Tirupathi Rao
Fahadh Faasil Dhoomam Movie OTT Review In Telugu: ఫహద్ ఫాజిల్- అపర్ణా బాలమురళి కాంబోలో వచ్చిన ధూమం సినిమా ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. మరి.. ఆ సినిమా ఎలా ఉంది? తెలుగు ప్రేక్షకులను మెప్పించిందా? తెలియాలంటే ఈ రివ్యూ చూసేయండి.
Fahadh Faasil Dhoomam Movie OTT Review In Telugu: ఫహద్ ఫాజిల్- అపర్ణా బాలమురళి కాంబోలో వచ్చిన ధూమం సినిమా ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. మరి.. ఆ సినిమా ఎలా ఉంది? తెలుగు ప్రేక్షకులను మెప్పించిందా? తెలియాలంటే ఈ రివ్యూ చూసేయండి.
Tirupathi Rao
ధూమపానం ఆరోగ్యానికి హానికరం.. ప్రైగా ప్రాణంతకం. ఈ టైటిల్ ప్రతి సినిమాలో మీరు చూస్తూనే ఉంటారు. కానీ, అలాంటి ఒక పాయింట్ తో సినిమా వస్తుంది అని అనుకున్నారా? అయితే ఇది ధూమపానం చేయడం గురించి కాదు.. ధూమపానం మీద కోట్లు సంపాదించడం గురించి తీశారు. ఈ సినిమాకి బిగ్ అసెట్ ఫహద్ ఫాజిల్ అనే చెప్పాలి. మరి.. ఎంతగానో హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమా ప్రస్తుతం తెలుగు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే. అయితే ఓటీటీలోకి వచ్చిన తర్వాత తెలుగు ప్రేక్షకులను మెప్పించిందా? తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలు ఈ సినిమాలో ఏమైనా ఉన్నాయా? ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం.
ఈ సినిమా అవినాష్(ఫహద్ ఫాజిల్) అనే వ్యక్తి జీవితం చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఒక సిగరెట్ తయారీ కంపెనీలో ఒక మంచి ఉద్యోగం సాధిస్తాడు. తన మాటలు, మార్కెటింగ్ స్ట్రాటజీతో ఆ కంపెనీ ఎండీ సిద్ధార్థ్(రోషన్ మాథ్యూ)ని మెస్మరైజ్ చేయడమే కాకుండా.. ఆ కంపెనీ సేల్స్ ని కూడా విపరీతంగా పెంచేస్తాడు. అందుకు గానూ.. తన జీవితం మారిపోతుంది. మంచి సౌకర్యాలు, మంచి జీతంతో జీవితం ఆనందంగా సాగిపోతుంది. కానీ, అవినాష్.. సిద్ధు తీసుకున్న ఒక నిర్ణయంతో విభేదిస్తాడు. అంతాకాకుండా రాజీనామా చేసి కంపెనీ నుంచి బయటకు వచ్చేస్తాడు. ఆ తర్వాత అవినాష్ జీవితంలో ఊహించని సంఘటనలు జరుగుతాయి. తనను ఒక బ్లాక్ మెయిలర్ ఇబ్బంది పెడుతూ ఉంటాడు. తన భార్య శరీరంలో ఒక మైక్రో బాంబ్ పెట్టి అతనితో తప్పులు చేయిస్తూ ఉంటాడు. అసలు ఆ బ్లాక్ మెయిలర్ ఎవరు? భార్యను అతని నుంచి కాపాడుకున్నాడా? అసలు అవినాష్ విభేదించేలా సిద్ధార్థ్ తీసుకున్న ఆ నిర్ణయం ఏంటి? ఇలాంటి ఆసక్తికర విషయాలు తెలియాలి అంటే.. మీరు ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న ధూమం సినిమా చూడాల్సిందే.
ధూమం సినిమాని ఒక కొత్త కాన్సెప్ట్ తో తీసుకొచ్చారు. ఈ మూవీలో ఎలాంటి కమర్షియల్ హంగులు లేకుండా కథను నమ్ముకుని ముందుకు వెళ్లిన చిత్రం ఇది. ఒక సిగరెట్ కంపెనీ సేల్స్ పెంచడానికి ఎలాంటి స్ట్రాజీలు వాడతారు.. ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అనేది చూస్తున్న ఆడియన్ ను ఎంతగానో ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అలాగే వాళ్లు కోట్లకు అధిపతి కావడానికి సామాన్యుడి ఆరోగ్యాన్ని ఎలా వాడుకుంటున్నారు అనేది కూడా కనిపిస్తుంది. అందుకు.. ఈ సినిమాలో ఒక సీన్ ని ఉదాహరణగా చెప్తే సరిపోతుంది. కారులో వెళ్తున్న సిద్ధార్థ్.. అవినాష్ తో బయట ఉన్న మనుషులను చూపిస్తూ.. వీళ్లంతా నాకు రోజుకు రూ.300 కట్టాలి అని అంటాడు. అంటే వాళ్లతా సిద్ధు సిగరెట్లు కొనుగోలు చేయాలి అనేలా చెప్తాడు.
ఆ సీన్ చూస్తే.. సిగరెట్ల కంపెనీల ఆలోచనా విధానం అలాగే ఉంటుంది.. అనిపిస్తుంది. బడా కంపెనీలు.. బడా బడా జీతాలు, ఉద్యోగాల చట్రంలో ఒక యువకుడు, అతని భార్య ఎలా చిక్కుకున్నారు అనే విధానాన్ని చాలా కన్విన్సింగ్ గా చూపించారు. అలాగే బ్లాక్ మెయిలర్- అవినాష్ మధ్య జరిగే సీన్స్ రక్తి కట్టిస్తాయి. అంతేకాకుండా.. అతను చెప్పే పనులు చేస్తూనే.. భార్యను కాపాడుకోవడం కోసం అవినాష్ చేసే ప్రయత్నాలు మెప్పిస్తాయి. ప్రస్తుత కథను చూపిస్తూ.. కంపెనీ గురించి ఫ్లాష్ బ్యాక్ చూపించే విధానం మెప్పిస్తుంది.
ఈ సినిమాలో ఫహద్ ఫాజిల్ యాక్టింగ్ కి ఫిదా అయిపోతారు. ఒక విలన్ గా.. హీరోగా.. సపోర్టింగ్ రోల్స్ లో ఫహద్ ని చూసుంటారు. కానీ, ఈ సినిమాలో కథకు తగ్గట్లు చేసే యాక్టింగ్ మీ మైండ్ లో నుంచి పోదు. అలాగే అపర్ణా బాలమురళి కూడా మిమ్మల్ని మెస్మరైజ్ చేస్తుంది. ఈ సినిమాలో రోషన్ మాథ్యూ ఎంతో బలంగా కనిపిస్తాడు. అంతే బలంగా నటించాడు కూడా. ఈ సినిమాలో చాలా లిమిటెడ్ పాత్రలు మాత్రమే ఉంటాయి. అందరూ మిమ్మల్ని తప్పకుండా అలరిస్తారు. ఇంక టెక్నికల్ పని తీరు చూస్తే.. డైరెక్టర్ కథ చెప్పే విధానం మిమ్మల్ని కచ్చితంగా మెప్పిస్తుంది. అలాగే క్లైమ్యాక్స్ అస్సలు ఊంహిచలేరు. రెగ్యూలర్ గా మీరు చూసే కమర్షియల్ సినిమాలకు ఎంతో భిన్నంగా ధూమం సినిమా క్లయిమ్యాక్స్ ఉంటుంది. దర్శకుడు పవన్ కుమార్.. రచయితగానే ఎక్కువ మార్కులు సాధించడం విశేషం. కథలో విషయంలో ఉంటే.. సినిమాలో కమర్షియల్ హంగులు అక్కర్లేదు అని ఈ చిత్రం మరోసారి నిరూపించినట్లు అయ్యింది. టెక్నికల్ పరంగా ఈ సినిమాకి మంచి మార్కులే పడతాయి.
చివరిగా: ధూమం మెసేజ్ మెప్పిస్తుంది.