గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి OTT అఫీషియల్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఇటీవలే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. కాగా, ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ అయిన 20 రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తుందని మూవీ మేకర్స్ అఫీషియల్ డేట్ ను కూడా అనౌన్స్ చేశారు. ఇంతకి ఎప్పుడంటే..?

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఇటీవలే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. కాగా, ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ అయిన 20 రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తుందని మూవీ మేకర్స్ అఫీషియల్ డేట్ ను కూడా అనౌన్స్ చేశారు. ఇంతకి ఎప్పుడంటే..?

టాలీవుడ్ యంగ్ హీరో ‘విశ్వక్ సేన్’ ఇటీవలే ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కాగా, ఇందులో నేహా శెట్టి హీరోయిన్ గా, అంజలి కీలక పాత్రలో నటించారు. ఇక యాక్షన్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమాకు కృష్ణ చైతన్య దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమా గతనెల మే 31వ తేదీన థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ అయింది. కానీ, ఈ సినిమా ఆశించిన స్థాయిలో అందరి అంచనాలు అందుకోలేక పోయింది. కేవలం యావరేజ్ టాక్ మాత్రమే సొంతం చేసుకుంది.కానీ, ఇందులో విశ్వక్ తన నటనతో మరొసారి అదరగొట్టేశాడని చెప్పవచ్చు. ఇకపోతే యావరేజ్ టాక్ మాత్రమే తెచ్చుకోవడం ఈ మూవీ రిలీజ్ అయిన నెల రోజులకే ఓటీటీలో సందడి చేయనుందని టాక్ వినిపిస్తుంది.ఈ క్రమంలోనే.. ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ కూడా ఫిక్స్ చేశారు. ఇంతకి స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఈ మధ్య కాలంలో.. వరుస హిట్స్ తో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. అయితే ఇటీవలే ఈ యంగ్ హీరో ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. కాగా, ఈ మూవీ గత నెల మే 31వ తేదీన గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. కానీ, సినిమా మాత్రం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదనే చెప్పవచ్చు. పైగా యావరేజ్ టాక్ మాత్రమే అందుకుంది. అయితే ఇందులో విశ్వక్ మాత్రం అద్భుతంగా నటించాడు. ఇకపోతే ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ అయిన రెండు వారాలు మంచి కలెక్షన్స్ వచ్చాయి కానీ, ఆ తర్వాత రోజుల్లో మాత్రం కలెక్షన్స్ జోరు కాస్త వెనుకబడింది. ఈ క్రమంలోనే.. ఈ మూవీ విడుదలై నెల రోజులు కాకముందే ఓటీటీలో సందడి చేయనుందే టాక్ వినిపించింది. అంతేకాకుండా.. ఈ సినిమాకు ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఇకపోతే తాజాగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ థియేటర్లలో రిలీజ్ అయిన 20 రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తుందని అఫీషియల్ డేట్ ను కూడా అనౌన్స్ చేశారు. ఈ క్రమంలోనే.. ఈ చిత్రం జూన్ 14వ తేది నుంచి తెలుగుతో పాటు,తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కు అందుబాటులోకి రానుందని చిత్ర యూనిట్ సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది.

ఇకపోతే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలో విశ్వక్ సేన్, నేహా శెట్టి, పాటుఅంజలి, నాజర్, సాయి కుమార్, హైపర్ ఆది, గోపరాజు రమణ కీలకపాత్రలు పోషించారు. అలాగే శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై నిర్మాత నాగవంశీ, సాయి సౌజన్యలు ఈ సినిమాను నిర్మించారు. ఇక యువన్ శంకర్ రాజా ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. ఇదిలా ఉంటే.. దాదాపు పదకొండు కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో రిలీజ్ అయిన ఈ సినిమా.. వారం రోజుల్లో రూ.19.20 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. కానీ, ఆ తర్వాత పెద్దగా కలెక్షన్స్ లేకపోవడంతో.. విడుదలైన 20 రోజుల్లోపే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఓటీటీలోకి వచ్చేసింది. ఇక ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి. మరి, వారం రోజుల్లో ఓటీటీలోకి గ్యాంగ్స్ గోదావరి స్ట్రీమింగ్ సిద్ధంగా ఉండటం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments