Baak Movie Review: తమన్నా, రాశి ఖన్నా, సుందర్ సి నటించిన బాక్ మూవీ రివ్యూ

తమన్నా, రాశిఖన్నా, సుందర్ సి నటించిన బాక్ సినిమా శుక్రవారం విడుదలైంది. తమన్నా, రాశిఖన్నా ఆడిపాడిన సాంగ్ కైతే విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. మరి పాటలానే సినిమా కూడా అదే రేంజ్ లో హిట్ కొట్టిందా? లేదా? రివ్యూలో చూద్దాం.

తమన్నా, రాశిఖన్నా, సుందర్ సి నటించిన బాక్ సినిమా శుక్రవారం విడుదలైంది. తమన్నా, రాశిఖన్నా ఆడిపాడిన సాంగ్ కైతే విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. మరి పాటలానే సినిమా కూడా అదే రేంజ్ లో హిట్ కొట్టిందా? లేదా? రివ్యూలో చూద్దాం.

బాక్

03-05-2024, హారర్, 2h 28m UA
UA
  • నటినటులు:సుందర్ సి, తమన్నా, రాశి ఖన్నా, యోగిబాబు, శ్రీనివాసరెడ్డి, వెన్నెల కిషోర్, కోవై సరళ తదితరులు
  • దర్శకత్వం:సుందర్ సి
  • నిర్మాత:కుష్బూ, ఏ.సి.ఎస్ అరుణ్ కుమార్
  • సంగీతం:హిప్ హాప్ తమీజా
  • సినిమాటోగ్రఫీ:కృష్ణస్వామి

Rating

2

కోలీవుడ్ దర్శకుడు, నటుడు సుందర్ సి.. అరణ్మణై పేరుతో ఫ్రాంచైజీ చిత్రాలను తెరకెక్కిస్తూ వస్తున్నారు. ఆ ఫ్రాంచైజీలో వచ్చినవే చంద్రకళ, రాజ్ మహల్ సినిమాలు. తాజాగా ఈ ఫ్రాంచైజీ నుంచి నాల్గవ భాగంగా బాక్ మూవీ వచ్చింది. తమిళంలో అరణ్మణై 4గా విడుదలైంది. ఈ మూవీలో తమన్నా, రాశి ఖన్నా హీరోయిన్స్ గా నటించగా.. సుందర్ సి, వెన్నెల కిషోర్, శ్రీనివాసరెడ్డి, యోగిబాబు ముఖ్య పాత్రల్లో నటించారు. మరి ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకుల అంచనాలను అందుకుందా? లేదా? రివ్యూలో చూద్దాం. 

కథ:

శివశంకర్ (సుందర్ సి) అనే న్యాయవాదికి శివాని (తమన్నా) అనే చెల్లి ఉంటుంది. ఆమె ప్రేమించిన వ్యక్తిని వివాహం చేసుకుంటుంది. అది తల్లిదండ్రులకు నచ్చదు. దీంతో ఇంట్లోంచి వెళ్ళిపోమంటారు. శివానీ ఇంట్లోంచి వెళ్ళిపోతుంది. తల్లిదండ్రులకు దూరంగా భర్త, పిల్లలతో బతుకుతున్న శివానీ ఉన్నట్టుండి ఆత్మహత్యకు పాల్పడుతుంది. శివానీ భర్త కూడా అనుమానాస్పద స్థితిలో చనిపోతాడు. దీంతో శివ శంకర్ కి అనుమానాలు వస్తాయి. తన చెల్లి శివానీది ఆత్మహత్య కాదని.. ఏదో జరిగి ఉంటుందని తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. ఈ క్రమంలో శివశంకర్ కి తెలిసిన విషయాలు ఏంటి? శివానీ ఆత్మహత్య చేసుకుందా? లేక ఎవరైనా హత్య చేశారా? అసలు బాక్ అనే దుష్టశక్తికి, శివానీ మరణానికి కారణం ఏంటి? వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.   

విశ్లేషణ:

ఈ అరణ్మనై ఫ్రాంచైజీ నుంచి వచ్చిన సినిమాలన్నీ ఒకేలా ఉంటాయి. కాసేపు భయపెడుతూ.. కాసేపు నవ్విస్తూ ఉంటాయి. ఈ బాక్ సినిమా కూడా అంతే. తన ఆకారాన్ని మార్చుకుంటూ భయపెట్టేందుకు ప్రయత్నించే దుష్టశక్తి పాత్ర తప్పితే ఈ మూవీలో కొత్తదనం ఏమీ లేదు. హాస్యం, హారర్ ఎలిమెంట్స్ ఇవేమీ పెద్దగా ఆకట్టుకోవు. సాధారణ హారర్ మూవీ అనే ఫీల్ కలుగుతుంది. ఆత్మగా మారిన శివానీ చేసే హడావుడి, ఫస్ట్ హాఫ్ లో అక్కడక్కడా వచ్చే కామెడీ సీన్స్ లో శ్రీనివాసరెడ్డి, వెన్నెల కిషోర్, కోవై సరళ నవ్విస్తారు. అయితే శివశంకర్ శివానీ మృతికి గల కారణాలను తెలుసుకునే విధానం ఆసక్తికరంగా సాగుతుంది. శివానీది హత్య లేక ఆత్మహత్య అనే విషయాలు బయటపెట్టే సీన్స్, బాక్ అనే దుష్టశక్తి అసలు నేపథ్యం వెలుగులోకి వచ్చే ఎపిసోడ్ ఇవన్నీ సినిమాని ఇంట్రస్టింగ్ గా మలుస్తాయి. అయితే కథ సీరియస్ గా సాగుతుంటే మధ్యలో వచ్చే కామెడీ సీన్స్ ఆసక్తిని దెబ్బతీస్తాయి. అలా అని కామెడీ సీన్స్ లో బలం ఉందా అంటే లేదు.

కథ కథనాల విషయంలో మూవీ పెద్దగా ఆకట్టుకోకపోయినా విజువల్స్ పరంగా మాత్రం అబ్బురపరుస్తుంది. ఇక క్లైమాక్స్ లో వచ్చే సీన్లు సినిమాకి ప్లస్. ఆఖరిలో వచ్చే పాటలో సిమ్రాన్, ఖుష్బూ కలిసి సందడి చేయడం బాగుంది. నటీనటుల పనితీరు గురించి చెప్పాలంటే పిల్లల్ని కాపాడుకునే తల్లి పాత్రలో తమన్నా బాగా నటించింది. ఇక రాశి ఖన్నా మాయ అనే డాక్టర్ పాత్రలో మెప్పిస్తుంది. సుందర్ సి నటన కూడా బాగుంది. వెన్నెల కిషోర్, కోవై సరళ, శ్రీనివాసరెడ్డి, యోగిబాబుల కామెడీ బాగుంది. సాంకేతికవర్గం పనితీరు విషయానికొస్తే.. హిప్ హాప్ తమీజా అందించిన మ్యూజిక్ ఈ సినిమాకి ప్రధాన బలం అని చెప్పాలి. నిర్మాణ విలువలు బాగున్నాయి. విజువల్స్ ఆకట్టుకుంటాయి. కథ, కథనం, దర్శకత్వంలో కొత్తదనం లేదు. ఈ విషయంలో దర్శకుడిగా సుందర్ సి ఫెయిలయ్యారు.

ప్లస్‌లు:

  • తమన్నా నటన
  • విజువల్స్
  • క్లైమాక్స్ సీన్ 

మైనస్‌లు: 

  • రొటీన్ కథ 
  • ఆకట్టుకోలేని కామెడీ సన్నివేశాలు

చివరిగా: బాక్.. ఒక రొటీన్ హారర్ కామెడీ మూవీ 

రేటింగ్: 2/5

గమనిక: ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
Show comments