Bhaje Vaayu Vegam Movie Review: భజే వాయువేగం మూవీ రివ్యూ.. కార్తికేయకు హిట్టు పడ్డట్లేనా?

చాలా కాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న కార్తికేయ తాజాగా భజే వాయువేగం చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి హిట్ కొట్టాడా? లేడా? ఈ రివ్యూలో చూద్దాం.

చాలా కాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న కార్తికేయ తాజాగా భజే వాయువేగం చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి హిట్ కొట్టాడా? లేడా? ఈ రివ్యూలో చూద్దాం.

భజే వాయువేగం

మే 31, క్రైమ్ థ్రిల్లర్,
  • నటినటులు:కార్తికేయ, ఐశ్వర్య మీనన్, తనికెళ్ల భరణి, రవి శంకర్ తదితరులు
  • దర్శకత్వం:ప్రశాంత్ రెడ్డి
  • నిర్మాత:యువీ కాన్సెప్ట్స్
  • సంగీతం:రథన్, కపిల కుమార్ జమ్ముల
  • సినిమాటోగ్రఫీ:ఆర్ డి రాజశేఖర్

Rating

2.75

తెలుగు ప్రేక్షకులకు ఈ వారం మూవీ ట్రీట్ అదిరిపోయింది. ఏకంగా మూడు చిత్రాలు శుక్రవారం(మే 31)న ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అందులో విశ్వక్ సేన్ నటించిన ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’, కార్తికేయ ‘భజే వాయువేగం’, ఆనంద్ దేవరకొండ ‘గం గం గణేశా’ చిత్రాలు విడుదల అయ్యాయి. అయితే ఎంతో కాలంగా హిట్ కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్న కార్తికేయకు భజే వాయువేగం హిట్ ఇచ్చిందా? లేదా? ఈ రివ్యూలో చూద్దాం.

కథ:

వెంకట్(కార్తికేయ) తల్లిదండ్రులు అప్పుల బాధతో చనిపోతారు. దాంతో ఇతడిని తండ్రి స్నేహితుడు(తనికెళ్ల భరణి) పెంచుకుంటాడు. తన సొంత కొడుకు రాజు(రాహుల్ టైసన్) లాగే పెంచుతాడు. ఉద్యోగం చేస్తున్నామని చెప్పి తండ్రిని మోసం చేస్తారు అన్నదమ్ములు. అయితే తండ్రి ఆరోగ్యం క్షిణించడంతో.. డబ్బుల కోసం వెంకట్ బెట్టింగ్ వేసి గెలుస్తాడు. కానీ విలన్ గ్యాంగ్ అతడిని మోసం చేస్తుంది. దాంతో ఆ గ్యాంగ్ పై పగ తీర్చుకోవాలనుకుంటాడు. ఇంతకీ వెంకట్ పగతీర్చుకున్నాడా? లేడా? అసలు డేవిడ్(రవి శంకర్) జార్జ్(శరత్ లోహిత్స్వ)కు సంబంధం ఏంటి? హైదరాబాద్ లో ఏ 56 డ్రగ్ రాకెట్ ను నడిపిస్తున్నది ఎవరు? అన్నదే మిగిలిన కథ.

విశ్లేషణ:

బెట్టింగ్ లు వేస్తూ.. ఉండే ఓ మిడిల్ క్లాస్ కుర్రాడి కథే ఈ భజే వాయువేగం. ఎక్కువ లేట్ చేయకుండా కథలోకి ప్రేక్షకులను తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు దర్శకుడు. సాఫీగా సాగిపోతున్న ఓ కుర్రాడి జీవితం ఒక్కసారిగా చిక్కుల్లో పడుతుంది. ఆ సమస్యల నుంచి వెంకట్ ఎలా భయటపడ్డాడు అన్నదే ఈ కథ. డీసెంట్ క్రైమ్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీలో కొన్ని సీన్స్ ఊహించేలానే ఉన్నప్పటికీ.. స్క్రీన్ ప్లే తో మెస్మరైజ్ చేశాడు డైరెక్టర్. పోలీస్ స్టేషన్ లో వెంకట్ అరెస్ట్ అయ్యే సీన్ తో స్టోరీ మెుదలవుతుంది. ఆ తర్వాత ఓ సంవత్సరం ఫ్లాష్ బ్యాక్ లోకి తీసుకెళ్లాడు అతడి బ్యాగ్రౌండ్ ఏంటనేది చూపించారు. ఈ క్రమంలోనే హీరో, హీరోయిన్(ఐశ్వర్య మీనన్) లవ్ ట్రాన్ ను ప్లాన్ చేశాడు. కానీ ఈ ట్రాక్ రోటీన్ గా ఉండటంతో వర్కౌట్ కాలేదు. దాంతో ప్రేక్షకులకు కాస్త బోరింగ్ కొడుతుంది. అయితే ఇంటర్వెల్ కు వచ్చే సరికి ఊహించని ట్విస్ట్ లో సెకండాఫ్ పై ఆసక్తిని రేకెత్తించారు. ఇక సెకండాఫ్ లో ఛేజింగ్ లు, ఫైట్స్ తో మూవీ వేగం అందుకుంది. విలన్ గ్యాంగ్ పై పగ తీర్చుకోవడం, ఏ 56 రాకెట్ గురించి తెలుసుకోవడం లాంటి సీన్స్ తో డైరెక్టర్ కథలో వేగం పెంచాడు. క్లైమాక్స్ కు వచ్చేసరికి రెగ్యులర్ కమర్షియల్ ట్రాక్ లోనే ముగించారు. ఇది అభిమానులను అసంతృప్తికి గురిచేస్తుంది.

ఎవరెలా చేశారంటే?

‘ఆర్ఎక్స్ 100’తో టాలీవుడ్ కు దూసుకొచ్చిన కార్తికేయ.. సూపర్ హిట్ ను అందుకున్నాడు. అయితే ఆ తర్వాత ఈ రేంజ్ హిట్ ను మాత్రం అందుకోలేకపోయాడు. హిట్ కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్న కార్తికేయకు భజే వాయువేగంతో హిట్ కొట్టినట్లే. గత సినిమాల కంటే బెస్ట్ ఫర్పామెన్స్ ఇచ్చాడు కార్తికేయ. ఎమోషనల్ సీన్స్ లో జీవించేశాడు. ఇక హీరోయిన్ గా ఐశ్వర్య మీనన్ తన పాత్రకు న్యాయం చేసింది. హీరో అన్న పాత్రలో రాహుల్ టైసన్ అదరగొట్టాడు. ఇక విలన్ గా రవి శంకర్ ఎప్పటిలాగే జీవించేశాడు. టెక్నికల్ విభాగానికి వస్తే.. ఆర్.డి రాజశేఖర్ తన సినిమాటోగ్రఫీతో మెప్పించాడు. రథన్, కపిల కుమార్ తమ సంగీతం, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ తో అదరగొట్టారు. చివరిగా డైరెక్టర్ ప్రశాంత్ రెడ్డి తొలి ప్రయత్నంలోనే మంచి మార్కులు కొట్టేశాడు. తన డీసెంట్ టేకింగ్ తో అనవసరపు సీన్స్ జోలికి వెళ్లకుండా ప్రేక్షకులకు ఏది కావాలో అదే ఇచ్చాడు.

బలాలు

  • కార్తికేయ నటన
  • స్క్రీన్ ప్లే
  • బ్యాగ్రౌండ్ స్కోర్

బలహీనతలు

  • అక్కడక్కడ రొటీన్ సీన్స్
  • లాజిక్స్ మిస్ కావడం

చివరి మాట: భజే వాయువేగంలో వేగం కొంచెం తగ్గినప్పటికీ.. ప్రేక్షకులను మెప్పిస్తుంది.

(గమనిక): ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.

Show comments