Swetha
ప్రతి వారం OTT లోకి ముందస్తు ఇన్ఫర్మేషన్ తో కొన్ని సినిమాలు వస్తూ ఉంటాయి. కానీ కొన్ని సినిమాలు మాత్రం సడెన్ ఎంట్రీ ఇస్తూ ఉంటాయి. ఈ క్రమంలో ఓ తెలుగు సినిమా సడెన్ ఎంట్రీ ఇచ్చింది. మరి ఆ సినిమా ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది అనే విషయాలు చూసేద్దాం.
ప్రతి వారం OTT లోకి ముందస్తు ఇన్ఫర్మేషన్ తో కొన్ని సినిమాలు వస్తూ ఉంటాయి. కానీ కొన్ని సినిమాలు మాత్రం సడెన్ ఎంట్రీ ఇస్తూ ఉంటాయి. ఈ క్రమంలో ఓ తెలుగు సినిమా సడెన్ ఎంట్రీ ఇచ్చింది. మరి ఆ సినిమా ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది అనే విషయాలు చూసేద్దాం.
Swetha
ఎందుకో తెలియదు కానీ కొన్ని సినిమాలు చాలా లెట్ గా OTT లోకి ఎంట్రీ ఇస్తూ ఉంటాయి. అవి కాస్త ఊహించని విదంగా ట్రెండ్ అవుతూ ఉంటాయి. ఈ క్రమంలో ఈ వారం OTT లోకి మరో తెలుగు సినిమా సడెన్ ఎంట్రీ ఇచ్చింది. అదే సినిమా పిచ్చోడు అనే మూవీ. ఈ సినిమాకు కుమారస్వామి హీరోగా నటిస్తూనే దర్శకత్వం వహించారు. కాగా సావిత్రికృష్ణ హీరోయిన్ గా నటించింది. హీరో హీరోయిన్ తో ఈ సినిమాలో చాలా మంది కొత్త ఆర్టిస్టులు ఉన్నారు.
ఇక ఈ సినిమా విషయానికొస్తే సినిమా మొత్తం కూడా పల్లెటూరి బ్యాక్డ్రాప్ లో తెరకెక్కింది. పల్లెటూరు, సిటీ అనే తేడాలతో పని లేకుండా నటనపై ఆసక్తి ఉన్నవారు ఎవరైనా హీరోలు అనే ప్లాట్ లో ఈ మూవీ కొనసాగుతుంది. ఈ సినిమాలో హీరో పల్లెటూళ్లో పాల వ్యాపారం చేస్తుంటాడు. సినిమాలంటే పిచ్చి. ఎప్పటికైనా హీరో కావాలని కలలు కంటాడు. ఈ క్రమంలో ఓ డెమో ఫిలిం చేయడానికి భాను అనే లేడీ డైరెక్టర్ పల్లెటూరికి వస్తుంది. అనుకోకుండా ఆ డెమ్ ఫిల్మ్‌లో హీరోగా ఇతనికి ఛాన్స్ వస్తుంది. కానీ ఊరిలో ఎలాంటి షూట్స్ చేయకూడదని ఊరి సర్పంచ్ కండిషన్ పెడతాడు. ఆ తర్వాత ఏమైంది? అతను హీరో అయ్యాడా లేదా ? ఆ డైరెక్టర్ భానుతో ఇతని ప్రేమ ఏమైంది ? ఈ క్రమంలో వారికి ఎదురైనా సంఘటనలు ఏంటి ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.