Idream media
Idream media
ఉక్రెయిన్‌లో కొనసాగుతున్న సైనిక చర్య కారణంగా రష్యా అలాగే ఆ దేశానికి మద్దతుగా నిలిచిన బెలారస్‌లకు తన సేవలను నిలిపివేస్తున్నట్లు అమెరికన్ ఎక్స్‌ప్రెస్ ప్రకటించింది. క్రెడిట్ కార్డు దిగ్గజాలు మాస్టర్ కార్డ్, వీసా రష్యాలో కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన కొన్ని గంటలకే అమెరికన్ ఎక్స్‌ప్రెస్ కూడా అదే బాటలో పయనిస్తూ తన నిర్ణయాన్ని వెల్లడించింది. అమెరికన్ ఎక్స్‌ప్రెస్ తన ప్రకటనలో, “ఉక్రెయిన్ ప్రజలపై రష్యా యొక్క అనవసరమైన దాడిని దృష్టిలో ఉంచుకుని, అమెరికన్ ఎక్స్‌ప్రెస్ రష్యాలో అన్ని కార్యకలాపాలను నిలిపివేస్తోంది.” ఫలితంగా, ప్రపంచవ్యాప్తంగా జారీ చేయబడిన అమెరికన్ ఎక్స్‌ప్రెస్ కార్డ్‌లు ఇకపై రష్యాలోని వ్యాపారుల వద్ద అలాగే ATMలలో పని చేయవు” అని పేర్కొంది.
అలాగే రష్యన్ బ్యాంకుల ద్వారా రష్యాలో స్థానికంగా జారీ చేయబడిన కార్డులు అమెరికన్ ఎక్స్‌ప్రెస్ గ్లోబల్ నెట్‌వర్క్‌లో దేశం వెలుపల కూడా పనిచేయవు. మేము బెలారస్‌లో కూడా అన్ని వాణిజ్య కార్యకలాపాలను ముగిస్తున్నాము.’ అని పేర్కొంది. అంతకుముందు శనివారం, మాస్టర్ కార్డ్ కూడా ఇదే నిర్ణయాన్ని ప్రకటిస్తూ “మేము తొందరపడి ఈ నిర్ణయం తీసుకోలేదు” అని పేర్కొంది. కేవలం ఈ సంస్థలు మాత్రమే కాకుండా ఇటీవల పేపాల్ కూడా రష్యాలో తన సేవలను నిలిపివేసింది.
ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ కోజెంట్ కమ్యూనికేషన్స్ తన సేవను నిలిపివేసింది. కోజెంట్ కమ్యూనికేషన్‌ను రష్యా ఇంటర్నెట్‌కు వెన్నెముకగా భావించవచ్చు. ఈ సంస్థ రష్యాలోని అనేక పెద్ద ప్రాంతాల్లో ఇంటర్నెట్‌ను అందిస్తుంది. కోజెంట్ ఒక అమెరికన్ కంపెనీ కావడంతో కార్యకలాపాలు నిలిపివేసింది. రష్యన్ మీడియాను గూగుల్, ఫేస్‌బుక్, యూట్యూబ్ మరియు ఆపిల్ తమ ప్లాట్‌ఫారమ్‌లలో నిషేధించాయి. అలాగే తాజాగా ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ కూడా రష్యాలో తమ సేవలు రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది.