Bramayugam Movie Review: మమ్ముట్టి సరికొత్త ప్రయోగం.. భ్రమయుగం సినిమా రివ్యూ! ఎలా ఉందంటే?

ప్రయోగాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తూ వస్తున్న మమ్ముట్టి.. తాజాగా మరో ప్రయోగంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆయన నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ భ్రమయుగం ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం.

ప్రయోగాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తూ వస్తున్న మమ్ముట్టి.. తాజాగా మరో ప్రయోగంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆయన నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ భ్రమయుగం ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం.

భ్రమయుగం

20240215, సస్పెన్స్ థ్రిల్లర్, 2h 19m
  • నటినటులు:మమ్ముటి, ఆమ్లదా లీజ్, అర్జున్ అశోకన్, సిద్ధార్ధ్ భరతన్ తదితరులు..
  • దర్శకత్వం:రాహుల్ సదాశివన్
  • నిర్మాత:చక్రవర్తి రామచంద్ర - ఎస్.శశికాంత్
  • సంగీతం:క్రిస్టో జేవియర్
  • సినిమాటోగ్రఫీ:షెహనాద్ జలాల్

Rating

2.75

ఈ మధ్యకాలంలో ట్రైలర్ తోనే అంచనాలు పెంచేసిన సినిమాలు చాలా తక్కువనే చెప్పాలి. అలాంటి సినిమాల్లో ముందువరుసలో ఉంది మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటించిన లేటెస్ట్ మూవీ ‘భ్రమయుగం’. ఎవ్వరూ చేయని ప్రయోగలు చేస్తూ దూసుకెళ్తున్నాడు ఈ సీనియర్ హీరో. మెున్న ‘కాథల్’ మూవీతో మెప్పించిన మమ్ముట్టి.. తాజాగా భ్రమయుగంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఆ మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం.

కథ:

కేరళ ప్రాంతాన్ని బ్రిటీష్ వారు ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్న రోజుల్లో.. వారి నుంచి తప్పించుకునే క్రమంలో పాణన్ వర్గానికి చెందిన తేవన్(అర్జున్ అశోకన్) ఓ పెద్ద భవనంలోకి వస్తాడు. ఆ భారీ భవంతిలో కొడుమోన్ పొట్టి(మమ్ముట్టి), అతడి వంటవాడు(సిద్ధార్థ్ భరతన్) మాత్రమే ఉంటారు. కానీ ఊహించని విధంగా ఆ ఇంట్లో ఏదో మాయ ఉందని గ్రహించి.. అందులో నుంచి బయటపడటానికి ప్రయత్నిస్తూ ఉంటాడు తేవన్. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా.. మళ్లీ ఆ ఇంట్లోకే వస్తూ ఉంటాడు. దానికి కారణం ఏంటి? ఆ భవనంలో ఉన్న మాయ ఏంటి? అసలు కొడుమోన్ పొట్టి ఎవరు? ఈ ప్రశ్నలకు ఆన్సర్ తెలియాలంటే భ్రమయుగం చూడాల్సిందే.

విశ్లేషణ:

భ్రమయుగం.. రాహుల్ సదాశివన్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ ప్రయోగాత్మక చిత్రాన్ని తొలుత మలయాళంతో పాటుగా తెలుగు, తమిళ భాషల్లోనూ ఒకే టైమ్ కు విడుదల చేయాలని మేకర్స్ భావించారు. కానీ కొన్ని కారణాల చేత మలయాళ వెర్షన్ మాత్రమే విడుదల చేశారు. పేరుకు తగ్గట్లుగానే ఇది ప్రేక్షకులను వేరే కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. మమ్ముట్టి మరోసారి తన నట విశ్వరూపాన్ని చూపించాడు. తేవన్ ఇంట్లోకి రావడంతో.. కథలో ఊపందుకుంటుంది. ఆ ఇంట్లో జరిగే సన్నివేశాలు ఒళ్లు గగుర్పొడిచేలా ఉంటాయి. ప్రతీ ఫ్రేమ్ ను డైరెక్టర్ తీర్చిదిద్దిన తీరు అద్భుతం. తేవన్ ఇంట్లో నుంచి బయటపడాలనుకోవడం.. కానీ విఫలం కావడం.. దానికి రీజన్ ఏంటని తెలుసుకునే ప్రయత్నంలో వచ్చే సీన్లు ప్రేక్షకులను సీట్ ఎడ్జున కూర్చునేలా చేస్తాయి. కథలో భాగంగా వచ్చే ట్విస్టులు ఊహించలేం.

నటీ, నటుల పనితీరు:

మమ్ముట్టి మరోసారి తన నట విశ్వరూపాన్ని చూపించాడు. ఓ మనిషిలో నవ్వులో ఉండే అమాయకత్వం, క్రూరత్వం, రాక్షసత్వాలను తన మెుఖంలో పలికించిన తీరు అద్బుతం. ఈ సినిమాకు మమ్ముట్టి మెయిన్ ఫిల్లర్. ఇక ఆ తర్వాత అంతే పోటీతో నటించాడు అర్జున్ అశోకన్. అతడి తేవన్ పాత్రకు మనం బాగా కనెక్ట్ అవుతాం. వీరి తర్వాత మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది కెమెరామెన్ షెహనాద్ జలాల్ గురించి. అతడు కెమెరా వాడిన విధాం బ్లాక్ అండ్ వైట్ లో మూవీని తీసిన విధానం మెచ్చుకోకుండా ఉండలేం. మరీ ముఖ్యంగా రోజుల్లో ఉండే ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి సమయాలు చూపించిన విధానం అమోఘం. ఇది సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్. క్రిస్టో జేవియర్ బ్యాగ్ గ్రౌండ్ మ్యూజిక్, సౌండ్ డిజైనింగ్ ప్రేక్షకులను అబ్బురపరుస్తాయి. ఈ కథను నమ్మి డబ్బులు పెట్టిన నిర్మాతల ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే.

బలాలు

  • కథ
  • మమ్ముట్టి నటన
  • సినిమాటోగ్రఫీ
  • టెక్నికల్ టీమ్

బలహీనతలు

  • స్లో నెరేషన్

చివరి మాట: పేరుకు తగ్గట్లుగానే ‘భ్రమయుగం’ వేరే లోకంలోకి తీసుకెళ్తుంది.

(గమనిక): ఈ రివ్యూ సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.

Show comments