Venkateswarlu
Salaar OTT Release: గురువారం అర్థరాత్రి నుంచే తెలుగు రాష్ట్రాల్లో సలార్ బెనిఫిట్ షోలు మొదలయ్యాయి. సినిమా అత్యద్భుతంగా ఉందని చూసిన వాళ్లు చెబుతున్నారు. సలార్‌కు మంచి రివ్యూలు సైతం వచ్చాయి.
Salaar OTT Release: గురువారం అర్థరాత్రి నుంచే తెలుగు రాష్ట్రాల్లో సలార్ బెనిఫిట్ షోలు మొదలయ్యాయి. సినిమా అత్యద్భుతంగా ఉందని చూసిన వాళ్లు చెబుతున్నారు. సలార్‌కు మంచి రివ్యూలు సైతం వచ్చాయి.
Venkateswarlu
ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్- కేజీఎఫ్ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కిన సలార్ సినిమా గురువారం అర్థరాత్రి నుంచే థియేటర్లలోకి వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో బెనిఫిట్ షోలు పడ్డాయి. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో శుక్రవారం నుంచి మూవీ అందుబాటులోకి వచ్చింది. బెనిఫిట్ షోలలో సలార్ టాక్ తెలిసిపోయింది. బొమ్మ బ్లాక్ బాస్టర్ హిట్ అయింది. దేశ వ్యాప్తంగా పాజిటివ్ టాక్ వస్తోంది. ప్రేక్షకులతో పాటు సినీ విమర్శకులు కూడా మంచి రివ్యూలు ఇస్తున్నారు.
ఇక, ఈ సినిమాకు సంబంధించి ఓటీటీ, శాటిలైట్ పార్ట్‌నర్స్ ముందుగానే ఫిక్స్ అయింది. సలార్ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవ్వనుంది. స్ట్రీమింగ్ డేట్ ఇంకా ఫిక్స్ కాలేదు. మూవీకి వస్తున్న ఆదరణను బట్టి సలార్ స్ట్రీమింగ్ కాస్త ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. దాదాపు నెల రోజుల తర్వాత సలార్ స్ట్రీమింగ్ అవ్వనుందని సమాచారం. ఇక, శాటిలైట్ పార్ట్‌నర్ విషయానికి వస్తే.. ఈ మూవీ మా టీవీలోకి రానుంది. టీవీలోకి ఎప్పుడు వస్తుందనే విషయం కూడా తెలీదు.
కాగా, సినిమా విడుదలకు ముందు నుంచి సలార్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రభాస్, ప్రశాంత్ నీల్‌ల కాంబోలో వస్తున్న మూవీ కావటంతో ప్రభాస్ ఫ్యాన్స్‌తో పాటు సగటు సినీ ప్రేక్షకుడు ఇది బ్లాక్ బాస్టర్ హిట్ కావటం ఖాయమని నమ్ముతూ వచ్చారు. సలార్ నుంచి వచ్చిన ప్రతీ అప్‌డేట్ సినిమాపై అంచనాలను పెంచుతూ పోయాయి. డిసెంబర్ 1వ తేదీన వచ్చిన మొదటి ట్రైలర్‌తో ఆ అంచనాలు ఆకాశానికి చేరాయి. ఇందుకు ఆ ట్రైలర్ సాధించిన రికార్డులే ప్రత్యక్ష ఉదాహరణ.
ట్రైలర్ యూట్యూబ్‌లో విడుదలైన 18 గంటల్లోనే దాదాపు 100 మిలియన్లకు పైగా వ్యూస్ కొల్లగొట్టింది. విడుదలైన అన్ని భాషల్లో ప్రభంజనం సృష్టించింది. మొన్నీ మధ్య వచ్చిన సెకండ్ ట్రైలర్ కూడా వ్యూస్ విషయంలో రికార్డులు కొల్లగొట్టింది. ఇప్పటి వరకు 100 మిలియన్లకుపైగా వ్యూస్ తెచ్చుకుంది. కేవలం ప్రభాస్, ప్రశాంత్ నీల్‌ల స్టామినాపై నమ్మకంతో సలార్ బృందం ప్రమోషన్లు కూడా చేయలేదు. ఎటువంటి ప్రమోషన్లు లేకపోయినా.. ప్రీ బుకింగ్స్ విషయంలో సలార్ దూసుకుపోయింది.
ప్రపంచ వ్యాప్తంగా కోట్ల రూపాయల బిజినెస్ చేసింది. ఓవర్‌సీస్‌లో అయితే, సలార్ క్రేజ్ ఆకాశమే హద్దుగా సాగింది. మొదటి రోజు కలెక్షన్ల విషయంలో సలార్ సరికొత్త రికార్డును క్రియేట్ చేస్తుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఫస్ట్ కలెక్షన్ల విషయంలో సలార్ 150 కోట్ల రూపాయలు కొల్లగొడుతుందని భావిస్తున్నారు. మరి, సలార్ సినిమా సాధించిన విజయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.