కేటీఆర్‌పై కేసు నమోదు.. కారణమిదే

బీఆర్ఎస్‌కు మరో బిగ్ షాక్ తగిలింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మాజీ ఐటి మినిస్టర్ కేసీఆర్ పై కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.. ఎందుకంటే..?

బీఆర్ఎస్‌కు మరో బిగ్ షాక్ తగిలింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మాజీ ఐటి మినిస్టర్ కేసీఆర్ పై కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.. ఎందుకంటే..?

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవిత అరెస్టై.. ప్రస్తుతం తీహార్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అంతలో మరోసారి బీఆర్ఎస్‍కు బిగ్ షాక్ తగిలింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మాజీ ఐటి మినిస్టర్ కేటీఆర్‌పై కేసు నమోదైంది. సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేశాడన్న ఆరోపణలపై ఆయనపై కాంగ్రెస్ నేత పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేటీఆర్‌పై బంజారా హిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. సీఎం రేవంత్ రూ. 2500 కోట్లు వసూలు చేసి ఢిల్లీ పెద్దలకు ఇచ్చారంటూ తీవ్ర ఆఱోపణలు చేశాడు కేటీఆర్. ఈ క్రమంలో ఆయన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత బత్తిన శ్రీనివాస రావు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇంతకు కేటీఆర్ ఏమన్నారంటే.. రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్, బిల్డర్స్ నుండి కొన్ని కోట్ల రూపాయలను డబ్బులు వసూలు చేసి ఢిల్లీలోని పెద్దలకు పంపారంటూ ఆరోపణలు చేశారు. లోక్ సభ ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి బీజెపీలో చేరతాడని అన్నారు. ఈ వార్తలను ఖండించిన కాంగ్రెస్ నేతలు.. హనుమ కొండ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేటీఆర్ చేస్తున్న నిరాధారమైన ఆరోపణలపై చర్యలు తీసుకోవాలంటూ టీపీసీసీ మెంబర్స్ బత్తిని శ్రీనివాసరావు, కార్యదర్శి ఈవీ శ్రీనివాస రావు, కార్పొరేటర్లు తోట వెంటేశ్వర్లు తదితరులు పోలీసులకు కంప్లయింట్ చేశారు. హనుమ కొండ పోలీసులు కేసు నమోదు చేసి.. బంజారా హిల్స్ పోలీసు స్టేషన్‌కు ట్రాన్స్ ఫర్ చేశారు.

బంజారా హిల్స్ పోలీసులు ఐపీసీ 504, 505(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్ తగిలింది. కాంగ్రెస్ ప్రభుత్వానికి అధికారం అప్పగించారు రాష్ట్ర ప్రజలు. అక్కడి నుండి షాకుల మీద షాకులు తగులుతున్నాయి కేసీఆర్ నేతృత్వంలోని పార్టీకి. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కవిత జైలు పాలు కావడంతో ఆందోళనలో ఉన్న బీఆర్ఎస్ నేతలకు.. ఇప్పుడు కేటీఆర్ పై కేసు నమోదు కావడం మరో బిగ్ షాక్. ఇది చాలవన్నట్లు లోక్ సభ ఎన్నికల ముంగిట వరుస పెట్టి బీఆర్ఎస్ కీలక నేతలు కాంగ్రెస్ బాట పడుతున్నారు. అంతలో 30 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారంటూ కాంగ్రెస్ నేత, మంత్రి కోమటి రెడ్డి వెంకట రెడ్డి కీలక వ్యాఖ్యలు చేయడం కొసమెరుపు.

Show comments