OTTలో రియలిస్టిక్ క్రైమ్ డ్రామా.. ఊహకి అందని ట్విస్టులు!

Anweshippin Kandethum Movie Review in Telugu: మలయాళ సినిమాలకు తెలుగులో కూడా విపరీతమైన క్రేజ్‌ ఉంటుంది. మరీ ముఖ్యంగా మాలీవుడ్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్స్‌కు ప్రత్యేకమైన అభిమానులుంటారు. అలాంటి వారి కోసం ఓ సినిమా ఓటీటీలో అందుబాటులో ఉంది. మరి ఆ సినిమా ఏది

Anweshippin Kandethum Movie Review in Telugu: మలయాళ సినిమాలకు తెలుగులో కూడా విపరీతమైన క్రేజ్‌ ఉంటుంది. మరీ ముఖ్యంగా మాలీవుడ్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్స్‌కు ప్రత్యేకమైన అభిమానులుంటారు. అలాంటి వారి కోసం ఓ సినిమా ఓటీటీలో అందుబాటులో ఉంది. మరి ఆ సినిమా ఏది

టోవినో థామస్‌.. తెలుగు ప్రేక్షకులందరికి తెలియకపోవచ్చు.. కానీ ఆయన నటించిన సినిమాల పేరు చెబితే.. చాలా మంది తెలుగు వారు గుర్తు పడతారు. కొన్ని రోజుల క్రితం విడుదలైన 2018 సినిమా గుర్తింది కదా. వందకోట్లకు పైగా వసూలు చేసిన ఈ మలయాళ హిట్‌ సినిమా తెలుగులో కూడా మంచి విజయం సాధించింది. ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటించాడు టోవినో థామస్‌. ఇక ఆయన హీరోగా నటించిన లేటెస్ట్‌ మలయాళ సినిమా అన్వేషిప్పన్‌ కండతుమ్‌. ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదలైన ఈ సినిమా నేడు అనగా మార్చి 8 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది. మరి ఈ చిత్రం ఎలా ఉందంటే..

కథేంటంటే..

ఆనంద్‌ నారాయణ్‌ (టోవినో థామస్‌) సబ్‌ ఇన్‌స్పెక్టర్‌గా పని చేస్తుంటాడు. అతడు పని చేసే స్టేషన్‌ పరిధిలో ఓ యువతి మిస్సింగ్‌ కేసు నమోదవుతుంది. ఆనంద్‌, అతడి టీం ఈ సమస్యను పరిష్కరిస్తుంది. అయినా వాళ్లు సస్పెండ్‌ అవుతారు.. దోషులుగా నిలబడతారు. ఆ తర్వాత కొన్నాళ్లకు ఈ టీమ్‌కు శ్రీదేవి అన్‌సాల్వ్‌డ్‌ కేసును అప్పగిస్తారు. మరి ఆనంద్‌ టీమ్‌ ఈ కేసును ఎలా పరిష్కరించింది.. ఆ సమయంలో వారికి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి అనేదే అన్వేషిప్పన్‌ కండతుమ్‌.

విశ్లేషణ..

ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరికి ఒక్క టికెట్‌ మీద రెండు సినిమాలు చూసిన అనుభూతి కలుగుతుంది. ఆనంద్‌ టీమ్‌ ముందు పరిష్కరించిన కేసు, ఆ తర్వాత శ్రీదేవి కేసును ఎలా పరిష్కరించారు అనేది తెర మీద చూపించారు. హీరో పోలీసు అంటే.. బీభత్సమైన యాక్షన్‌ సీన్స్‌ వంటివి ఊహిస్తాం. కానీ ఈ సినిమాలో అలాంటివి ఏం ఉండవు. నార్మల్‌ పోలీసులు ఎలా ఇన్వెస్టిగేషన్‌ చేస్తారో.. అదే దీనిలో చూపించారు. ప్రేక్షకుల ఊహకు అందని ట్విస్టులు సినిమాను నిలబెట్టాయి అని చెప్పవచ్చు. రెండు కేసులను సాల్వ్‌ చేసిన విధానం.. ఆఖర్లో దర్శకుడు రివీల్‌ చేసిన ట్విస్ట్‌ సినిమాకు హైలెట్‌.

ఎవరెలా చేశారంటే..

ఆనంద్‌ నారాయణన్‌ పాత్రలో టోవినో థామస్‌ నటన ఆకట్టుకుంటుంది. తన ఇమేజ్‌, హీరోయిజం ఏమాత్రం పాత్ర మీద పడకుండా.. నార్మల్‌ పోలీసులానే కనిపిస్తాడు తెర మీద. రాజ్ తరుణ్ ‘సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు’ హీరోయిన్ అర్తన బిను ఈ సినిమాలో శ్రీదేవి రోల్ చేశారు. అందంగా, అమాయకంగా కనిపిస్తూ… ఆ పాత్రకు న్యాయం చేసింది. అలానే సిద్ధిఖీ, ఇంద్రాస్, ఇతర నటీనటులు తమ పాత్రల పరిధి మేరకు నటించారు.

టెక్నికల్‌ అంశాలు..

టెక్నికల్‌ టీమ్‌ విషయానికి వస్తే.. సినిమాటోగ్రఫి, సంతోష్ నారాయణన్ నేపథ్య సంగీతం సినిమాను నిలబెట్టాయి.

బలాలు:

  • కథ
  • టోవినో థామస్‌
  • స్క్రీన్‌ ప్లే

బలహీనతలు..

  • సాగతీత

చివరి మాట: ఈ మధ్య కాలంలో వచ్చిన రియలిస్టిక్ క్రైమ్ డ్రామాల్లో అన్వేషిప్పన్‌ కండతుమ్‌ సూపర్‌ అని చెప్పవచ్చు.

Show comments