Yodha OTT: OTT లో ఫ్రీ స్ట్రీమింగ్ కు వచ్చేసిన బాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్.. కానీ ఆ విషయంలో మాత్రం!

టాలీవుడ్ సినిమా అయినా కానీ బాలీవుడ్ సినిమా అయినా కానీ.. తమ అభిమాన నటి నటుల కోసమో.. కథ కోసమో అన్ని సినిమాలను చూస్తూ ఉంటారు మూవీ లవర్స్. ఈ క్రమంలో ఓ బాలీవుడ్ సినిమా ఓటీటీ ఫ్రీ స్ట్రీమింగ్ గురించి ఇంట్రెస్టింగ్ టాక్ వినిపిస్తుంది, దానికి సంబందించిన వివరాలు ఇలా ఉన్నాయి.

టాలీవుడ్ సినిమా అయినా కానీ బాలీవుడ్ సినిమా అయినా కానీ.. తమ అభిమాన నటి నటుల కోసమో.. కథ కోసమో అన్ని సినిమాలను చూస్తూ ఉంటారు మూవీ లవర్స్. ఈ క్రమంలో ఓ బాలీవుడ్ సినిమా ఓటీటీ ఫ్రీ స్ట్రీమింగ్ గురించి ఇంట్రెస్టింగ్ టాక్ వినిపిస్తుంది, దానికి సంబందించిన వివరాలు ఇలా ఉన్నాయి.

ఓటీటీ లోకి ఏ ఏ సినిమాలు వస్తాయా.. ఎప్పుడెప్పుడు చూద్దామా అని మూవీ లవర్స్ ఎదురుచూస్తూ ఉంటారు. ఈ క్రమంలో కొన్ని సినిమాలు మొదట రెంటల్ విధానంలో రిలీజ్ చేస్తూ ఉంటారు మేకర్స్. ఇక ఆ తర్వాత వాటిని ఫ్రీ స్ట్రీమింగ్ కు తీసుకుని వస్తారు. ఇప్పుడు తాజాగా ఓటీటీ లోకి వచ్చిన బాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ యోధా సినిమా కూడా మొన్నటి వరకు రెంటల్ విధానంలో ఉండగా .. ఇప్పుడు ఫ్రీ స్ట్రీమింగ్ కు వచ్చినట్లు సమాచారం. మరి ఈ సినిమా ఏ ప్లాట్ ఫార్మ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమా టాక్ ఏ విధంగా ఉంది. అనే పూర్తి విషయాలను చూసేద్దాం.

బాలీవుడ్ యంగ్ హీరో సిద్దార్ధ్ మల్హోత్రా , రాశి ఖన్నా, దిశా పటాని ముఖ్య పాత్రలు పోషించిన సినిమా “యోధా”. ఈ సినిమాను బాలీవుడ్ ప్రముఖ దర్శక నిర్మాత కరణ్ జోహార్ సమర్పించగా.. కొత్త డైరెక్టర్స్ సాగర్ అంబ్రే, పుష్కర్ ఓజా దర్శకత్వం వహించారు. కాగా ఈ సినిమా మార్చి 15న థియేటర్స్ లో రిలీజ్ అయింది. భారీ అంచనాల మధ్యన థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. రూ. 55 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం.. బాక్సాఫీస్ దగ్గర రూ. 53 కోట్ల కలెక్షన్స్ ను మాత్రమే రాబట్టగలిగింది. దీనితో ఈ సినిమాను ఏప్రిల్ 26 నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ఈ సినిమాను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ స్ట్రీమింగ్ చేస్తుంది. అయితే మొదట ఈ సినిమాను రెంటల్ విధానంలో ముందుకు అందుబాటులోకి తీసుకుని వచ్చారు. అయితే, తాజాగా మాత్రం ఈ సినిమాను ఎలాంటి రుసుము లేకుండా ఫ్రీ గా వీక్షించేలా అందుబాటులోకి తీసుకుని వచ్చింది అమెజాన్ ప్రైమ్.

అయితే, ప్రస్తుతానికి ఈ సినిమా కేవలం హిందీలో మాత్రమే అందుబాటులో ఉంది. ఇది తెలుగు ప్రేక్షకులకు కాస్త నిరాశ పడాల్సిన విషయమే కానీ, త్వరలో తెలుగులోకి కూడా తీసుకుని వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు. అయినా ఇప్పుడు దాదాపు ప్రేక్షకులంతా కూడా భాషతో సంబంధం లేకుండా అన్ని సినిమాలను చూసేస్తున్నారు కాబట్టి ఈ సినిమాను కూడా ఎంచక్కా చూసేయొచ్చు. మరి ఇప్పుడు ఫ్రీ స్ట్రీమింగ్ వచ్చేసింది కాబట్టి ఈ సినిమా ఓటీటీ లో ఎలాంటి టాక్ సంపాదించుకుంటుందో వేచి చూడాలి. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments