Krishna Kowshik
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి.. ఆయన తనయుడు, ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పొలిటికల్ జర్నీ ఆధారంగా తెరకెక్కిన సినిమా యాత్ర 2. ఫిబ్రవరిలో థియేటర్లలో సందడి చేసిన ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి.. ఆయన తనయుడు, ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పొలిటికల్ జర్నీ ఆధారంగా తెరకెక్కిన సినిమా యాత్ర 2. ఫిబ్రవరిలో థియేటర్లలో సందడి చేసిన ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది.
Krishna Kowshik
ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం యాత్ర. 2019లో వచ్చిన ఈ మూవీ ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలుసు. ఈ సినిమాకు కొనసాగింపుగా యాత్ర 2 వచ్చింది. ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా రెండవసారి అధికారాన్ని చేపట్టిన వైఎస్సార్ అనూహ్యంగా ప్రమాదంలో మరణించిన నాటి నుండి.. ఆయన కుమారుడు జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా గెలిచేంత వరకు చేసిన పోరాటమే యాత్ర2. 2024 ఫిబ్రవరి 8న థియేటర్లలో విడుదలైంది ఈ సినిమా సక్సెస్ అందుకుంది. ఇందులో జగన్ మోహన్ రెడ్డి పాత్రలో తమిళ నటుడు జీవా యాక్ట్ చేసి మెస్మరైజ్ చేశాడు.
జగన్ బాడీ లాంగ్వేజ్, మేనరిజమ్స్‌ను ప్రింట్ చేశాడు జీవా. ఇందులో వైఎస్సార్ పాత్రలో నటించిన మమ్ముట్టి పాత్ర నిడివి తక్కువగా ఉంటుంది. మహి వి రాఘవ రచన దర్శకత్వంలో రూపొందిన యాత్ర2లో కేతిక నారాయణ, మహేష్ మంజ్రేకర్, శుభలేఖ సుధాకర్ తదితరులు కీలక పాత్రలను పోషించారు. శివ మేక నిర్మించిన ఈ సినిమాను వి సెల్యులాయిడ్, త్రీ ఆటమ్స్ లీవ్స్ సంస్థలు డిస్ట్రి బ్యూషన్ బాధ్యతను తీసుకున్నాయి. ఈ సినిమాకు మంచి రేటింగ్స్, రివ్యూస్ వచ్చాయి. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ ఈ పిక్చర్ హక్కులను కొనుగోలు చేసింది. సైలెంట్‌గా వచ్చి ఓటీటీని షేక్ చేస్తుంది.
ఈ నెల 12 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది యాత్ర 2. థియేటర్లలో మూవీని మిస్ అయిన వాళ్లంతా .. ఓటీటీలో వీక్షిస్తున్నారు. చెప్పాలంటే.. థియేటర్ల కన్నా.. భారీ రెస్పాన్స్ వస్తుంది ఓటీటీలో. ఓటీటీలో దూసుకెళుతుంది. ఎక్కువ మంది చూసిన సినిమాగా రికార్డులు సృష్టిస్తోంది. ప్రస్తుతం ట్రెండింగ్ అవుతోంది. ప్రస్తుతం అమె జాన్ ప్రైమ్ స్ట్రీమింగ్ అవుతున్న సినిమాల్లో టాప్ 10 లోపు జాబితాలో ఉంది. స్టార్ హీరో సినిమాలను పక్కన పెట్టి మరీ ఓ బయోపిక్, పొలిటికల్ మూవీ ఈ రేంజ్‌లో ట్రెండింగ్‌లో నిలవడం విశేషం. థియేటర్లలో బ్రహ్మరథం పట్టినట్లే.. ఓటీటీలో కూడా ఈ సినిమాకు మంచి వ్యూస్ వస్తున్నాయి. తండ్రి నుండి రాజకీయ వారసత్వాన్ని తీసుకుని.. పార్టీని ఏర్పాటు చేసి.. సంకల్ప బలంతో గెలిచి.. ముఖ్యమంత్రి అయిన తీరును తెరపైకి ఎక్కించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. అందుకే ఈ సినిమాను కూడా ప్రేక్షకులు అభిమానించారు. సక్సెస్ చేశారు.