విడుదలకు ముందే ఎన్నో సంచలనాలు, కోర్టు కేసులు అంటూ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన రజాకార్ సినిమా మార్చి 15న ప్రేక్షకులు ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది అంటే..
విడుదలకు ముందే ఎన్నో సంచలనాలు, కోర్టు కేసులు అంటూ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన రజాకార్ సినిమా మార్చి 15న ప్రేక్షకులు ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది అంటే..
Dharani
ఈమధ్య కాలంలో విడుదలైన కశ్మీర్ ఫైల్స్, ది కేరళ స్టోరీ వంటి చిత్రాలు ఎలాంటి సంచలనాలు సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమాలను తెరకెక్కించినట్లు మేకర్స్ చెప్పుకొచ్చిన కొన్ని వర్గాల వారు మాత్రం ఇవి కట్టుకథలు అన్నారు. ఇక ఈ కోవకు చెందిన సినిమానే రజాకార్. ట్రైలర్‌తోనే సంచలనాలు సృష్టించింది. ఇక నేడు ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది. మరి రజాకార్ సినిమా ఎలా ఉంది అంటే..
భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చినా.. హైదరాబాద్ రాజ్యం మాత్ర యథాతథ ఒప్పందం పేరుతో.. నిజాం పాలనలోనే కొనసాగింది. ఇందుకు గాను నెహ్రూ ప్రభుత్వంతో నిజాం నవాబు.. స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ చేసుకున్నాడు. ఆ తర్వాత నుంచి హైదరాబాద్ రాజ్యంలో అరాచక పాలన వెలుగు చూసింది. హైదరాబాద్‌ను మరో పాకిస్తాన్ చేసేందుకు కంకణం కట్టుకున్న ఖాసీం రజ్వీ.. పాకిస్తాన్‌తో చేతులు కలిపి రజాకార్ వ్యవస్థని ఏర్పాటు చేసి ప్రజలపైకి ఉసిగోల్పాడు. హిందూ, ముస్లీం అనే కోణంలో హిందూవులను ముస్లీంలుగా మారాలని హుకుం జారీ చేశాడు. బలవంతంగా మత మార్పిడీలు చేయించారు. ఈ క్రమంలో ఎలాంటి దారుణాలు చోటు చేసుకున్నాయి.. ఇక వీరి ప్రయత్నాలను చాకలి ఐలమ్మ, నారాయణరెడ్డి, రాజన్న వంటి నాయకులు ఎలా ఎదురొడ్డి నిలబడ్డారు.. నిజాం, ఖాసీం రజ్వీ, రజాకార్ల ఆగడాలు, అరాచకాల గురించి తెలుసుకున్న నాటి కేంద్ర మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్.. ఈ సమస్యను ఎలా పరిష్కరించారు అనేది కథ.
ఏడో నిజాం హయంలో ఖాసీం రజ్వీ సృష్టించిన రజాకార్ల ఆగడాలను నేపథ్యంగా చేసుకుని రూపొందించిన సినిమానే రజాకార్. హైదరాబాద్ సంస్థాన పరిధిలోని అనేక ప్రాంతాల్లో ఖాసీం రజ్వీ నాయకత్వంలో రజాకార్లు ఎన్నో దారుణాలకు తెగ బడ్డారు. మహిళలపై వారు చేసిన అఘాయిత్యాలు అన్నీ ఇన్నీ కావు. సామూహిక అత్యాచారాలు, దుస్తులు తొలగించి నగ్నంగా బతుకమ్మ ఆడిచండమే కాక ఊరేగింపులు వంటి అకృత్యాలకు పాల్పడ్డారు. ఇక మగవాళ్లు, పసిపిల్లలు, వృద్ధులు అనే తేడా లేకుండా అన్ని వయసుల ప్రజలను నానా హింసలకు గురి చేశారు. మొత్తానికి హైదరాబాద్ రాజ్యంలోని ప్రజలను తమ బానిసలుగా మార్చేశారు. ఈ సినిమాలో రజాకార్లు చేసిన దారుణాలను కళ్లకి కట్టి నట్టు చూపించారు. తెర మీద ఒక్కో ఘటన చూస్తుంటే రక్తం మరుగుతుంది.
ఈ సినిమాకు స్క్రీన్ ప్లే బలంగా రాసుకున్నారు. రజాకార్లకు వ్యతిరేకంగా నాడు జరిగిన తెలంగాణ సాయుధ పోరాటం చాలా సుదీర్ఘమైంది. అన్ని సంఘటలను ఒక్క సినిమాలో చెప్పాలంటే చాలా కష్టం. అందుకే కొన్ని ప్రధాన ఘటలను మాత్రమే ఈ సినిమాలో చూపించారు. ఇక యాక్షన్‌కి తగ్గ బీజీఎం, పాటలు సినిమాలకు కలిసి వచ్చాయి. వాస్తవ సంఘటనల ఆధారంగా సినిమా తెరకెక్కినా.. డ్రామా ఉండాలి. అది కాస్త మిస్సయ్యింది. అయితే సినిమాలో తెలంగాణ సాయుధ పోరాటం కోణంలోగానీ, కమ్యూనిస్టులు పోరాడిన కోణంలోగానీ చూపించలేదు. నిజాం నవాబ్‌తో కలిసి ఖాసీం రజ్వీ హైదరాబాద్‌ని ముస్లీం రాజ్యంగా మార్చే కుట్ర కోణంలో సినిమాని చూపించారు. దీనికి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎలాంటి పరిష్కారం చూపించారు అనేది తెరపై ఆసక్తికరంగా చూపించారు.
సినిమాలో భారీ తారాగణం ఉంది. ఇక ఈ చిత్రంలో ముఖ్యంగా ఖాసీం రజ్వీ పాత్ర హైలైట్ అయ్యింది. ఆ పాత్రలో రాజ్ అర్జున్ జీవించేశాడు. సినిమా మొత్తాన్ని తనవైపు తిప్పుకున్నాడు. ఇక నిజాం నవాబ్‌గా మకరంద్ పాండే ఎంతో సహజంగా కనిపించారు. ఆ పాత్రకు ఆయన బాగా సెట్ అయ్యారు. వీరితోపాటు ఐలమ్మగా ఇంద్రజ, పోచమ్మగా అనసూయ, రాజన్నగా బాబీ సింహా తమ పాత్రల్లో అదరగొట్టారు. అలానే వేదిక, ప్రేమలు సైతం తమ నటనతో జీవించేశారు. ఇక వల్లభాయ్ పటేల్‌గా తేజ్ సప్రు చాలా హుందాగా కనిపించారు. నిజంగానే తెర మీద సర్దార్ వల్లభాయ్ పటేల్‌ని చూసిన ఫీలింగ్ కలిగించారు. మిగిలిన పాత్రధారులు వారి పాత్రల్లో ఒదిగిపోయారు.
బడ్జెట్‌కు ఏమాత్రం భయపడకుండా.. చాలా రిచ్‌గా సినిమాను రూపొందించారు. ఈసినిమాకు ప్రాణం భీమ్స్ సిసిరోలియో అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్. సినిమాలో చాలా చోట్ల మ్యూజిక్‌తో రోమాలు నిక్కబొడిచేలా చేశారు. సినిమాటోగ్రఫి మరో స్పెషల్ ఎట్రాక్షన్. ఈ సినిమా దుస్తులు, స్టైలింగ్ దీన్ని మరింత క్వాలిటీగా మార్చాయి. ఎడిటింగ్, ఆర్ట్ విభాగాల పనితీరు చాలా బాగుంది. గూడూరు నారాయణ రెడ్డి అనుసరించిన నిర్మాణ విలువలు ఎంతో బాగున్నాయి.