Venkateswarlu
Dunki Movie Review & Rating in Telugu: దాదాపు 4 ఏళ్ల గ్యాప్ తర్వాత రాజ్ కుమార్ హిరానీ ‘డంకీ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. బాలీవుడ్ బాద్ షాతో మొదటి సారి మూవీ చేశారు. కొత్త కథను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.
Dunki Movie Review & Rating in Telugu: దాదాపు 4 ఏళ్ల గ్యాప్ తర్వాత రాజ్ కుమార్ హిరానీ ‘డంకీ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. బాలీవుడ్ బాద్ షాతో మొదటి సారి మూవీ చేశారు. కొత్త కథను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.
Venkateswarlu
బాలీవుడ్‌లోనే కాదు.. దేశ వ్యాప్తంగా బాలీవుడ్ దిగ్గజ దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ సినిమాలకు మంచి డిమాండ్ ఉంది. తీసింది తక్కువ సినిమాలే అయినా.. మంచి కథల్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తూ ఉన్నారు. బ్లాక్ బాస్టర్ హిట్లను సొంతం చేసుకుంటూ ఉన్నారు. రాజ్ కుమార్ హిరానీ తీసిన కొన్ని మూవీలు కల్ట్‌గా మిగిలిపోయాయి. ఆయన 2018లో ‘సంజు’ అనే బయోపిక్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇది బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కింది. రాజ్ కుమార్ హిరానీ ఈ సినిమా తర్వాత దాదాపు 4 ఏళ్లు గ్యాప్ తీసుకుని ‘డంకీ’తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ మూవీ కోసం మొదటిసారి షారుఖ్ ఖాన్‌తో కలిసి పని చేశారు. షారుఖ్‌ను కొత్త పాత్రలో చూపించే ప్రయత్నం చేశారు. మరి, రాజ్ కుమార్ హిరానీ, షారుఖ్ ఖాన్‌ల ద్వయ తొలి ప్రయత్నం ప్రేక్షకులను మెప్పించిందా? డంకీ బాక్సాఫీస్ దగ్గర విజయ ఢంఖా మోగించిందా? లేదా? ఇంతకీ సినిమా ఎలా ఉంది?..
లాల్టూ అనే ప్రాంతంలో 1995లలో కథ మొదలవుతుంది. ఆ ప్రాంతానికి చెందిన ఓ ఐదుగురు వ్యక్తులు.. హర్‌దయాల్ సింగ్ దిల్హాన్(షారుఖ్ ఖాన్), మను (తాప్సీ పన్ను), సుఖీ (విక్కీ కౌశల్) బల్లి(అనిల్ గ్రోవర్), బగ్గు ( విక్రమ్ కొచ్చర్) లండన్ వెళ్లాలని అనుకుంటూ ఉంటారు. ఈ ఆశయమే వీరిని ఒక్కటిగా చేస్తుంది. లండన్ వెళ్లాలంటే ఇంగ్లీష్ తప్పని సరి అని తెలుస్తుంది. నేర్చుకోవటానికి వెళతారు. అయినప్పటికి సరిగా నేర్చుకోలేకపోతారు. లండన్‌కు అధికారికంగా వెళ్లలేకపోతారు. దీంతో ఓ కఠిన నిర్ణయానికి వస్తారు. అక్రమంగా లండన్ వెళ్లటానికి ప్రయత్నిస్తారు. ఈ ప్రయత్నంలో వారికి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి. లండన్‌కు వెళ్లారా? లేదా? ఆ తర్వాత ఏం జరిగింది అన్నదే మిగితా కథ.
రాజ్ కుమార్ హిరానీ సినిమాలకు దాదాపు దశాబ్ధకాలం పైనుంచి కూడా మంచి క్రేజ్ ఉంది. ముఖ్యంగా ఆయన చెప్పే కథలు సమాజంలోంచి వచ్చి.. ప్రతీ మనిషిని ఆలోచింపజేసే విధంగా ఉంటాయి. నాటి మున్నాభాయ్ ఎంబీబీఎస్ నుంచి ఇప్పటి డంకీ వరకు అదే కోవలో ఆయన సినిమాలు చేస్తున్నారు. అయితే, డంకీకి మిగిలిన సినిమాలకు చాలా వ్యత్యాసం ఉంటుంది. కథ విషయంలో కథనం విషయంలో.. సమాజానికి రాజ్ కుమార్ హిరానీ ఇచ్చే మెసేజ్ విషయంలో.. ఇలా అన్నిటా చాలా వ్యత్యాసం ఉంటుంది. ఇందులో యాక్షన్ సీన్లు కూడా ఉండటం విశేషం. డంకీ అన్ని ఎమోషన్స్‌ను బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతుంది. ముఖ్యంగా పేరు కోసమో.. డబ్బు సంపాదన కోసమో.. విదేశాలకు వెళ్లాలనుకునే వారికి.. అది కూడా అడ్డదారిన ఇతర దేశాలకు వెళ్లాలనుకునే వారికి ఓ కను విప్పుగా మారుతుంది. ఫస్ట్ హాఫ్‌ను మించి సెకండ్ హాఫ్ ఉంటుంది. రాజ్ కుమార్ హిరానీ డంకీని ఎలా తీశాడని విశ్లేషించటం ఆయన్ని తక్కువ చేయటమే అవుతుంది.
రాజ్ కుమార్ హిరానీ సినిమాల్లో నటనకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఆయన నటీనటుల నుంచి వంద శాతం తనకు కావాల్సిన దాన్ని తీసుకుంటూ ఉంటారు. ఇక, ఈ సినిమాలో ప్రధాన పాత్రధారులైన షారుఖ్ ఖాన్, తాప్సీ పన్ను, విక్కీ కౌశల్, అనిల్ గ్రోవర్, విక్రమ్ కొచ్చర్‌లు నటించారు అనటం కంటే జీవించారు అనటం బాగుంటుంది. నటనలో ముందెన్నడూ చూడని కొత్త షారుఖ్‌ను మనం చూస్తాం. షారుఖ్ నవ్విస్తారు.. ఏడ్పిస్తారు.. ఆలోచింపజేస్తారు. మొత్తానికి షారుఖ్ వన్‌మ్యాన్ ఆర్మీ షో చేశారు. తాప్సీ కూడా యాక్టింగ్‌ను చింపేసింది. మిగిలిన పాత్రధారులు కూడా తమ పరిధికి తగ్గట్టు అద్భుతంగా నటించారు.
రాజ్ కుమార్ హిరానీ సినిమాలంటే ముందుగా మనకు సంగీతమే మైండ్‌లోకి వస్తుంది. పాత సినిమాల్లోలానే డంకీలోని మ్యూజిక్ అద్భుతంగా ఉంది. డంకీ కోసం ఇద్దరు సంగీత దర్శకులు పని చేశారు. ప్రీతమ్ పాటకు సంగీతం అందించగా.. అమన్ పంత్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించారు. పాటలు సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇక, సినిమా అమన్ పంత్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలెట్‌గా నిలుస్తుంది. సినిమాటోగ్రఫీ అందించిన సీకే మురళీ ధరన్, మనుష్ నందన్, అమిత్ రాయ్, కుమార్ పంకజ్‌ల పని తనం ప్రతీ ఫ్రేములోనూ కనిపిస్తుంది. అద్భుతమైన సీన్లు.. ఆ అద్భుతమైన సీన్లకు తగ్గట్టుగా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్.. మొత్తానికి సినిమా రియల్ లైఫ్‌లా కళ్ల ముందు కదలాడుతుంది.
రేటింగ్: 2.75/5