Aditya N
'అన్వేషిప్పిన్ కండేతుమ్' సినిమాని తెలుగులోనూ స్ట్రీమింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఓటీటీలో అడుగు పెట్టనుంది. గత నెలలో థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం అద్భుతమైన రెస్పాన్స్ అందుకుంది.
'అన్వేషిప్పిన్ కండేతుమ్' సినిమాని తెలుగులోనూ స్ట్రీమింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఓటీటీలో అడుగు పెట్టనుంది. గత నెలలో థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం అద్భుతమైన రెస్పాన్స్ అందుకుంది.
Aditya N
మలయాళ స్టార్ హీరో టోవినో థామస్ నటించిన లేటెస్ట్ ఇన్వెస్టిగేటివ్ ‘అన్వేషిప్పిన్ కండేతుమ్’ త్వరలోనే ఓటీటీలో అడుగు పెట్టనుంది. గత నెలలో థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం అద్భుతమైన రెస్పాన్స్ అందుకుంది. తెలుగు ప్రేక్షకులు కూడా ఈ సినిమా గురించి మాట్లాడుకున్నారు. అయితే ప్రేమలు వంటి బ్లాక్ బస్టర్ పక్కన రిలీజ్ అవడం ఒక రకంగా ఈ సినిమాకి మైనస్ అయ్యింది. నిజానికి ‘అన్వేషిప్పిన్ కండేతుమ్’ సినిమాకి చాలా మంచి టాక్ వచ్చినా… బాక్సాఫీసు వద్ద డీసెంట్ హిట్ గానే ఉండిపోయింది. ఒకవేళ కాంపిటీషన్ లో కాకుండా సోలోగా వచ్చి ఉంటే ఇంకా పెద్ద హిట్ అయ్యేదని ట్రేడ్ పండితులు అభిప్రాయపడ్డారు.
ఇక తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ‘అన్వేషిప్పిన్ కండేతుమ్’ సినిమాని తెలుగులోనూ స్ట్రీమింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ దిగ్గజ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది. ఈ శివరాత్రి నుంచి అంటే మార్చి 8 నుండి టొవినో థామస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘అన్వేషిప్పిన్ కండేతుమ్’ స్ట్రీమింగ్ కు అందుబాటులోకి రానుంది.
2018 సినిమాతో తెలుగు ప్రేక్షకులలో కూడా మంచి ఇమేజ్ సంపాదించుకున్నారు హీరో టోవినో థామస్ పోలీస్ గా ప్రథాన పాత్రలో నటించగా ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో తీసిన ‘అన్వేషిప్పిన్ కండేతుమ్’ చిత్రం ఫిబ్రవరి 9న థియేటర్లలోకి వచ్చింది. హిట్ టాక్ సొంతం చేసుకుంది. నిజ జీవిత సంఘటనలతో 90స్ బ్యాక్‌డ్రాప్ స్టోరీతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఫస్ట్ హాఫ్ లో ఒక మర్డర్ కేస్, సెకండ్ హాఫ్ లో ఇంకో మర్డర్ కేస్ ను చూపిస్తూ సాగే స్క్రీన్ ప్లే ప్రేక్షకులని విపరీతంగా ఆకట్టుకుంది. కాగా ఎటువంటి కమర్షియల్ ఎలిమెంట్స్ లేకుండా ఒక నిజాయతీతో సినిమా తీశారని విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు దర్శకుడు డార్విన్ కురియాకోస్. ముఖ్యంగా క్లైమాక్స్ ట్విస్ట్ ఊహకందని తరహాలో తీసారని సినిమా చూసిన ప్రతి ఒక్కరూ మెచ్చుకున్నారు. మరి ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఓటీటీలో ఎలాంటి స్పందన తెచ్చుకుంటుంది అనేది చూడాలి.