Swetha
The GOAT Movie OTT Release Date: చిన్న సినిమాలైనా పెద్ద సినిమాలైనా ఓటీటీ లోకి రావాల్సిందే. ఈ క్రమంలో ఇటీవల థియేటర్స్ లో రిలీజ్ అయినా విజయ్ దళపతి ది గోట్ మూవీ అప్పుడే ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ను ఫిక్స్ చేసుకుంది. దానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
The GOAT Movie OTT Release Date: చిన్న సినిమాలైనా పెద్ద సినిమాలైనా ఓటీటీ లోకి రావాల్సిందే. ఈ క్రమంలో ఇటీవల థియేటర్స్ లో రిలీజ్ అయినా విజయ్ దళపతి ది గోట్ మూవీ అప్పుడే ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ను ఫిక్స్ చేసుకుంది. దానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
Swetha
తమిళ స్టార్ హీరో.. విజయ్ దళపతి ఇటు టాలీవుడ్ లో కూడా అందరికి సుపరిచితుడే. ఈ హీరో లేటెస్ట్ గా నటించిన మూవీ ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. విజయ్ కెరీర్ లో చివరి సినిమాగా ఈ మూవీకి మంచి హైప్ దక్కింది. తమిళంతో పాటు ఈ సినిమాను అన్ని భాషల్లోనూ రిలీజ్ చేశారు. అలా భారీ అంచనాల మధ్యన రిలీజ్ అయినా ఈ మూవీ.. ఆశించిన స్థాయిలో వసూళ్లను రాబట్టలేకపోయింది. తమిళంలో మాత్రం ఈ మూవీకి మంచి టాక్ లభించింది. ఇక థియేటర్ లో సినిమా ఎలా ఉన్నా కానీ.. మూవీ ఎప్పటికైనా ఓటీటీ లోకి రావాల్సిందే. ఈ క్రమంలో అప్పుడే ఈ మూవీ ఓటీటీ టాక్ వినిపిస్తుంది. దానికి సంబంధించిన విషయాలను చూసేద్దాం.
ఈ మధ్య కాలంలో థియేటర్ లో రిలీజ్ అయినా సినిమాలు.. నెలలోపే ఓటీటీ లోకి వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సెప్టెంబర్ 5న థియేటర్ లో రిలీజ్ అయినా ది గోట్ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అయినట్లు సమాచారం. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఇక ఓటీటీ రూల్స్ ప్రకారం ఈ మూవీ అక్టోబర్ 11 నుంచి స్ట్రీమింగ్ కు తీసుకురానున్నట్లు టాక్. అయితే ఇప్పుడు ఎలాగూ సినిమాలు నెలలోపే ఓటీటీ లో ఎంట్రీ ఇస్తున్నాయి కాబట్టి.. ఈలోపే ఓటీటీ ఎంట్రీ ఇచ్చినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. మూవీ స్ట్రీమింగ్ డేట్ పై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరి ఓటీటీ లో ఈ మూవీ ఏ మేరకు ప్రేక్షకులను మెప్పిస్తుందో వేచి చూడాలి.
అయితే ఈ సినిమా హక్కులను నెట్ ఫ్లిక్స్ రూ.110 కోట్లకు కొనుగోలు చేసింది. తమిళంతో పాటు, తెలుగు, హిందీ, మలయాళం . కన్నడ భాషల్లో ఈ మూవీ ఓటీటీ లోకి రానుంది. ఇక ఈ సినిమా విషయానికొస్తే.. ఈ మూవీలో విజయ్ డ్యూయల్ రోల్ లో నటించాడు. రిలీజ్ అయినా 13 రోజుల్లో.. రూ.266 కోట్ల వసూళ్లు సాధించింది. సాధారణంగా విజయ్ సినిమా అంటే.. యాక్షన్ ఎలిమెంట్స్ , స్టైలిష్ డ్యాన్స్ లు ఇలాంటివి ఆసిస్తూ ఉంటారు. కథ ఎలా ఉన్నా సరే కమర్షియల్ ఎలిమెంట్స్ మీద ఫోకస్ పెడితే కచ్చితంగా విజయ్ మూవీ సక్సెస్ అవుతుంది. ఈ క్రమంలో ది గోట్ మూవీ దర్శకుడు కూడా ఇదే రూల్ ను ఫాలో అయ్యాడు . కానీ అందులో కొన్ని బెడిసికొట్టాయి. సో సినిమా అంతంతమాత్రంగానే మెప్పించింది . మరి ఈ మూవీ ఓటీటీ అప్ డేట్ పై.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.