Somesekhar
హీరోగా ఓ గట్టి విజయం కోసం వేచి చూస్తున్నాడు యంగ్ హీరో రాజ్ తరుణ్. ఈ క్రమంలోనే 'తిరగబడర సామీ' మూవీతో తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఆ మూవీ ఎలా ఉంది? రాజ్ తరుణ్ ఖాతాలో హిట్ పడిందా? లేదా? ఈ రివ్యూలో చూద్దాం.
హీరోగా ఓ గట్టి విజయం కోసం వేచి చూస్తున్నాడు యంగ్ హీరో రాజ్ తరుణ్. ఈ క్రమంలోనే 'తిరగబడర సామీ' మూవీతో తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఆ మూవీ ఎలా ఉంది? రాజ్ తరుణ్ ఖాతాలో హిట్ పడిందా? లేదా? ఈ రివ్యూలో చూద్దాం.
Somesekhar
రాజ్ తరుణ్ కెరీర్ లో చాలానే ఎత్తుపల్లాలు ఉన్నాయి. కిందపడ్డ ప్రతిసారి పైకి లేవడం అతనికి అలవాటే. తన వ్యక్తిగత జీవితం గురించి పక్కన పెడితే.. హీరోగా ఓ సాలిడ్ సక్సెస్ కోసం చాలా ఏళ్లుగా ప్రయత్నిస్తూనే ఉన్నాడు.ఇందులో భాగంగానే తాజాగా ‘తిరగబడరాసామీ’ మూవీతో మరోసారి ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. లావణ్య గొడవ కారణంగా కావాల్సినంత ప్రమోషన్ పొందిన ఈ మూవీ ఎలా ఉందో ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం.
గిరి ( రాజ్ తరుణ్) చిన్నప్పుడు తల్లితండ్రుల నుండి తప్పిపోయి.. ఓ అనాథలా హైదరాబాద్ లోని ఓ కాలనీకి చేరుకుంటాడు. అక్కడి ప్రజలు గిరిని తమ సొంత బిడ్డలానే పెంచుతారు. ఇక గిరి పెద్దయ్యాక.. తనలా తప్పిపోయిన వారిని వెతికిపెట్టి, వారి సొంతవాళ్లతో కలిపే ఉద్యోగాన్ని తనకి తానుగా సృష్టించుకుంటాడు. ఈ క్రమంలోనే తనకంటూ ఓ సొంత కుటుంబం ఉండాలని, అందుకు పెళ్లి చేసుకోవాలని ఆశ పడతాడు. అయితే.. గిరి చేసే పనిలో సంపాదన ఉండదని అతనికి ఏ సంబంధం కుదరదు. సరిగ్గా.. ఇలాంటి సమయంలో మరో అనాథ అయిన శైలజ ( మాల్వి మల్హోత్ర) మ్యాచ్ వస్తుంది. ఇద్దరు తొలిచూపులోనే ఒకరిని ఒకరు ఇష్టపడి వెంటనే పెళ్లి చేసేసుకుంటారు. ఇలా సవ్యంగా సాగిపోతున్న వీరి జీవితంలోకి కొండారెడ్డి వస్తాడు. తన నుండి తప్పిపోయిన శైలజని వెతికి పెట్టమని కొండారెడ్డి ఏకంగా గిరికే కాంట్రాక్ట్ ఇస్తాడు. అనాథ అయిన శైలజకి కొండారెడ్డి మధ్య ఉన్న సంబంధం ఏమిటి? అతను ఎందుకు శైలజ కోసం వెతుకుతున్నాడు? ఈ మొత్తం క్రమంలో తన భార్య కోసం ఎలాంటి పోరాటం చేశాడు అన్నదే తిరగబడరాసామీ మూవీ.
కాలం మారే కొద్ది క్రియేటర్స్ కూడా మారాలి. ముఖ్యంగా సినిమా ఫీల్డ్ లో ఈ అప్డేట్ అవ్వడం అనేది అత్యంత ముఖ్యం. ఏ క్రాఫ్ట్ కూడా అలా అప్డేట్ అవ్వకుండా అందరూ కలిసి ఓ సినిమా చేస్తే.. ఆ సినిమా ఫలితం తిరగబడరాసామీలా ఉంటుంది అని చెప్పుకోవడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. దర్శకుడు ఏ.ఎస్.రవికుమార్ చౌదరి సినిమాల్లో గతంలో ఓ మ్యాజిక్ ఉండేది. ప్యూర్ ఎంటర్టైన్మెంట్ తో పాటు. రేసీ స్క్రీన్ ప్లే ఉండేది. కానీ.., తిరగబడరాసామీ మూవీలో ఇలాంటి పాజిటివ్ థింగ్ ఒక్కటి కనిపించలేదు. పైగా టాలీవుడ్ లో చూసిన కథలాగే ఈ మూవీ కనిపించింది. సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఏమైనా ఉన్నాయా? అంటే అదికూడా లేదు. బోరింగ్ స్క్రీన్ ప్లేతో డైరెక్టర్ ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టాడు. హీరో ఎంట్రీ, పరిచయం, హీరోయిన్ తో పెళ్లి ఇలా అన్నీ ప్రేక్షకుల ఊహకు తగ్గట్లుగానే స్టోరీ సాగుతూ ఉంటుంది. శైలజ ఎవరు అని తెలుసుకునే క్రమంలో ఇంటర్వెల్ పడుతుంది. ఇక సెకండాఫ్ లో అయినా స్టోరీలో వేగం పెరుగుతుంది అని భావించిన ప్రేక్షకుడికి నిరాశ తప్పలేదు. చాలా సినిమాల చూసిన ఫీలింగ్ కలుగుతుంది. క్లైమాక్స్ కూడా చెప్పుకోదగ్గదిగా లేకుండానే సినిమా ముగుస్తుంది.
రాజ్ తరుణ్ ఈ సినిమాలో పర్వాలేదనిపిస్తుంది. ఇలాంటి పాత్రలు చేయడం అతడికి కొత్త కాకపోయినప్పటికీ.. అతడి ఎనర్జీనీ సరిగ్గా ఉపయోగించుకోలేకపోయడనిపిస్తుంది డైరెక్టర్. ఇక హీరోయిన్ మాల్వీ మల్హోత్రా తన పరిధి మేరకు నటించింది. ఇక విలన్ గా మకరంద్ దేశ్ పాండే బాగానే నటించినా.. అక్కడక్కడ కామెడీగా ఉంటుంది. మన్నార చోప్రా పాత్ర గ్లామర్ వరకే పరిమితం అయ్యింది. ఇక టెక్నికల్ విషయానికి వస్తే.. భోలే షావళీ, జేబీల సంగీతం ఏ మాత్రం ఆకట్టుకోలేదు. నిర్మాణ విలువలు, సినిమాటోగ్రఫీ సోసోగా ఉన్నాయి. డైరెక్టర్ రవికుమార్ చౌదరి ఈ మూవీతో తీవ్రంగా నిరాశపరిచాడు.
చివరి మాట: ‘తిరగబడర సామీ ఫలితం నిజంగానే తిరగబడింది’
(గమనిక: ఈ రివ్యూ సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే)