Prasanna Vadanam Movie Review: ప్రసన్న వదనం సినిమా రివ్యూ! సుహాస్ మరోసారి మెప్పించాడా?

Prasanna Vadanam Movie Review: ప్రసన్న వదనం సినిమా రివ్యూ! సుహాస్ మరోసారి మెప్పించాడా?

ఫేస్ బ్లైండ్ నెస్ అనే థ్రిల్లింగ్ కాన్సెప్ట్ తో 'ప్రసన్న వదనం' అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు టాలెంటెడ్ యాక్టర్ సుహాస్. మరి ఈ మూవీ ఎలా ఉంది? సుహాస్ ఖాతాలో మరో హిట్ పడిందా? ఈ రివ్యూలో చూద్దాం.

ఫేస్ బ్లైండ్ నెస్ అనే థ్రిల్లింగ్ కాన్సెప్ట్ తో 'ప్రసన్న వదనం' అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు టాలెంటెడ్ యాక్టర్ సుహాస్. మరి ఈ మూవీ ఎలా ఉంది? సుహాస్ ఖాతాలో మరో హిట్ పడిందా? ఈ రివ్యూలో చూద్దాం.

ప్రసన్న వదనం

20240503,
థ్రిల్లర్
  • నటినటులు:సుహాస్, పాయల్ రాధాకృష్ణ, రాశీసింగ్, నందు, వైవాహర్ష తదితరులు
  • దర్శకత్వం:అర్జున్ వైకే
  • నిర్మాత:మణికంఠ జేఎస్, ప్రసాద్ రెడ్డి టీఆర్
  • సంగీతం:విజయ్ బుల్గానిన్
  • సినిమాటోగ్రఫీ:ఎస్. చంద్రశేఖరన్

2.75

టాలీవుడ్ లో ఎంతో మంది టాలెంటెడ్ నటీ, నటులు ఉన్నారు. వారిలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు యాక్టర్ సుహాస్. షార్ట్ ఫిల్మ్స్ నుంచి వచ్చి.. వెండితెరపై సోలో హీరోగా దూసుకెళ్తున్నాడు. కొన్ని రోజుల క్రితం అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండ్ తో మంచి సక్సెస్ సాధించిన సుహాస్.. తాజాగా మరో థ్రిల్లింగ్ కాన్సెప్ట్ తో ‘ప్రసన్న వదనం’ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఈ మూవీ ఎలా ఉంది? సుహాస్ ఖాతాలో మరో హిట్ పడిందా? ఈ రివ్యూలో చూద్దాం.

కథ:

సూర్య(సుహాస్) తనకు జరిగిన ఓ ప్రమాదంతో తల్లిదండ్రులతో పాటుగా మనుషుల మెుఖాలను గుర్తుపట్టే గుణాన్ని కోల్పోతాడు. దాంతో సొంత మనుషులకు కూడా గుర్తుపట్టలేకపోతాడు. అయితే  ఓ రోజు అమృత(సాయిశ్వేత) అనే అమ్మాయిని ఒకరు లారీ కిందకు తోసి చంపేస్తారు. ఈ దృశ్యాన్ని చూసిన సూర్య.. తర్వాత రోజు ఇది యాక్సిడెంట్ అని చదివి షాక్ అవుతాడు. ఎలాగైనా ఇది యాక్సిడెంట్ కాదని హత్య అని చెప్పాలని పోలీసు స్టేషన్ కు ఫోన్ చేసి చెప్తాడు. అసలు అమృత ఎవరు? ఆమెను ఎందుకు? ఎవరు? చంపారు?. ఈ మిస్టరీని ఫేస్ బ్లైండ్ నెస్ ఉన్న సూర్య ఎలా ఛేదించాడు అన్నదే మిగతా కథ.

విశ్లేషణ:

ఈ కథను ఎంచుకోవడంలోనే దర్శకుడు కొంత విజయాన్ని సాధించాడనే చెప్పాలి.  తెలుగులో చాలా కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలు వచ్చాయి. కానీ వాటిల్లో విభిన్నమైంది ఈ ప్రసన్న వదనం మూవీ. డైరెక్టర్ అర్జున్ కథలోకి వెళ్లడానికి ఎక్కువ సమయం తీసుకోలేదు. హీరోకి డిజార్డర్ ఉన్న సినిమాలు రావడం ఇదే మెుదటిసారి కాదు. కానీ ఇందులో సుహాస్ ను చూడటం కాస్త కొత్తగా అనిపిస్తుంది. ఫేస్ బ్లైండ్ నెస్ అనే కాన్సెప్ట్ ప్రేక్షకులకు కూడా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. కథ సాగుతున్నంత సేపు థ్రిల్లింగ్ గా అనిపిస్తుంది. సూర్యకి, అతడి స్నేహితులకి మధ్య సాగే సన్నివేశాలు, ఆద్య(పాయల్)తో ప్రేమలో పడటం లాంటి సీన్స్ తో తొలి భాగం సరదా సరదాగా సాగిపోతుంది.

ఇలాంటి టైమ్ లో అమృత హత్యను సూర్య చూడటంతో.. కథలో కీలక మలుపుతో ఇంటర్వెల్ ట్విస్ట్ ఇచ్చాడు దర్శకుడు. అప్పటి వరకు సాఫీగా సాగిపోతున్న కథలో వేగం పెరిగింది. ఇక సెకండాఫ్ కి వచ్చే సరికి సూర్య సమస్యల వలయంలో చిక్కుకోవడం, వాటిని ఎలా సాల్వ్ చేయాలి? ఈ హత్య ఎవరు చేశారు? అని తెలుసుకోవడానికి అతడు చేసే పోరాటు కథను రక్తి కట్టించాయి. అమృత హత్యకు సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ సెకండాఫ్ లో కీలకం. కాగా.. తనకున్న వ్యాధితో హీరో హత్య చేసింది ఎవరు? అని కనిపెట్టడం ఆసక్తికరంగా మారుతుంది. అయితే అక్కడక్కడ కాస్త స్లో నెరేషన్ ప్రేక్షకులకు కాస్త బోరింగ్ ఫీలింగ్ కనిపిస్తుంది. అయినప్పటికీ ప్రసన్న వదనం మూవీ చూస్తే.. ఓ కొత్త రకమైన థ్రిల్లర్ ను చూసిన ఫీలింగ్ కలుగుతుంది.

నటీ, నటుల పనితీరు:

ఇక ఎప్పటిలాగే  సుహాస్ తన నటనతో ఆకట్టుకున్నాడు. సూర్య పాత్రలో ఒదిగిపోయాడు. ఫేస్ బ్లైండ్ నెస్ ఉన్న పాత్రలో ఒకవైపు భావోద్వేగాలను పండిస్తూనే, కామెడీతో ఆకట్టుకున్నాడు. ఆద్య పాత్రలో పాయల్ తన పరిధి మేర నటించింది. ఇక పోలీస్ అధికారిక వైదేహీ పాత్రలో రాశిసింగ్ అందరికంటే ఎక్కువ మార్కులే కొట్టేసింది. మూవీకి ఆమె పాత్రే హైలెట్. వైవా హర్ష, నితిన్, సాయి శ్వేత, నందు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. ఇక సాంకేతిక వర్గం పనితీరుకు వస్తే.. విజయ్ బుల్గానిన్ నేపథ్య సంగీతం సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. కీలక సన్నివేశాల్లో అతడు సినిమాను తన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ తో మరోస్థాయికి తీసుకెళ్లాడు. చంద్రశేఖరన్ సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. కొన్ని కొన్ని సీన్స్ చూస్తే ప్రేక్షకులు థ్రిల్ అవుతారు. ఇక చివరిగా డైరెక్టర్ అర్జున్ దగ్గరి వస్తే.. సుకుమార్ శిష్యుడిగా తన మార్క్ ను చూపించాడు. తొలి మూవీకే డిఫరెంట్ కాన్సెప్ట్ తో అదరగొట్టాడు. అయితే అక్కడక్కడ కథలో ఎగ్జిక్యూషన్ ఫెయిల్ అయిందనే చెప్పాలి. కానీ రైటర్ గా, డైరెక్టర్ గా అర్జున్ అదరగొట్టాడు.

బలాలు

  • సుహాస్ నటన
  • కథలో ట్విస్టులు
  • సెకండాఫ్

బలహీనతలు

  • అక్కడక్కడ స్లో నెరేషన్
  • స్టార్టింగ్ సీన్స్

చివరి మాట: ‘ప్రసన్న వదనం’ ప్రేక్షకులను ప్రసన్నం చేసుకుంది.

(గమనిక): ఈ రివ్యూ సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయాం మాత్రమే.

Show comments