Merry Christmas Movie Review: మేరీ క్రిస్మస్‌ సినిమా రివ్యూ!

Merry Christmas Movie Review & Rating in Telugu: మేరీ క్రిస్మస్‌ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీకి మంచి రెస్పాన్స్‌ వస్తోంది. అసలు సినిమా ఎలా ఉందంటే..

Merry Christmas Movie Review & Rating in Telugu: మేరీ క్రిస్మస్‌ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీకి మంచి రెస్పాన్స్‌ వస్తోంది. అసలు సినిమా ఎలా ఉందంటే..

మేరీ క్రిస్మస్‌

20240112, సస్పెన్స్‌ థ్రిల్లర్‌, 2 h 40 m U/A
థియేటర్స్ లో
  • నటినటులు:విజయ్‌ సేతుపతి, కత్రినా కైఫ్‌, రాధికా ఆప్టే, రాధిక, సంజయ్‌ కపూర్‌, వినయ్‌ పాఠక్‌, అశ్వినీ కల్సేకర్‌ తదితరులు
  • దర్శకత్వం:శ్రీరామ్‌ రాఘవన్‌
  • నిర్మాత:రమేష్‌ తౌరాని, జయ తౌరానీ, సంజయ్‌ రౌత్రే, కెవల్‌ జార్జ్‌
  • సంగీతం:ప్రతీమ్‌ ( పాటల్‌) బ్యాక్‌ గ్రౌండ్‌ ( డేనియల్‌ బీ జార్జ్‌)
  • సినిమాటోగ్రఫీ:మధు నీలకందన్‌

Rating

2.75/5

సౌత్‌లో అన్ని భాషల ప్రేక్షకులకు బాగా దగ్గరి వాడు ‘విజయ్‌ సేతుపతి’. తమిళంలో సైడ్‌ క్యారెక్టర్‌లు చేసుకునే స్థాయి నుంచి నేడు స్టార్‌ హీరోగా ఎదిగారు. అద్భుతమైన నటనతో తనకంటూ హ్యూజ్‌ ఫ్యాన్‌ బేస్‌ను తెచ్చుకున్నారు. తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో ఆయన మంచి ఫ్యాన్‌ బేస్‌ ఉంది. కేవలం హీరో పాత్రలకే పరిమితం కాకుండా పాత్ర నచ్చితే విలన్‌గా కూడా చేస్తున్నారు. ‘ముంబై కర్‌’ అనే సినిమాతో బాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చారు. షారుఖ్‌ ఖాన్‌, షాహిద్‌ కపూర్‌లతో సినిమాలు చేశారు. ఆయన నటించిన తాజా చిత్రం ‘మేరీ క్రిస్మస్‌’ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీలో విజయ్‌ సేతుపతికి జంటగా కత్రినా కైఫ్‌ నటించింది. సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుందా? ఇంతకీ సినిమా ఎలా ఉంది?

కథ :

ఆల్‌బర్ట్‌ ( విజయ్‌ సేతుపతి) ఏడేళ్ల తర్వాత ఇంటికి తిరిగి వస్తాడు. అతడికి ఈ ఏడేళ్లలో ఇంటి దగ్గర ఏం జరిగిందో తెలీదు. ఇంటికి వచ్చిన తర్వాత అమ్మ చనిపోయిందని తెలుసుకుంటాడు. ఒంటరి వాడు అయిపోతాడు. అది ముంబై పేరు బొంబాయిగా ఉన్న రోజులు. ఒంటరి వాడైన వాడికి మారియా ( కత్రినా కైఫ్‌ ) పరిచయం అవుతుంది. మారియాకు పెళ్లై ఓ పాప కూడా ఉంటుంది. కొన్ని గంటల పరిచయంలోనే ఇద్దరూ చాలా క్లోజ్‌ అవుతారు. కొన్ని గంటల పాటు ఇద్దరూ చాలా ఎంజాయ్‌ చేస్తారు? ఆ తర్వాత అనుకోని విధంగా ఇద్దరూ ఓ మర్డర్‌ కేసులో ఇరుక్కుంటారు. ఆ కేసు వల్ల ఇద్దరి జీవితాలు ఎలా మారిపోయాయి? అన్నదే మిగిలిన కథ.

 విశ్లేషణ :

సస్పెన్స్‌ థ్రిల్లర్‌ సినిమాల కంటూ ఓ ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములా కొంచెం అటు ఇటు అయినా మూవీ బెడిసి కొడుతుంది. అందుకే కథ రాసుకునే విషయంలో.. ముఖ్యంగా స్క్రీన్‌ ప్లే రాసుకునే విషయంలో రైటర్‌లు ఆచితూచి వ్యవహరిస్తూ ఉంటారు. డైరెక్టర్లు కథ రాసుకునే సమయంలో అన్ని విషయాలను దృష్టిలో పెట్టుకునే ముందుకు వెళుతూ ఉంటారు. మేరీ క్రిస్మస్‌ విషయంలోనూ దర్శకుడు శ్రీరామ్‌ రాఘవ ఇదే పని చేశాడు. సస్పెన్స్‌ థ్రిల్లర్‌లు అతడికి కొత్తేమీ కాదు. గతంలో ‘అందాదూన్‌’ అనే సినిమా చేసి బ్లాక్‌ బాస్టర్‌ హిట్‌ కొట్టాడు.

ఈ మూవీ విషయంలోనూ పగడ్భందీగా వ్యవహరించాడు. సినిమాను ఎక్కడా బోరు కొట్టించకుండా తెరకెక్కించటంలో సూపర్‌ సక్సెస్‌ అయ్యాడు. మూవీలో అద్భుతమైన ట్విస్టులు, ములుపులు ఉన్నాయి. మూవీ మొదటి నుంచి వరకు సస్పెన్స్‌తో సాగుతుంది. క్లైమాక్స్‌కు వచ్చే సరికి కుర్చీ అంచులకు వచ్చి కూర్చునే పరిస్థితి వస్తుంది. సాధారణంగా చాలా సినిమాల కథలు ట్రైలర్‌ కట్‌తోటే తెలిపిపోతాయి. కానీ, మేరీ క్రిస్మస్‌ ట్రైలర్‌ కూడా ఏమీ అర్థం కాకుండా ఉంటుంది. నటీనటుల నుంచి ది బెస్ట్‌ అవుట్‌ పుట్‌ తీసుకున్నాడు. మొత్తానికి మేరీ క్రిస్మస్‌ ఓ కల్ట్‌ లాగా మిగిలిపోతుంది.

నటీనటుల నటన :

మేరీ క్రిస్మస్‌లో ఎవరి పాత్రకు తగ్గట్టు వారు అద్భుతంగా నటించారు. ముఖ్యంగా విజయ్‌ సేతుపతి యాక్టింగ్‌ యాజ్‌ యూజువల్‌ అద్భుతంగా ఉంది.  కత్రినా కైఫ్‌ నటన గురించి కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. చివరి 30 నిమిషాలు యాక్టింగ్‌తో అల్లాడించేశారు. ఇక, మిగిలిన కీలక పాత్రధారులైన రాధికా ఆప్టే, రాధిక వంటి వాళ్ల నటన కూడా బాగుంది. దర్శకుడు శ్రీరామ్‌ రాఘవ నటీనటుల నుంచి బెస్ట్‌ అవుట్‌ తెచ్చుకున్నారు.

టెక్నీకల్‌ విభాగం :

సస్పెన్స్‌ థ్రిల్లర్‌ సినిమాలకు బ్యాక్‌ గ్రౌండ్‌ మ్యూజిక్‌ ప్రాణం పోస్తూ ఉంటుంది. ఈ విషయంలో డేనియల్‌ బీ జార్జ్‌ పనిని ఒప్పుకోవచ్చు. మంచి బ్యాక్‌ గ్రౌండ్‌ ఇచ్చాడు. ట్యూన్లు మొత్తం 1980ల ప్రాంతాన్ని గుర్తు చేసేలా ఉంటాయి. క్లైమాక్స్‌లో వచ్చే బ్యాక్‌ గ్రౌండ్‌ మ్యూజిక్‌ సినిమాకే హైలెట్‌గా నిలుస్తుంది. తర్వాత సినిమాటోగ్రాఫర్‌ మధు నీలకందన్‌ మధు 1980 ప్రాంతాన్ని రీక్రియేట్‌ చేయటంలో సక్సెస్‌ అయ్యాడు. ప్రతీ సీను వింటేజ్‌ ఎఫెక్ట్‌ను అద్భుతంగా క్యారీ చేసింది. ఎడిటర్‌ అవసరమైన మేరకు తన కత్తెరకు పని చెప్పాడు.

ప్లస్‌లు :

  • కథ
  • స్క్రీన్‌ ప్లే
  • దర్శకత్వం
  • నటీనటుల నటన
  • బ్యాక్‌ గ్రౌండ్‌ మ్యూజిక్‌

మైనస్‌ :

  • కొన్ని పాటలు
  • కొన్ని ల్యాగింగ్‌ సీన్లు

చివరి మాట: మేరీ క్రిస్మస్‌ ఓ కల్ట్‌ క్లాసిక్‌!

రేటింగ్: 2.75/5

Show comments