OTTలోకి సైన్స్ ఫిక్షన్ తరహా మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే!

OTT Movie: OTTలోకి సైన్స్ ఫిక్షన్ తరహా మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే!

ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు కొత్త సినిమాలు రిలీజ్ అవుతాయా అని.. ప్రేక్షకులు ఎదురుచూస్తూ ఉంటున్నారు. ఈ క్రమంలో.. తాజాగా శివకార్తికేయన్ నటించిన.. అయలాన్ తెలుగు వెర్షన్ ఓటీటీ ఎంట్రీకి సిద్ధం అయిందనే వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు కొత్త సినిమాలు రిలీజ్ అవుతాయా అని.. ప్రేక్షకులు ఎదురుచూస్తూ ఉంటున్నారు. ఈ క్రమంలో.. తాజాగా శివకార్తికేయన్ నటించిన.. అయలాన్ తెలుగు వెర్షన్ ఓటీటీ ఎంట్రీకి సిద్ధం అయిందనే వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

ఓటీటీ అంటేనే సినిమాల జాతర.. ప్రతి వారం ఎన్నో కొత్త సినిమాలు, సిరీస్ లు విడుదల అవుతూనే ఉన్నాయి. అలాగే చాలా మంది ప్రేక్షకులు కూడా ఓటీటీ లో సినిమాలు చూడడానికి అలవాటు పడిపోయి ఉన్న క్రమంలో.. మేకర్స్ కూడా ఎంతో ప్లానెడ్ గా సినిమాలను ఓటీటీ లో విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో తమిళంలో శివ కార్తికేయన్ నటించిన లేటెస్ట్ మూవీ అయలాన్.. సంక్రాంతికి థియేటర్స్ లో విడుదల అయ్యి.. బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. శివ కార్తికేయన్ కెరీర్ లోనే ఈ సినిమా బెస్ట్ మూవీ గా రికార్డ్స్ సృష్టించింది. సైన్స్ ఫిక్షన్ తరహాలో వచ్చిన ఈ సినిమా.. సుమారు 96 కోట్లకు పైగా షేర్స్ ను రాబట్టింది. 2024లో ఇప్పటివరకు అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా “అయలాన్” రికార్డు సృష్టించింది. ఎట్టకేలకు ఈ సినిమా తెలుగులో ఓటీటీ లో స్ట్రీమింగ్ కానుంది. మరి ఏ ప్లాట్ ఫార్మ్ లో ఎప్పటినుంచి స్ట్రీమింగ్ కానుందో చూసేద్దాం.

శివ కార్తికేయన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాను.. తమిళంతో పాటు.. తెలుగులోనూ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు మేకర్స్. అయితే అది సంక్రాంతి సమయం కావడంతో.. అప్పటికి తెలుగులో సంక్రాంతి బరిలో బడా హీరోల చిత్రాలు ఉండడంతో.. కాస్త గ్యాప్ తర్వాత తెలుగులో రిలీజ్ చేద్దాం అని భావించారు. కానీ, వీఎఫ్ఎక్స్ స‌మ‌స్య‌ల కార‌ణంగా.. “అయలాన్” థియేటర్ తెలుగు రిలీజ్ వాయిదా పడింది. ఆ తర్వాత దీనికి సంబంధించిన డబ్బింగ్ పనులు కూడా పూర్తయినా కూడా .. ఎందుచేతనో ఈ సినిమా తెలుగు వెర్షన్ రిలీజ్ చేయలేకపోయారు. థియేటర్ లో కాకపోయినా ఓటీటీ లో అయినా రిలీజ్ చేస్తారేమో అని ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు నిరాశే ఎదురయ్యింది. ఇక ఇప్పుడు ఎట్టకేలకు ఈ సినిమా తెలుగు వెర్షన్ ఓటీటీ లోకి రాబోతుందని ప్రచారం జరుగుతుంది. ఏప్రిల్ 19నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ సన్ నెక్స్ట్ లో అయలాన్ సినిమా తెలుగు వెర్షన్ స్ట్రీమింగ్ కానుందట.

ఇక అయలాన్ సినిమా కథ విషయానికొస్తే.. ఈ సినిమాలో శివకార్తికేయన్ ఒక సాధారణ రైతు. జాబ్ కోసం సిటీకు వచ్చిన అతనికి టాట్టూ అనే ఏలియన్ తో ఫ్రెండ్ షిప్ ఏర్పడుతుంది. పెట్రోల్‌, డీజీల్‌కు బదులుగా నోవా గ్యాస్‌ను క‌నిపెట్టే ఆలోచనలో ఉంటాడు మరో వ్యక్తి.. దీనికి సంబంధించి ఆ సైంటిస్ట్.. ఇండియాలో ఎవ‌రికి తెలియ‌కుండా ఓ మైన్‌లో ర‌హ‌స్యంగా నోవా గ్యాస్‌ ప్ర‌యోగం చేస్తుంటాడు. అది ఎంతో ప్రమాదం కాబట్టి .. దానిని అడ్డుకోడానికి.. త‌న గ్ర‌హం నుంచి టాట్టూ భూమిపైకి వ‌స్తుంది. ఆ ఏలియన్ కు సహాయంగా ఉంటాడు హీరో.. మరి వీరిద్దరూ కలిసి దానిని అడ్డుకునే క్రమంలో ఎటువంటి పరిణామాలు ఎదుర్కుంటారు.. వీరిద్దరి మధ్య ఫ్రెండ్ షిప్ ఎలా ఏర్పడుతుంది.. అనేది తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే. మరి, ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments