Double Ismart Movie Review And Rating In Telugu: డబుల్ ఇస్మార్ట్ సినిమా రివ్యూ

Double Ismart Review: డబుల్ ఇస్మార్ట్ సినిమా రివ్యూ అండ్ రేటింగ్!

Double Ismart Movie Review And Rating In Telugu: రామ్- పూరీ కాంబోలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ కి సీక్వెల్ గా డబుల్ ఇస్మార్ట్ ని తీసుకొచ్చారు. మరి.. ఈ డబుల్ ఇస్మార్ట్ సినిమా ప్రేక్షకులను ఎంత వరకు మెప్పించిందో చూద్దాం.

Double Ismart Movie Review And Rating In Telugu: రామ్- పూరీ కాంబోలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ కి సీక్వెల్ గా డబుల్ ఇస్మార్ట్ ని తీసుకొచ్చారు. మరి.. ఈ డబుల్ ఇస్మార్ట్ సినిమా ప్రేక్షకులను ఎంత వరకు మెప్పించిందో చూద్దాం.

డబుల్ ఇస్మార్ట్

15/08/2024, యాక్షన్ డ్రామా, 2h 42m A
A
  • నటినటులు:రామ్ పోతినేని, సంజయ్ దత్, కావ్య థాపర్ తదితరులు
  • దర్శకత్వం:పూరి జగన్నాథ్
  • నిర్మాత:పూరి జగన్నాథ్, చార్మీ కౌర్
  • సంగీతం:మణిశర్మ
  • సినిమాటోగ్రఫీ:శ్యామ్ కే నాయుడు,

Rating

2.25

2019లో రామ్ హీరోగా పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో ప్రేక్షకుల ముందుకి వచ్చిన మాస్ ఎంటర్టైనర్ ఇస్మార్ట్ శంకర్. ఆ మూవీ సూపర్ సక్సెస్ తో పూరీ కమ్ బుక్ ఇచ్చినట్టు అయ్యింది. ఇప్పుడు ఇన్నేళ్ల తరువాత.. ఆ మూవీకి సీక్వెల్ గా డబుల్ ఇస్మార్ట్ తో ప్రేక్షకుల ముందుకి వచ్చారు ఈ పూరీ, రామ్. ప్రమోషనల్ కంటెంట్ ఎలాంటి స్పెషల్ ఇంప్యాక్ట్ క్రియేట్ చేయకపోయినా.. ఇస్మార్ట్ శంకర్ క్యారెక్టరైజేషన్ కి ఉన్న మాస్ ఇమేజ్ కారణంగా.. ప్రీ రిలీజ్ మార్కెట్ బాగానే జరిగింది. మరి.. కంటెంట్ పరంగా డబల్ ఇస్మార్ట్ ఆ రేంజ్ లో ఉందో, లేదో ఈ రివ్యూలో తెలుసుకుందాం.

కథ:

ఇస్మార్ట్ శంకర్ (రామ్ పోతినేని) హైదరాబాద్ లోని ఓ క్లబ్ ని టార్గెట్ చేసుకొని, దాని డబ్బు అంతా కొల్లగొడుతూ ఉంటాడు. నార్త్ ఇండియా నుండి వచ్చిన జన్నత్ అతనికి పరిచయం అవుతుంది. చూడగానే ఆమెతో ప్రేమలో పడిపోతాడు శంకర్. మరోవైపు బిగ్ బుల్ ( సంజయ్ దత్) దేశంలో అన్నీ అసాంఘిక కార్యకలాపాలు చేస్తూ, సీబీఐ మోస్ట్ వాంటెడ్ లిస్ట్ లో చేరుతాడు. అయితే.. బిగ్ బుల్ కి అనుకోకుండా వచ్చిన ఓ కష్టం కారణంగా ఇస్మార్ట్ శంకర్ తో పని పడుతుంది. శంకర్ దొరికితేనే బిగ్ బుల్ బతికే స్థితి రావడంతో.. కథ హైదరాబాద్ షిఫ్ట్ అవుతుంది. అసలు బిగ్ బుల్ కి వచ్చిన కష్టం ఏమిటి? దానికి కారణం ఎవరు? బిగ్ బుల్ కి ఇస్మార్ట్ శంకర్ తో పని ఏమిటి? శంకర్ అసలు ఇక్కడ దొంగతనాలు ఎవరిని టార్గెట్ చేసి చేస్తున్నాడు? ఇలాంటి అన్నీ ప్రశ్నలకి సమాధానమే డబల్ ఇస్మార్ట్ మూవీ కథ.

విశ్లేషణ:

పూరీ జగన్నాథ్ కెరీర్ లో చాలా హిట్స్ ఉన్నాయి. అవన్నీ కేవలం హీరో క్యారెక్టరైజేషన్ వల్లో, పూరీ డైలాగ్స్ వల్లో రాలేదు. మంచి కథకి.. మిగతా ఎలిమెంట్స్ యాడ్ అవ్వడం వల్ల వచ్చాయి. సినిమా బాగుండాలంటే.. కథ బాగుండాలి, లేదా.. కథ కనీసం ఉండాలి అనే బేసిక్ థాట్ పూరీ మర్చిపోయాడా? “డబల్ ఇస్మార్ట్ ” మూవీ చూశాక సగటు ఆడియన్ కి ఈ అనుమానం రాక మానదు. ఆల్రెడీ జనాలు యాక్సెప్ట్ చేసిన ఓ మాస్ క్యారెక్టరైజేషన్ ని పెట్టుకుని కూడా.., ఓ తల, తోక ఉండే కథని రాసుకోవడం పూరీ జగన్నాథ్ పూర్తిగా విఫలం అయ్యాడు. ఇక కథ, కథనం సరిగ్గా లేని సినిమా కోసం రామ్ ఎంత కష్టపడ్డా.. అదంతా వృథా అయిపోయింది.

మాస్ సినిమాలో లాజిక్స్ వెతకడం, సగటు ఆడియన్ కూడా అవన్నీ పెద్దగా పట్టించుకోడు. కానీ.., పూరీ సినిమాని హ్యాండిల్ చేసిన విధానం చూస్తే మాత్రం.. 2024లో కూడా ఇంత ఇల్లాజికల్ థింకింగ్ తో సినిమా తీస్తారా అన్న అనుమానం, కోపం రాక మానదు. సినిమా అంతటా ఎక్కడా కంటిన్యూటీ ఉండదు. హీరోని కత్తితో పొడిచినా.. ఒంటిపై ఆ గాయం, ఘాటు కనిపించదు. చుట్టూ 30 మంది తుపాకులు పట్టుకుని నిల్చొని ఉన్నా, హీరో కత్తితో అందరిని పొడిచేస్తూ ఉంటాడు. ఇలా చెప్పుకుంటూ పోతే.. డబల్ ఇస్మార్ట్ లో వీక్ వర్క్ చాంతాడంత ఉంది.

మదర్ సెంటిమెంట్ ట్రాక్ తో సినిమా మొదలవడం, హీరో క్యారెక్టర్ కి ముందు నుండి ఓ మోటివ్ ఉండటంతో డబల్ ఇస్మార్ట్ పై మొదటి 15 నిమిషాలకే ఆశలు చిగురిస్తాయి. దీనికి తోడు.. హీరోయిన్ తో లవ్ ట్రాక్ బాగా కుదరడంతో పూరీ ఈసారి తన పవర్ చూపించబోతున్నాడు అనే క్యూరియాసిటీ మొదలవుతుంది. తరువాత పెద్దగా సమయం తీసుకోకుండా కాన్ ఫ్లిక్ట్ పాయింట్ ఓపెన్ చేయడం, బిగ్ బుల్ గా సంజయ్ మెరుపులు మెరిపించడం కూడా బాగుంటుంది. మధ్యలో అలీ ట్రాక్ కాస్త ఎబ్బెట్టుగా అనిపించినా.. ప్రీ ఇంటర్వెల్ లో యాక్షన్ సీక్వెన్స్, రామ్ ఎనర్జీ, పూరీ మార్క్ డైలాగ్స్ ఆకట్టుకుంటాయి. ఇక.. కథ అంతా ఆడియన్ కి చెప్పేసి, ఒక సస్పెన్స్ తో ఫస్ట్ ఆఫ్ ముగించడంతో.. పర్లేదు లైగర్ లా పూరీ ఈ మూవీని చుట్టేయలేదు అనిపించింది.

డబల్ ఇస్మార్ట్ సెకండ్ ఆఫ్ దగ్గరికి వచ్చే సరికి కథ లేకుండా పోయింది. హీరో తనకి ఎదురైన పరిస్థితులను ఎలా హ్యాండిల్ చేస్తాడు అన్నదే పాయింట్. ఇక్కడ విలన్ ది లైఫ్ అండ్ డెత్ ప్రాబ్లెమ్. పూరీ లాంటి తల పండిన రైటర్ కి ఈ రెండు పాత్రల సంఘర్షణ చాలు కథనాన్ని పరుగులు పెట్టించడానికి. కానీ.., దురదృష్టవశాత్తు ఇక్కడ నుండే సినిమా గాడి తప్పింది. అసలు ఏ సీన్ ఎందుకు వస్తుందో అర్ధం కాదు! హీరో క్యారెక్టరైజేషన్ కూడా ఆ వీక్ రైటింగ్ వల్ల అయోమయంలో పడిపోతుంది. వీటిన్నంటి మధ్య జుగుప్స కలిగించే అలీ కామెడీ ట్రాక్ పెద్ద తలనొప్పిగా మారింది. ఇక ఒక్కసారిగా వచ్చి పడ్డ మదర్ సెంటిమెంట్ అస్సలు పండలేదు. ఇలా సెకండ్ ఆఫ్ అంతా కిచిడీలా మారిపోవడంతో డబల్ ఇస్మార్ట్ రేంజ్ అమాంతం పడిపోయింది. అంతో ఇంతో కాస్త మంచిగా అనిపించే ట్విస్ట్ ని కూడా మంచి ప్రజంటేషన్ తో రివీల్ చేయలేదు. ఇక క్లైమ్యాక్స్ ఫైట్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. దీంతో.. డబల్ ఇస్మార్ట్.. డల్ ఇస్మార్ట్ గా మారిపోయింది.

టెక్నీకల్ విభాగం, నటీనటుల పనితీరు:

డబల్ ఇస్మార్ట్ లో అద్భుతంగా అనిపించిన ఎలిమెంట్స్ లో రామ్ ఎనర్జీ ఒకటి. స్క్రీన్ పై శివతాండవం ఆడేశాడు. తన నుండి 100 పర్సెంట్ బెస్ట్ ఇచ్చేశాడు. ఇక కావ్య థాపర్ ఈ మూవీలో చాలా గ్లామరస్ గా కనిపించింది. బ్యూటీ.. ఆమెలోని నటనని డామినేట్ చేసి పడేసింది. పూరీ ఆ రేంజ్ లో చూపించాడు మరి. ఇక సంజయ్ దత్ పెద్ద అసెట్ గా నిలిచాడు. షయాజీ షిండే రోల్ కొత్తదేమి కాదు. ఆ పాత్ర పరిధిమేర చేసేశాడు. పూరీ- అలీ కాంబోలోనే అత్యంత వీక్ ట్రాక్ ఇది. అలీ ఇలాంటి పాత్రలకి దూరంగా ఉండటం బెటర్. గెటప్ శ్రీను మాత్రం మెప్పించాడు. ఇక టెక్నీకల్ గా మణిశర్మ న్యాయం చేశాడు. సినిమాటోగ్రఫీ బాగుంది. స్క్రీన్ ప్లే తేడా కొట్టేయడంతో ఎడిటింగ్ లో కూడా ఎలాంటి మెరుపులు లేకుండా పోయాయి. ప్రొడక్షన్ విషయంలో కొంత కాంప్రమైజ్ అయినట్టు అనిపించింది. రచయతగా పూర్తిగా విఫలమైన పూరీ, దర్శకుడిగా మాత్రం ఓకే అనిపించాడు.

ప్లస్ లు:

  • రామ్ ఎనర్జీ
  • కావ్య థప్పర్ అందం
  • ఫస్ట్ ఆఫ్

మైనస్ లు:

  • సెకండ్ ఆఫ్
  • పూరీ జగన్నాథ్ వీక్ రైటింగ్
  • స్క్రీన్ ప్లే
  • అలీ కామెడీ ట్రాక్
  • మదర్ సెంటిమెంట్ వర్కౌట్ కాకపోవడం

రేటింగ్: 2.25/5

చివరి మాట: డబల్ ఇస్మార్ట్ కాదు.. డల్ ఇస్మార్ట్

(*ఈ రివ్యూ సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే)
Show comments