Eagle Movie Review & Rating in Telugu: ఈగల్ సినిమా రిజల్ట్ రవితేజకి చాలా కీలకం. టీమ్.. ఈ మూవీ అవుట్ పుట్ పై ఫుల్ హ్యాపీ. మరి.. ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉంది. ఇప్పుడు తెలుసుకుందాం.
Eagle Movie Review & Rating in Telugu: ఈగల్ సినిమా రిజల్ట్ రవితేజకి చాలా కీలకం. టీమ్.. ఈ మూవీ అవుట్ పుట్ పై ఫుల్ హ్యాపీ. మరి.. ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉంది. ఇప్పుడు తెలుసుకుందాం.
Raj Mohan Reddy
మాస్ మహారాజా రవితేజ కెరీర్ కి ఎంతో ముఖ్యమైన చిత్రం ఈగల్. వరుస పరాజయాలతో ఉన్న రవితేజ ఈ మూవీతో సక్సెస్ ట్రాక్ ఎక్కాలని గట్టిగా భావించాడు. మరి.. ఇన్ని అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఈగల్ మూవీ ఎలా ఉందో ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం.
సహదేవ వర్మ ( రవితేజ), జై ( నవదీప్) మదనపల్లిలో ఓ కాటన్ ఫ్యాక్టరీని నడిపిస్తూ ఉంటారు. అక్కడి కాటన్ ని విదేశాలకు తరలించి ఆ తండా ప్రజలకి మంచి లాభాలు వచ్చేలా చేస్తుంటాడు. మరోవైపు దేశంలో జరిగే అక్రమ ఆయధాల సరఫరాని ఈగల్ ముఠా అడ్డుకుంటూ, ఆ ఆయుధాలను సొంతం చేసుకుంటూ ఉంటుంది. అలా మిస్ అయిన ఆయుధాలన్నీ సహదేవ వర్మ ఫ్యాక్టరీకి చేరుకుంటూ ఉంటాయి. అసలు సహదేవ వర్మకి ఈ ఆయుధాలకి ఉన్న లింక్ ఏంటి? అసలు సహదేవ్ వర్మ.. ఈగల్ మధ్య లింక్ ఏంటి? 12 దేశాలు వెతుకుతున్న ఈగల్ కి, ఈ కాటన్ ఫ్యాక్టరీతో సంబంధం ఏమిటి? ఈ మొత్తం కథని ప్రజలకి తెలియజేయాలి అనుకున్న నళిని (అనుపమ పరమేశ్వరన్) ఎవరు? ఇలాంటి అన్నీ ప్రశ్నలకి సమాధానమే ఈగల్ కథ.
ఆర్ట్ ఫీల్డ్ లో బ్యారియర్స్ ని బ్రేక్ చేయడం అనేది ఎప్పుడూ గొప్ప విషయమే. అల్లాంటప్పుడు వచ్చే రిజల్ట్ కి రీ సౌండ్ ఎక్కువగా ఉంటుంది. కాకుంటే.. ప్లానింగ్ అంత గట్టిగా ఉన్నప్పుడు..అంతే స్థాయిలో హోమ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. ఈగల్ ఇక్కడే ట్రాక్ తప్పేసింది. నిజానికి ఈ మూవీ ఓ సాధారణ రివేంజ్ బేస్డ్ యాక్షన్ డ్రామా. దీనికి దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని హాలీవుడ్ లెవల్ టచ్ ఇస్తూ తెరకెక్కించాలి అనుకున్నాడు. మేకర్ గా ఈ విషయంలో కొంత వరకు సక్సెస్ అయ్యాడు కూడా. కానీ.., స్క్రీన్ ప్లేలో మాత్రం పూర్తిగా తడబడిపోయాడు. దీంతో.. అద్భుతమైన మేకింగ్ తో తెరకెక్కిన ఈగల్ మూవీకి సరైన జస్టిఫికేషన్ లేకుండా పోయింది.
ఈగల్ మొదలైన మొదటి క్షణం నుండే బిల్డప్ షాట్స్ తో ఆడియన్స్ ని ఎంగేజ్ చేసేలా అనిపిస్తుంది. హీరో క్యారెక్టర్ కి ఇస్తున్న ఆ ఎలివేషన్ కి, అద్భుతమైన విజువల్స్ యాడ్ అవ్వడంతో మొదటి 10 నిమిషాల్లో సినిమాపై మంచి ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. అయితే.., ఇక్కడ నుండి కథ ముందుకి కదలదు. తెరపై కనిపించే ప్రతి పాత్ర హీరోకి బిల్డప్ ఇస్తూనే ఉంటాయి తప్ప.. ఎక్కడా కథని ముందుకి సాగనివ్వదు. ఇక్కడ ట్రాక్ తప్పిన ఈగల్.. రవితేజ ఎంట్రీ తరువాత కూడా మెయిన్ ట్రాక్ లోకి రాదు. ఇక ప్రీ ఇంటర్వెల్ టైమ్ కి కథలో కీ పాయింట్ రివీల్ చేసినా.. అప్పటికే ఆడియన్స్ సినిమాతో డిస్ కనెక్ట్ అయిపోయారు. కాకుంటే.. మంచి విజువల్స్ మాత్రం కాస్త ఉపశమనం కలిగిస్తాయి.
ఈగల్ సెకండ్ ఆఫ్ కూడా రొటీన్ టర్న్ తీసుకోవడంతో రవితేజ కెరీర్ లో మరో డిజాస్టర్ దిశగా ఈ సినిమా సాగుతుందా అన్న అనుమానం కలగకమానదు. అయితే.., హీరోయిన్ ఎంట్రీ తర్వాత కథలో ఎమోషన్ క్యారీ అవుతుంది. అలా అని వీరి లవ్ ట్రాక్ అంత అద్భుతంగా ఏమి ఉండదు. హీరో జర్నీకి ఉన్న పర్పస్ అప్పటికి గాని ఆడియన్ కి అర్ధం కాదు అనమాట. ఇక ఇక్కడ నుండి ఈ మూవీ టీమ్ అంతా అద్భుతం చేసింది. అప్పటివరకు నిద్రపోయినట్టు అనిపించే బ్యాగ్రౌండ్ స్కోర్ లో మెరుపులు కనిపిస్తాయి. కథలో వేగం అందుకుంటుంది. విజిల్స్ వేపించేలా హీరో మెసేజ్ ఉంటుంది. కథలో ఇన్ని లేయర్స్ పెట్టుకుని దర్శకుడు ఎందుకు ఇంత ఆలస్యం చేశాడు అన్న కోపం కూడా వస్తుంది. కానీ.., అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోవడంతో ఈగల్ ఓ సాధారణ యాక్షన్ మూవీగా మిగిలిపోయింది.
రవితేజకి ఇలాంటి పాత్రలు కొట్టిన పిండి. ఆయన బాగా చేశాడు అని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. లుక్ పరంగా ఇంకాస్త జాగ్రత్తలు తీసుకుని ఉంటే బాగుండేది. ఇక నవదీప్ చాలా చోట్ల మెరుపులు మెరిపించాడు. అనుపమకి కావాల్సినంత స్కీన్ టైమ్ దొరికినా.., కథతో తన పాత్రకి సంబంధం లేకపోవడంతో తేలిపోయింది. కావ్య థాపర్ అందంతో ఆకట్టుకుంది. శ్రీనివాస్ రెడ్డి, అజయ్ ఘోష్ కామెడీ కాస్త రిలీఫ్. మిగిలిన వారంతా పర్వాలేదు అనిపించారు.
టెక్నీకల్ గా ఈగల్ మూవీ గుడ్ ప్రాజెక్ట్. కార్తీక్ ఘట్టమనేని స్వతహాగా సినిమాటోగ్రఫర్ గనుక అదరగొట్టేశాడు. ఇక దావ్జాండ్ మ్యూజిక్ జస్ట్ ఓకే అనిపించినా.., బిజీఎమ్ విషయంలో మాత్రం మెరుపులు మెరిపించాడు. కాకుండా.. ఇది కూడా అక్కడక్కడ మాత్రమే. ఎడిటింగ్ మాత్రం టోటల్లీ డిజాస్టర్. ఇందులో కూడా కార్తీక్ ఘట్టమనేనిది మెయిన్ హ్యాండ్ కాబట్టి.. ఇది కూడా అతని ఫెయిల్యూర్ అవుద్ది. ప్రొడక్షన్ వ్యాల్యూస్ టాప్ రేంజ్ లో ఉన్నాయి. కథా, కథనంలో విఫలం అయిన కార్తీక్ ఘట్టమనేని మేకర్ గా మాత్రం అదరగొట్టాడు. కానీ.., వీక్ నేరేషన్ కారణంగా ఆ కష్టానికి ఫలితం లేకుండా పోయింది.
రేటింగ్: 2.5/5
చివరి మాట: ఈగల్.. అవసరానికి మించి ఎగిరి చతికిలపడింది.