరిస్తున్న అనుభూతి కలుగుతుందని అన్నారు. మ్యాచ్‌లో బరిలోకి దిగి సత్తాచాటాలని ఉవ్విళ్లూరుతున్నట్లు కనిపిస్తున్నారు. మరి ఈ సంచలన ఎంపికపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: ఐర్లాండ్‌ టీమ్‌లో జూనియర్ జహీర్ ఖాన్! అతనితో జర జాగ్రత్త!

Show comments