ఓటీటీలో రికార్డు వ్యూస్ సంపాదించుకున్న ది కేరళ స్టోరీ

ఎన్నో వివాదాల మధ్యన కొన్ని నెలల క్రితం థియేటర్ లో విడుదలైన "ది కేరళ స్టోరీ" చిత్రం ఓటీటీ లో విడుదల అయిన సంగతి తెలిసిందే. మరి ఈ చిత్రం ఓటీటీ వివరాలు ఇలా ఉన్నాయి.

ఎన్నో వివాదాల మధ్యన కొన్ని నెలల క్రితం థియేటర్ లో విడుదలైన "ది కేరళ స్టోరీ" చిత్రం ఓటీటీ లో విడుదల అయిన సంగతి తెలిసిందే. మరి ఈ చిత్రం ఓటీటీ వివరాలు ఇలా ఉన్నాయి.

బాలీవుడ్ నటి అదా శర్మ ప్రధాన పాత్రలో నటించిన వివాదాస్పద చిత్రం ది కేరళ స్టోరీ, ఎట్టకేలకు ఫిబ్రవరి 16, 2024 న జీ 5 లో విడుదల అయింది. 2023 మే 5న థియేటర్లలో విడుదలై ఎన్నో వివాదాలతో సంచలనం సృష్టించిన చిత్రం “ది కేరళ స్టోరీ”. ఈ చిత్రం రూ.40 కోట్ల బడ్జెట్ తో రూపొందించి… సుమారు రూ. 300 కోట్ల కలెక్షన్లను బాక్స్ ఆఫీస్ వద్ద సొంతం చేసుకుని భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కొన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కించిన కారణంగా.. చాలా మంది మతపెద్దలు, ఒక వర్గం ప్రేక్షకుల నుంచి తీవ్రమైన నెగటివ్ రెస్పాన్స్ కూడా అందుకుంది. అయితే థియేటర్లలో విడుదలైన ఎనిమిది నెలల తరువాత ఓటీటీ లోకి వచ్చి రికార్డు వ్యూస్ సంపాదించుకుంది ది కేరళ స్టోరీ చిత్రం.

సుదీప్తో సేన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఓటీటీ రిలీజ్ ఎప్పుడెప్పుడా అంటూ ప్రేక్షకులు ఒక రకమైన ఆసక్తిని రేకెత్తించింది. జీ5 ప్లాట్ ఫామ్ లో రికార్డులను బద్దలు కొట్టిన ఈ చిత్రం కేవలం 3 రోజుల్లోనే 150 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ రాబట్టి ఒక సంచలనాత్మక మైలురాయిని అందుకుంది. పైన చెప్పుకున్న విధంగా థియేట్రికల్ రిలీజ్ సమయంలో పాజిటివ్, నెగిటివ్ ఫీడ్ బ్యాక్ లు అందుకున్న ది కేరళ స్టోరీ సినిమా ఓటీటీలో కూడా అదే తరహాలో స్పందన తెచ్చుకుంటూ మంచి బజ్ క్రియేట్ చేసుకుంది.

ఇక ” ది కేరళ స్టోరీ” సినిమా కథ విషయానికొస్తే.. షాలిని ఉన్ని కృష్ణన్(ఆదా శర్మ), నీమ(యోగితా బిహాని), గీతాంజలి(సిద్ధి ఇద్నాని) అనే ముగ్గురు యువతులు, కేరళలో కాసర్గడ్ కు చెందిన నర్సింగ్ కాలేజ్ విద్యార్థులుగా చేరతారు. ఈ ముగ్గురూ ఉండే హాస్టల్ రూమ్ లోనే ఆసిఫా(సోనియా బలాని) అనే మరో యువతి కూడా ఉంటుంది. అయితే ఆమె ఆ ముగ్గురు యువతులకు మాయ మాటలు చెప్పి మత మార్పిడి చేయాలి అనుకుంటుంది. దానికోసం మరో ఇద్దరు అబ్బాయిలను రంగంలోకి దింపి..ఆ యువతులతో ప్రేమలో పడేలా చేస్తుంది. ఆ తరువాత షాలిని, నీమ, గీతాంజలి జీవితం ఎలాంటి అనుకొని మలుపులు తిరిగింది అనేది మిగతా కథ.

Show comments