Sabari Review: వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్ సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్ శబరి మూవీ ఎలా ఉందంటే

క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా పవర్‌ఫుల్‌ పాత్రల్లో నటిస్తోన్న వరలక్ష్మి శరత్‌ కుమార్‌ తాజాగా శబరి అనే సైకలాజికల్‌ థ్రిల్లర్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ మూవీ ఎలా ఉంది అంటే..

క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా పవర్‌ఫుల్‌ పాత్రల్లో నటిస్తోన్న వరలక్ష్మి శరత్‌ కుమార్‌ తాజాగా శబరి అనే సైకలాజికల్‌ థ్రిల్లర్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ మూవీ ఎలా ఉంది అంటే..

శబరి

03-05-2024, సస్పెన్స్‌ థ్రిల్లర్‌, 2H 9M UA
UA
  • నటినటులు:వరలక్ష్మి శరత్‌కుమార్‌, గణేశ్‌ వెంకట్రామన్‌, శశాంక్‌, మైమ్‌గోపి, సునయన, బేబీ కార్తీక, రాజశ్రీ నాయర్‌ తదితరులు
  • దర్శకత్వం:అనిల్‌ కాట్జ్‌
  • నిర్మాత:మహేంద్రనాథ్‌ కూండ్ల
  • సంగీతం:గోపి సుందర్‌
  • సినిమాటోగ్రఫీ:రాహుల్‌ శ్రీవాత్సవ, నాని చమిడిశెట్టి

Rating

2

వరలక్ష్మి శరత్‌ కుమార్‌.. ఈమధ్య కాలంలో స్టార్‌ హీరోలకు ధీటుగా రాణిస్తోంది. మరీ ముఖ్యంగా లేడీ విలన్‌గా తనకంటూ సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంది. స్టార్‌ కిడ్‌గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రారంభంలో హీరోయిన్‌గా చేసిన వరలక్ష్మి శరత్‌ కుమార్‌.. ఇప్పుడు మాత్రం క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా పవర్‌ఫుల్‌ రోల్స్‌ చేస్తూ.. సౌత్‌ను ఊపేస్తుంది. వరలక్ష్మి శరత్‌ కుమార్‌ నటించింది అంటే ఆ సినిమా సూపర్‌హిట్టు అనే నమ్మకం ప్రేక్షకుల్లో ఉంది. ఈ క్రమంలో వరలక్ష్మి శరత్‌ కుమార్‌ ప్రధాన పాత్రలో నటించిన శబరి సినిమా నేడు విడుదలయ్యింది. మరి ఈ సైకలాజికల్‌ థ్రిల్లర్‌ సినిమా ఎలా ఉంది అంటే..

కథ విషయానికి వస్తే..

సంజ‌న (వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్‌) ధైర్య‌వంతురాలైన మ‌హిళ‌. పెద్ద‌ల‌ను ఎదురించి అర‌వింద్‌ను (గ‌ణేష్ వెంక‌ట్రామ‌న్‌) ప్రేమించి పెళ్లిచేసుకుంటుంది. అయితే అర‌వింద్ జీవితంలో మ‌రో అమ్మాయి ఉంద‌నే నిజం తెలిసి భ‌ర్త‌కు దూరంగా కూతురు రియాతో (బేబీ నివేక్ష‌) క‌లిసి వైజాగ్ వ‌చ్చేస్తోంది సంజ‌న‌. ఉద్యోగ ప్ర‌య‌త్నాలు చేస్తుండగా.. ఆమె కాలేజీ ఫ్రెండ్ అయిన లాయ‌ర్ రాహుల్ (శ‌శాంక్‌) స‌హాయంతో జుంబా ట్రైన‌ర్‌గా  జాబ్ సంపాదిస్తుంది. సంజ‌న ఆచూకీ కోసం సూర్య (మైమ్ గోపీ) అనే క్రిమిన‌ల్ వెతుకుతుంటాడు. దీని గురించి సంజన పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సంచలన విషయాలు వెలుగులోకి వస్తాయి. అసలు సూర్య ఎవరు.. సంజన కోసం ఎందుకు వెతుకున్నాడు.. వీరి వల్ల ఆమె ఎలాంటి సమస్యలు ఎదుర్కొంది.. చివరకు ఎలా బయటపడింది అనేది శబరి కథ.

విశ్లేషణ:

బిడ్డల రక్షణ కోసం తల్లి తన ప్రాణాలను సైతం అడ్డేస్తుంది. ఇదే అంశంతో శబరి సినిమాను తెరకెక్కించారు. తన కుమార్తెను కాపాడుకోవడం కోసం ఓ తల్లి సాగించిన పోరాటమే ఈ చిత్రం. జనరల్‌గా తల్లీకూతుళ్ల కథ అంటే సెంటిమెంట్‌ బేస్‌గా వస్తాయి. కానీ దర్శకుడు అనిల్ కాట్జ్ శ‌బ‌రి క‌థ‌ను సైకలాజికల్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కించాడు. ఇక ఇలాంటి సినిమాలకు ట్విస్ట్‌లే బలం. ఇక శబరి సినిమాలో.. ఆడియెన్స్‌ ఊహలకి అందని ట్విస్ట్‌లు రాసుకుని.. చివరి వరకు ప్రేక్షకులను ఎంగేజ్‌ చేయడంలో దర్శకుడు అనిల్‌ కాట్జ్‌ సక్సెస్‌ అయ్యాడనే చెప్పవచ్చు.

సినిమాను ఆసక్తికరంగా మార్చింది సూర్య క్యారెక్టర్‌. ఫస్టాఫ్‌ అంతా సంజన భర్త నుంచి విడిపోవడం, జాబ్‌ ప్రయత్నాలు, ఒంటరి మహిళగా పడ్డ కష్టాలు చూపిస్తే.. ఇంటర్వెల్‌లో ఊహించని ట్విస్ట్‌ ఇచ్చి.. సెకండాఫ్‌ మీద ఆసక్తిని పెంచారు. సూర్య నుంచి శబరి తన బిడ్డను ఎలా కాపాడుకుంది.. అసలు వీరద్దరి మధ్య రిలేషన్‌ ఏంటి అనే అంశాలు రివీల్‌ అవుతూ.. కథను ఆసక్తికరంగా మార్చాయి. అలానే ఇంటెన్స్‌ క్లైమాక్స్‌తో సినిమాను ముగించాడు.

నటీనటులు, టెక్నికల్‌ అంశాలు:

శబరి సినిమాకు వరలక్ష్మి శరత్‌ కుమార్‌ యాక్టింగే ఆయువు పట్టు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. సంజన పాత్రకు ఆమెను ఎంచుకోవడంతోనే దర్శకుడు సగం విజయం సాధించాడు. తన పాత్రకు వరలక్ష్మి శరత్‌ కుమార్‌ 100 శాతం న్యాయం చేశాడు. ఇక గణేష్‌ వెంటక్రామన్‌, మైమ్‌ గోపి, శశాంక్‌లకు మంచి పాత్రలు దక్కాయి.

గోపి సుందర్‌ మ్యూజిక్‌, బీజీఎం శబరి సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. గోపి సుందర్‌ తన మ్యూజిక్‌తో చిత్రంలో వచ్చే థ్రిల్‌ను బాగా ఎలివేట్‌ చేశాడు. విజువల్స్‌, ప్రొడక్షన్‌ వ్యాల్యూస్‌ బాగున్నాయి.

బలాలు:

  • వరలక్ష్మి శరత్‌ కుమార్‌ నటన
  • బలమైన ట్విస్ట్‌లు
  • సంగీతం, బీజీఎం

బలహీనతలు:

  • డ్రామా ఎక్కువవ్వడం
  • అస‌లు క‌థ‌లోకి ఎంట్రీ కావ‌డానికి టైమ్ ఎక్కువ తీసుకోవడం
  • కొన్ని చోట్ల లాజిక్‌ మిస్సవ్వడం

చివరగా: శబరి మంచి థ్రిలింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌ కలిగించే చిత్రం

Show comments