Paruvu Web Series Review And Rating In Telugu: ప్రతి వారం ఓటీటీ లో చాలా సినిమాలు సిరీస్ లు రిలీజ్ అవుతూ ఉన్నాయి. ఈ క్రమంలో లేటెస్ట్ గా జీ5 లో రిలీజ్ అయినా ఓ ఇంట్రెస్టింగ్ తెలుగు వెబ్ సిరీస్ "పరువు". మరి ఈ సిరీస్ ఎలా ఉందో రివ్యూలో చూసేద్దాం.
Paruvu Web Series Review And Rating In Telugu: ప్రతి వారం ఓటీటీ లో చాలా సినిమాలు సిరీస్ లు రిలీజ్ అవుతూ ఉన్నాయి. ఈ క్రమంలో లేటెస్ట్ గా జీ5 లో రిలీజ్ అయినా ఓ ఇంట్రెస్టింగ్ తెలుగు వెబ్ సిరీస్ "పరువు". మరి ఈ సిరీస్ ఎలా ఉందో రివ్యూలో చూసేద్దాం.
Swetha
ప్రస్తుతం వెబ్ సిరీస్ లకు ఆదరణ బాగా పెరిగిపోయింది. దీనితో ప్రేక్షకులకు వెబ్ సిరీస్ ల మీద ఉన్న ఇంట్రెస్ట్ తో ఈ మేకర్స్ కొత్త కథలను ప్రేక్షకుల ముందుకు తీసుకురడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో రీసెంట్ గా జీ 5 లో “పరువు” అనే ఓ వెబ్ సిరీస్ రిలీజ్ అయింది. ఈ సిరీస్ లో నివేదా పేతురాజ్ , నరేష్ అగస్త్య , నాగ బాబు ప్రధాన పాత్రలలో నటించగా.. సిద్దార్ధ్ నాయుడు , రాజశేఖర్ వడ్లపాటి కలిసి ఈ సిరీస్ కు దర్శకత్వం వహించారు. కాగా ఈ సిరీస్ ను సుస్మిత కొణిదెల, విష్ణు ప్రసాద్ నిర్మించారు. మరి ఈ సిరీస్ స్టోరీ ఏంటో .. ఈ సిరీస్ ఎలా ఉందో రివ్యూ లో చూసేద్దాం.
పరువు సిరీస్ కథేంటంటే:
ఆంధ్రప్రదేశ్ కు చెందిన అమ్మాయి పల్లవి అలియాస్ డాలి( నివేద పేతురాజ్). ఆమె తెలంగాణ అబ్బాయి సుధీర్(నరేష్ అగస్త్య) ను ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. ఈ విషయాన్నీ ఆమె కుటుంబ సభ్యులు యాక్సెప్ట్ చేయరు. ఆమె కుటుంబంతో పాటు బంధువులంతా కూడా ఆమెను దూరం పెడతారు. దీనితో పెళ్లి తర్వాత డాలి.. సుధీర్ తో కలిసి హైదరాబాద్ లో నివాసం ఉంటూ ఉంటుంది. ఓ రోజు ఆమెకు తన పెదనాన్న చనిపోయాడనే వార్తా తెలుస్తుంది. దీనితో ఆమె చివరిసారి తన పెదనాన్నను చూడడానికి భర్తతో కలిసి.. సొంత ఊరికి బయలుదేరుతుంది. ఈ క్రమంలో ఆ జంట డాలి బావ ఆయన చందు (సునీల్ కొమ్మిశెట్టి) కార్ ఎక్కాల్సి వస్తుంది. చందుకు ఇష్టం లేకపోయినా సరే.. వారిని కార్ ఎక్కించుకుని.. సుధీర్ ను అవమానిస్తూ తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటాడు.
తన భర్తను అవమానించడం తట్టుకోలేని డాలి.. చందుతో వాగ్వాదానికి దిగుతుంది. ఈ క్రమంలోనే చందు దగ్గర ఓ తుపాకీ ఉన్నట్లు గమనిస్తుంది. తమను చంపేందుకే అతను ఆ తుపాకీ తీసుకుని వచ్చాడనే అనుమానం వారికి మొదలవుతుంది. ఈ క్రమంలోనే సుధీర్ కి చందుకి మధ్య గొడవ జరుగుతుంది. ఆ ఆవేశంలో సుధీర్ చందు తలపై రాడ్ తో కొట్టడంతో చందు చనిపోతాడు. దీనితో వారిద్దరూ ఆ శవాన్ని ఎవరి కంట పడనివ్వకూడదనే నిర్ణయానికి వస్తారు. ఇక మరోవైపు చందుతో పెళ్లి నిశ్చయం అయినా స్వాతి(ప్రణీత పట్నాయక్).. చందు కనిపించడం లేదంటూ.. తెలిసిన వారందరికీ ఫోన్స్ చేస్తుంది. ఆ ఊరి ఎమ్మెల్యే రామయ్య(నాగ బాబు) తనకు కాబోయే భర్తను కిడ్నప్ చేయించి ఉంటాడు అనే అనుమానం వ్యక్తం చేస్తుంది.
అసలు రామయ్యకు , చందుకు ఉన్న సంబంధం ఏంటి ? పెదనాన్న చివరి చూపుల కోసం సొంత ఊరికి బయల్దేరిన డాలికి ఎలాంటి అవమానాలు ఎదురయ్యాయి ? చందు శవాన్ని డాలి , సుధీర్ ఏం చేశారు ? వారు ఏదైనా పోలీస్ కేసులో ఇరుకున్నారా ! చందు కనిపించడం లేదని పోలీసులు అతని కోసం సెర్చ్ చేసే క్రమంలో.. వారికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి ! చివరకు ఈ కథ ఎలా ముగిసింది ! పరువు అనే టైటిల్ కు ఈ కథ కు ఎలాంటి సంబంధం ఉంది ? ఇవన్నీ తెలియాలంటే ఈ వెబ్ సిరీస్ ను ఒక్క ఎపిసోడ్ కూడా మిస్ కాకుండా చూడాల్సిందే.
పరువు సిరీస్ ఎలా ఉందంటే !
ఈ సిరీస్ లో మెయిన్ ప్లాట్ ఏంటో టైటిల్ ని బట్టే గెస్ చేయొచ్చు. ప్రేమ , పరువు , హత్యల నేపథ్యంలో రూపొందించిన సిరీస్ అని.. పోస్టర్స్ , ట్రైలర్ ను చూసి అందరూ ఈ కథను ఊహించుకుని ఉంటారు. కాస్త ఆ ఊహాగానాలు నిజమే అయినా కూడా.. అనుకోకుండా హత్య చేయబడిన శవాన్ని.. ఎవరి కంట పడకుండా భార్య భర్తలు ఏం చేశారు అనేదే.. ఈ సిరీస్ మెయిన్ ప్లాట్. ఓ వైపు డాలి , సుధీర్ జంట సొంత ఊరికి బయల్దేరడం, మరో వైపు ఇంకొక జంట ఇంటి నుంచి పారిపోవడం.. ఇలా రెండు సన్నివేశాలను చూపిస్తూ ఈ సిరీస్ ను స్టార్ట్ అవుతుంది. ప్రెసెంట్ జరుగుతున్న సీన్స్ ను, గతంలో జరిగిన సీన్స్ ను ఒకేసారి చూపించడంతో.. చూసేటప్పుడు కాస్త కన్ఫ్యూజన్ గా అనిపిస్తూ ఉంటుంది.
ఈ సిరీస్ మొత్తంగా 8 ఎపిసోడ్స్ ఉంటుంది. ఒక్కో ఎపిసోడ్ రన్ టైమ్ 40 నిమిషాల పైనే ఉంటుంది. మెయిన్ గా డాలి, సుధీర్ లను హైలెట్ చేస్తూ ఈ సిరీస్ కథను కొనసాగించారు. ఎప్పుడైతే సుధీర్ చందును హత్య చేస్తాడో అక్కడి నుంచి ఈ సిరీస్ కాస్త ఫాస్ట్ గా కొనసాగుతూ ఉంటుంది. శవాన్ని దాచిపెట్టేందుకు భార్య భర్తలిద్దరూ వేసే ప్లాన్.. దాదాపు ప్రేక్షకులు గెస్ చేసేలానే ఉంటాయి. ఇక కథ ముందుకు కదిలే కొద్దీ కథలో కొత్త మలుపులు, కొత్త పాత్రలు ఎదురౌతూ ఉంటాయి. చందు కోసం వెతికే క్రమంలో. అతనికి కాబోయే భార్య.. రామయ్యను బ్లాక్ మెయిల్ చేయడం. పోలీసులు చందు కోసం సెర్చ్ చేసే క్రమంలో.. రాజకీయ విబేధాల గురించి బయటపడడం. ఇవన్నీ కూడా ఒకటే ఘటనకు లింక్ చేసే విధానం. ప్రేక్షకులకు థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. క్లైమాక్స్ అయితే ఎవరు ఊహించని విధంగా ఉంటుంది. ఇక ఎండ్ లో ఓ స్పెషల్ క్యారెక్టర్ ద్వారా సీజన్ 2 కూడా ఉంటుందనే హింట్ ఇవ్వగానే ఇచ్చారు మేకర్స్.
ఎవరెలా చేశారంటే ?
నరేష్ అగస్త్య అంతకముందు సేనాపతి మూవీతోనే తన టాలెంట్ ను నిరూపించుకున్నాడు. ఇక ఇప్పుడు పరువు లోను అదే రేంజ్ లో నటించి.. ప్రేక్షకులను మెప్పించారు. ఇక నివేద పేతు రాజ్ తన పాత్రలో ఒదిగి పోయారని చెప్పి తీరాలి. ఇక నాగబాబు రోల్ విషయానికొస్తే.. నాగబాబు క్యారెక్టర్ నిడివి ఇంకా కొద్దిసేపు ఉంటే బాగుండేది అనిపించే విధంగా ఉంది. ఇక ఈ సిరీస్ లు మిగిలిన నటి నటులంతా కూడా.. వారి వారి పాత్రలకు న్యాయం చేశారు. మరి సీజన్ 2 లో వీరి పాత్రలకు ఎలాంటి ప్రాధాన్యత ఉండనుంది అనే దానికోసం వేచి చూడాలి. ప్రతి పాత్రను ఎంతో సున్నితంగా డీల్ చేస్తూ.. కథను ఎంగేజింగ్ గా చెప్పడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడనే చెప్పి తీరాలి.
చివరిగా : ‘పరువు’ మంచి థ్రిల్లింగ్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది.
రేటింగ్: 2.5/5