nagidream
Masthu Shades Unnai Ra Movie Review & Rating in Telugu: చిన్న సినిమాలు.. పెద్ద విజయాన్ని దక్కించుకుంటున్న రోజులు ఇవి. ఈ నేపథ్యంలోనే ‘మస్త్ షేడ్స్ ఉన్నాయ్ రా’ మూవీ ఇప్పుడు ప్రేక్షకుల ముందుకి వచ్చింది. మరి.. సినిమా ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.
Masthu Shades Unnai Ra Movie Review & Rating in Telugu: చిన్న సినిమాలు.. పెద్ద విజయాన్ని దక్కించుకుంటున్న రోజులు ఇవి. ఈ నేపథ్యంలోనే ‘మస్త్ షేడ్స్ ఉన్నాయ్ రా’ మూవీ ఇప్పుడు ప్రేక్షకుల ముందుకి వచ్చింది. మరి.. సినిమా ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.
nagidream
“ఈ నగరానికి ఏమైంది” సినిమాతో మంచి పేరు దక్కించుకున్న నటుడు అభినవ్ గోమఠం. తాజాగా అభినవ్ హీరోగా తెరకెక్కిన చిత్రం “మస్త్ షేడ్స్ ఉన్నాయ్ రా”. తిరుపతి రావు దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ తాజాగా ప్రేక్షకుల ముందుకి వచ్చింది. మరి.. ‘మస్త్ షేడ్స్ ఉన్నాయ్ రా’ మూవీ ఎలా ఉందో ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం.
‘మస్త్ షేడ్స్ ఉన్నాయ్ రా’ కథ విషయానికి వస్తే.. మనోహర్ ( అభినవ్ గోమఠం) ఓ సాధారణ పెయింటర్. అతని ఫ్రెండ్ శివ. ఇక మనోహర్ లైఫ్ లో సెటిల్ కాలేదన్న కారణంతో.. పెళ్లిపీటలపై నుండి పెళ్లికూతురు లేచిపోతుంది. దీంతో.. మనోహర్ పెళ్లి ఆగిపోతుంది. ఆ కసితో మనోహర్ ఫోటోషాప్ నేర్చుకుని ఫ్లెక్స్ డిజైనింగ్ యూనిట్ సొంతగా పెట్టుకోవాలని డిసైడ్ అవుతాడు. ఈ ప్రయాణంలో అతనికి ఉమాదేవి ( వైశాలి రాజ్) పరిచయం అవుతుంది. అసలు ఫొటో షాప్ కూడా రాని, చేతిలో ఒక్క రూపాయి కూడా లేని మనోహర్ ఈ ప్రయాణంలో ఎలా విజయం సాధించాడు. అతనికి రాహుల్ (అలీ రెజా) ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? వాటిని మనోహర్ ఎలా దాటగలిగాడు అన్నదే ఈ చిత్ర కథ.
ఓ చిన్న పాయింట్.. దాని చుట్టూ ఓ బలమైన ఎమోషన్. మంచి నటీనటులు, అద్భుతమైన టెక్నీకల్ టీమ్.. ఈరోజుల్లో ఓ చిన్న సినిమా విజయం సాధించడానికి ఇవి ఉంటే చాలు. ఇప్పుడు ట్రెండ్ కూడా ఇదే. ఈ ధైర్యంతోనే తెరకెక్కించిన చిత్రం ‘మస్త్ షేడ్స్ ఉన్నాయ్ రా’. అయితే.. ఈ ప్రయత్నంలో చిత్ర యూనిట్ కొంతమేర మాత్రమే సక్సెస్ అయ్యింది. ముఖ్యంగా ప్రొడక్షన్ వ్యాల్యూస్ తీసికట్టుగా ఉండటం ఈ సినిమాకి అతి పెద్ద మైనస్. కాకుంటే.. కథ పరంగా బెస్ట్ హోమ్ వర్క్ జరగడం ‘మస్త్ షేడ్స్ ఉన్నాయ్ రా’ మూవీకి పెద్ద ప్లస్ అయ్యింది.
‘మస్త్ షేడ్స్ ఉన్నాయ్ రా’ మొదటి భాగం చాలా భారంగానే మొదలవుతుంది. అసలు అవసరమే లేని చాలా ఫిల్లింగ్ షాట్స్ పడుతూ చిరాకు తెప్పిస్తాయి. వీటికి తోడు చాలా బలహీనమైన కెమెరా వర్క్ ఓ షార్ట్ ఫిలిం చూస్తున్నామా అనే ఫీలింగ్ కలిగిస్తోంది. కాకుంటే.. మరోవైపు కథ ఎక్కడా పట్టు తప్పకుండా మెయిన్ ట్రాక్ పైనే నడుస్తూ ఉండటం కాస్త ఉపశమనం కలిగిస్తూ ఉంటుంది. కానీ.., కథలో మెయిన్ పాయింట్ వద్దకి వెళ్ళడానికి దర్శకుడు చాలా సమయం తీసుకోవడం ఇబ్బంది పెడుతుంది. అయితే.., ఓ మంచి ట్విస్ట్ తో ఇంటర్వెల్ బ్లాక్ రావడంతో నెక్స్ట్ ఏంటి అన్న ఇంట్రెస్టింగ్ ఆడియన్స్ లో క్రియేట్ అవుతుంది.
సెకండ్ ఆఫ్ దగ్గరికి వచ్చే సరికి ‘మస్త్ షేడ్స్ ఉన్నాయ్ రా’ లో అనుకోని మ్యాజిక్ జరిగింది. కథలోని మెయిన్ సీక్వెన్స్ లు అన్నిటిని దర్శకుడు హ్యాండిల్ చేసిన విధానం బాగుంది. కథ ఒక న్యాచురల్ ఫ్లోలో వెళ్ళిపోతూ ఉండటంతో అందులో నుండే మంచి ఫన్ కూడా జనరేట్ అయ్యింది. అనూహ్యంగా సెకండ్ ఆఫ్ లో టెక్నీకల్ వర్క్ కూడా చాలా మెరుగు అవ్వడం ఈ చిత్రానికి కలిసి వచ్చింది. ఇక ప్రీ క్లయిమ్యాక్స్ నుండి క్లయిమ్యాక్స్ వరకు కాస్త ఇంట్రెస్టింగా సాగడంతో ‘మస్త్ షేడ్స్ ఉన్నాయ్ రా’ కొంతమేర గట్టెక్కేసింది. ఉన్న అతి తక్కువ వనరులను ఉపయీగించుకుంటూ ఈ మాత్రం మూవీ తీశారంటే మంచి విషయమే అని చెప్పుకోవాలి.
అభినవ్ గోమఠం ఓ టిపికల్ డైలాగ్ డెలివరీ ఉన్న బెస్ట్ యాక్టర్. ఇలాంటి నటుడు హీరోగా చేస్తే ఎక్కువ స్క్రీన్ స్పేస్ దొరుకుద్ది. అప్పుడు ఆటోమేటిక్ గా ఆడియన్స్ ఆ పాత్రకి కనెక్ట్ అయిపోతారు. ‘మస్త్ షేడ్స్ ఉన్నాయ్ రా’లో ఈ మ్యాజికే జరిగింది. అభినవ్ న్యాచురల్ పర్ఫార్మెన్స్ తో అదరగొట్టేశాడు. ఇక హీరోయిన్ వైశాలి రాజ్ పర్వాలేదు అనిపించుకుంది. ఇక అలీ రెజా ఆకట్టుకున్నాడు. మిగతా నటీనటులు జస్ట్ ఓకే. టెక్నీకల్, అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ పరంగా మాత్రం ‘మస్త్ షేడ్స్ ఉన్నాయ్ రా’ ఓ బ్యాడ్ మూవీ. ఇక్కడ బడ్జెట్ మెయిన్ పాయింట్ కాబట్టి.. మిగతా క్రాఫ్ట్స్ వర్క్ గురించి ప్రత్యేకంగా వేలెత్తి చూపించడంలో అర్ధం ఉండదు. తిరుపతి రావు కథనంలో కాస్త తడబడ్డా.. మేకర్ గా మాత్రం మంచి మార్కులు దక్కించుకున్నాడు.