Idream media
Idream media
అంతర్జాతీయంగా చమురు ధరలు బ్యారెల్‌కు 100 డాలర్లు దాటిపోవడంతో లీటర్‌కు రూ.9 గ్యాప్‌ను తగ్గించడానికి యూపీ ఎన్నికలు ముగిసిన తర్వాత పెట్రోలు మరియు డీజిల్ ధరల పెంపు మళ్లీ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం… పాశ్చాత్య దేశాల ప్రతీకార ఆంక్షల కారణంగా రష్యా నుండి చమురు, గ్యాస్ సరఫరాలకు అంతరాయం కలుగుతుందనే భయంతో అంతర్జాతీయ ముడి చమురు ధరలు 2014 మధ్యకాలం తర్వాత మొదటిసారిగా బ్యారెల్‌కు 110 డాలర్ల కంటే ఎక్కువ పెరిగాయి. రానున్న రోజుల్లో బ్యారెల్ 150కీ కూడా చేరే అవకాశాలున్నాయి.
అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరల పెరుగుదలతో
ప్రభుత్వ యాజమాన్యంలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ , భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ పెట్రోల్ ,డీజిల్‌పై లీటర్‌కు రూ. 5.7 నష్టపోతున్నాయి. చమురు మార్కెటింగ్ కంపెనీలు సాధారణ మార్కెటింగ్ మార్జిన్‌లకు తిరిగి రావాలంటే, రిటైల్ ధరలు లీటరుకు రూ.9 లేదా 10 శాతం పెంచాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు.
చమురు మంత్రిత్వ శాఖలోని పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలిసిస్ సెల్ సమాచారం ప్రకారం, మార్చి 1న భారతదేశం కొనుగోలు చేసే ముడి చమురు బ్యారెల్‌కు 102 డాలర్ల కన్నా ఎక్కువ పెరిగింది, ఇది 2014 ఆగష్టు తరువాత అత్యధికం. గత ఏడాది నవంబర్ ప్రారంభంలో పెట్రోల్, డీజిల్ ధరలను స్తంభింపజేసే సమయంలో భారతీయ ముడి చమురు బ్యారెల్ ధర సగటున 81.5 డాలర్లు కావడం గమనార్హం.
ఉత్తరప్రదేశ్ శాసనసభకు చివరి దశ పోలింగ్ మార్చి 7తో ముగుస్తుంది. ఓట్ల లెక్కింపు మార్చి 10న జరగనుంది. ఈనేపథ్యంలో ఈనెల ఏడో తేదీ తర్వాత నుంచి చమురు ధరలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారతదేశం తన అవసరాలకు 85 శాతం చమురు ను దిగుమతి చేసుకుంటోంది. దీంతో అంతర్జాతీయంగా పెరుగుతున్న చమురు ధరలు ఆందోళన కలిగిస్తున్నాయి.