Brinda Web Series OTT Telugu Review: ఓటీటీ లో ఈ వారం రిలీజ్ అయ్యే సినిమాలు , సిరీస్ ల జాబితాలో.. అందరు ఎదురుచూస్తున్న సిరీస్ త్రిష మెయిన్ లీడ్ లో నటించిన 'బృంద' వెబ్ సిరీస్. మరి ఈ సిరీస్ ఎలా ఉందో రివ్యూలో చూసేద్దాం .
Brinda Web Series OTT Telugu Review: ఓటీటీ లో ఈ వారం రిలీజ్ అయ్యే సినిమాలు , సిరీస్ ల జాబితాలో.. అందరు ఎదురుచూస్తున్న సిరీస్ త్రిష మెయిన్ లీడ్ లో నటించిన 'బృంద' వెబ్ సిరీస్. మరి ఈ సిరీస్ ఎలా ఉందో రివ్యూలో చూసేద్దాం .
Swetha
ఈ మధ్య కాలంలో నేరుగా ఓటీటీ లో రిలీజ్ అయ్యే సినిమాలు , సిరీస్ లు ఎక్కువైపోయాయి. అందులోను నిన్న మొన్నటి వరకు వెండి తెరపై అలరించిన నటి నటులు ఇప్పుడు.. ఓటీటీ లకు పెరుగుతున్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని.. వారు కూడా ఓటీటీ బాట పడుతున్నారు. ఈ లిస్ట్ లోకి ఇప్పుడు టాలీవుడ్ హీరోయిన్ త్రిష కూడా యాడ్ అయింది. ఇప్పటివరకు ఎన్నో సినిమాలతో ప్రేక్షకులను మెప్పించిన త్రిష.. తాజాగా బృంద అనే వెబ్ సిరీస్ లో నటించింది. ఈ సిరీస్ సోనీలివ్ లో .. తెలుగుతో పాటు తమిళ , కన్నడ , మలయాళ, మరాఠీ , బెంగాలీ,హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఈ సిరీస్ ఎలా ఉందో రివ్యూ లో చూసేద్దాం.
బృంద(త్రిష) అనే లేడి ఎస్సై.. హైదరాబాద్ లోని కాటేరు అనే స్టేషన్ లో వర్క్ చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలో ఓ రోజు ఆమెకు అదే స్టేషన్ పరిధిలో ఓ గుర్తుతెలియని మృతదేహం లభిస్తుంది. దీనితో ఆమెకు అనుమానం మొదలయ్యి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయగా.. అలాంటి గుర్తుతెలియని మృత దేహాలు ఇంకా చాలా ఉన్నాయని.. ఇవన్నీ ఓ సీరియల్ కిల్లర్ చేశాడనే విషయం తెలుసుకుంటుంది. ఈ క్రమంలో ఆమె సమాజంలో బాగా పలుకుబడి ఉన్న సైకాలజీ ప్రొఫెసర్ కబీర్ ఆనంద్(ఇంద్రజిత్ సుకుమారన్).. ఈ హత్యలన్నీ చేసి ఉంటాడనే అనుమానిస్తోంది. కానీ అది తప్పని తేలడంతో… ఆమెను విధుల నుంచి సస్పెండ్ చేస్తారు. కానీ ఆమె సస్పెన్షన్ తర్వాత కూడా ఈ కేసును విచారిస్తూనే ఉంటుంది. ఈ ప్రాసెస్ లో ఆ సీరియల్ కిల్లర్ చేసిని ఒకటి రెండు మర్డర్స్ కాదని.. పదుల సంఖ్యలో ఎంతో మందిని దారుణంగా చంపేశాడనే విషయాలు తెలుస్తాయి. అసలు ఈ హత్యల వెనుక దాగి ఉన్నది ఎవరు? సైకాలజీ ప్రొఫెసర్ కబీర్ ఆనంద్ ఎవరు ? అతనిపై బృంద కు ఎందుకు అనుమానం కలుగుతుంది ? చివరకు ఆమె ఈ కేసును సాల్వ్ చేయగలిగిందా లేదా? ఆ సీరియల్ కిల్లర్ ను పట్టుకుందా లేదా ? అనేదే తెరపై చూడాల్సిన కథ.
సీరియల్ కిల్లర్ మర్డర్స్ , పోలీసులు దానికి విచారించడం.. అనే ఈ కాన్సెప్ట్ కు ప్రేక్షకులు ఇప్పటికే అలవాటు పడి ఉన్నారు. కాబట్టి ఇది కొత్త కాన్సెప్ట్ అయితే కాదు. ఇలాంటి కథలలో ప్రేక్షకుల ఇంట్రెస్ట్ అంతా.. పోలీసులు ఆ కేసును ఎంత ఇన్నోవేటివ్ గా సాల్వ్ చేశారు అనే దానిపైనే ఉంటుంది. ఈ విషయంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడని చెప్పి తీరాలి. ఒక అనుమానాస్పదమైన మర్డర్.. దాని గురించి తెలుసుకునే ప్రయత్నంలో మరెన్నో దారుణమైన హత్యలు. ఇలా కథ ముందుకు సాగుతున్న కొద్దీ.. తర్వాత ఏం జరుగుతుందా అనే ఆసక్తి అందరిలో కలుగుతుంది.
అయితే సాధారణంగా ఇలాంటి సీరియల్ కిల్లింగ్ కథలలో.. హంతకుడు ఎవరు అనే విషయం చివరి వరకు రివీల్ చేయకుండా దానిని మెయిన్ సస్పెన్స్ గా ఉంచుతారు. కానీ ఈ సిరీస్ లో మాత్రం అది ముందే రివీల్ చేసిన కూడా.. ఆ ఇన్వెస్టిగేషన్ ఎలా కొనసాగించారు అనే దానిపైనే అందరి ఫోకస్ ఉండేలా చేశారు. మొదటి ఎపిసోడ్ నుంచే తర్వాత ఏం జరుగుతుందా అనే ఆసక్తి ఆడియన్స్ లో కలుగుతుంది. మొత్తం 8 ఎపిసోడ్స్ గా రూపొందించిన ఈ సిరీస్ లో మొదటి ఐదు ఎపిసోడ్స్ .. ఇంట్రెస్టింగ్ గానే కొనసాగిన కూడా.. చివరి మూడు ఎపిసోడ్స్ మాత్రం కాస్త సాగాతీసినట్లు అనిపిస్తాయి. కానీ పోలీసులు కేసును సాల్వ్ చేసిన తీరు మాత్రం ఆద్యంతం ఆకట్టుకుంటుంది.
ఈ సిరీస్ లో అన్నిటికంటే హైలెట్ గా నిలిచింది శక్తి కాంత్ కార్తీక్ అందించిన సంగీతం అని చెప్పి తీరాలి. అంతే కాకుండా అడవిని , హైదరాబాద్ సిటీని రెగ్యులర్ గా కాకుండా సరికొత్తగా చూపించారు. ఇక త్రిష నటన విషయానికొస్తే.. ఇప్పటివరకు సినిమాలలో కనిపించని విధంగా.. ఈ సిరీస్ లో కనిపించారు. ఓ విధంగా చెప్పాలంటే ఓటీటీ కోసం త్రిష తన కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చినట్లే. ఒక ఫీమేల్ పోలీస్ ఆఫీసర్ .. సీరియల్ కిల్లింగ్ కేసులను సాల్వ్ చేసే క్రమంలో ఎలాంటి పరిస్థితులను ఎదుర్కుంటారు? ఆమెకు తన గతం గుర్తుకువచ్చినపుడు.. ఆమె బాధ పడిన తీరు అంతా కూడా చాలా సహజంగా అనిపిస్తుంది. అలాగే రవీంద్ర విజయ్ , ఇంద్రజిత్ సుకుమారన్.. కూడా తమ నటనలో సహజత్వాన్ని చూపించారు. ఒక ఎపిసోడ్ స్టార్ట్ చేస్తే.. చివరి వరకు కూడా ఆపకుండా చూసేలా.. ప్రేక్షకులను ఎంగేజ్ చేయడంలో.. డైరెక్టర్ సూర్య మనోజ్ వంగాల సక్సెస్ అయ్యాడని చెప్పి తీరాలి. ఈ మధ్య కాలంలో వచ్చిన మర్డర్ మిస్టరీ సస్పెన్స్ థ్రిల్లర్స్ లో.. ఇది కూడా బెస్ట్ హార్ట్ గ్రిప్పింగ్ సస్పెన్స్ డ్రామా అని చెప్పి తీరాలి. కాబట్టి వెంటనే ఈ సిరీస్ ను చూసేయండి.
చివరిగా: బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్స్ లో ‘బృంద’ కూడా ఒకటిగా నిలిచింది.
రేటింగ్ : 3/5